For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు భారీగా తగ్గుతాయా?

|

2021 సంవత్సరంలో మరో ఐదు ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నిఫ్టీ ఇప్పటికీ 20 వారాల మూవింగ్ యావరేజ్‌తో ఉంది. గతవార 17,003 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ 17,000 మార్కు వద్ద బలమైన మద్దతును కలిగి ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. స్టాక్ మార్కెట్ గతవారం స్వల్పంగా లాభపడ్డాయి. అదే సమయంలో బంగారం ధరలు రూ.48,000 వద్ద నిరోధకాన్ని ఎదుర్కొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగినప్పటికీ, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కాస్త పెరగడంతో దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం పడింది. ఓ దశలో రూ.49,000కు సమీపానికి వెళ్లిన గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం రూ.48,200 స్థాయిలో ఉంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం పసిడి, స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది.

నిఫ్టీ గతవారం స్థాయిలో క్లోజ్

నిఫ్టీ గతవారం స్థాయిలో క్లోజ్

నిఫ్టీ గతవారం 17,156 నుండి 16,410 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ వారం 17,225 కంటే పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ బ్రేకౌట్ 17,225, బ్రేక్ డౌన్ స్థాయి 16,275 పాయింట్లు. నిరోధకస్థాయి 17,100, 17,150, 17225 పాయింట్లు. నిఫ్టీ మద్దతు 16,850స 16,750 పాయింట్లు.

నిఫ్టీ గతవారం ప్రారంభంలో 500 పాయింట్ల మేర కరెక్షన్‌కు గురయింది. దీంతో 17000 పాయింట్ల దిగువకు పడిపోయింది. నాలుగు రోజుల్లో బలమైన రికవరీ కారణంగా 750 పాయింట్లు లాభఫడి దాదాపు గతవారం స్థాయిలో ముగిసింది. నిఫ్టీ 17,300ని మించితే మార్కెట్ ఆటుపోట్ల నుండి బయటపడుతుందని చెప్పలేమని, ఒకవేళ భారీగా ఎగిసి 18000 మార్కు దాటినప్పటికీ మరోసారి దిద్దుబాటు పొంచి ఉంటుందని చెబుతున్నారు.

అస్థిరంగానే...

అస్థిరంగానే...

ఒమిక్రాన్ కేసులు, నెలవారీ డెరివేటివ్స్ డీల్స్ పూర్తి కావడంతో ఈ వారం స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ చుట్టూ ఉన్న భయాందోళనలు, నెలవారీ డీల్స్ ముగింపు కారణంగా మార్కెట్ అస్థిరంగా ఉంటుందని అంటున్నారు. ఏదైనా సానుకూల వార్త మాత్రమే మార్కెట్‌కు ఇప్పుడు బలాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

బంగారం పడిపోతుందా, పెరుగుతుందా?

బంగారం పడిపోతుందా, పెరుగుతుందా?

బంగారం ధరలు గతవారం రూ.48,000 పైనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1810 డాలర్లస్థాయిలో ముగిసింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.49,000 వద్ద బలమైన నిరోధకాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే మాత్రం మరింత ముందుకు సాగవచ్చు. ప్రస్తుత స్థాయి కంటే కిందకు వస్తే రూ.47,800 వద్ద మద్దతు లభించవచ్చునని, ఈ స్థాయి కంటే కిందకు వస్తే మాత్రం రూ.47,600 దిగువకు పడిపోవచ్చునని అంటున్నారు.

English summary

స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు భారీగా తగ్గుతాయా? | Gold and Stock Market Outlook for this week

The Gold is seen as a shield, especially in volatile markets, as stocks and gold traditionally move in different directions.
Story first published: Monday, December 27, 2021, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X