For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఆఫర్, ఈ స్కీంతో FD వడ్డీ రేటుతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు

|

విభిన్న పెట్టుబడి లక్ష్యాలు ఉంటే అంటే స్వల్పకాలిక లక్ష్యం, మధ్యకాలిక లక్ష్యం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉత్తమమైన మార్గాలు. ఫిక్స్డ్ డిపాజిట్స్ సురక్షిత పెట్టుబడి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్‌తో పాటు వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా అదనపు వడ్డీ రేట్లు ఇస్తారు. అయిదు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అలాగే, డిపాజిట్ పైన DICGC డిపాజిట్ ఇన్సురెన్స్ హామీ ఉంటుంది.

వివిధ బ్యాంకుల్లో వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఉంటాయి. DCB బ్యాంకు అందించే హెల్త్ ప్లస్ పిక్స్డ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేస్తే ఉచిత మెడికల్ బెనిఫిట్స్‌తో పాటు ఎమర్జెన్సీ సేవలను ఆకర్షణీయ రిటర్న్స్‌తో పొందవచ్చు. ఈ డిపాజిట్ ఖాతా ఫీచర్స్, ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చూడండి....

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫీచర్స్

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫీచర్స్

- ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ ఓపెన్ చేయవచ్చు.

- ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను కనీస మొత్తం రూ.10,000తో ప్రారంభించవచ్చు. ఇది 700 రోజుల కాలావ్యవధికి మాత్రమే తెరువవచ్చు.

- ఈ ఖాతాను తెరిచేవారు కనీసం పద్దెనిమిదేళ్ల వయస్సు నుండి గరిష్టంగా డెబ్బై సంవత్సరాలు ఉండాలి.

- ప్రైమరీ ఖాతాదారు నాలుగు డీసీబీ హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను తెరువవచ్చు.

- పాక్షిక లేదా ముందస్తు ఉపసంహరణ వంటి ప్రయోజనాలు కూడా ఈ డిపాజిట్ కింద అనుమతిస్తారు.

- ఐసీఐసీఐ లాంబార్డ్ గ్రూప్ టేక్ కేర్ ఇన్సురెన్స్ ప్లాన్ కింద్ మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాతో ఉచిత వైద్య ప్రయోజనాలు, అలాగే ఎమర్జెన్సీ అసిస్టెన్స్ పొందవచ్చు.

- మీ బీమా ప్రొవైడర్ (ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్) ఆమోదించిన వైద్యుల కన్సల్టేషన్ పొందవచ్చు. ఇన్సురెన్స్ ప్రొవైడర్ అపాయింట్ చేసిన డాక్టర్స్ కన్సల్టేషన్స్, కన్సల్టేషన్ ఆధారంగా ఫార్మసీ ఆప్షన్స్, అంబులెన్స్, ఇతర ఎమర్జెన్సీ సేవలను ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ద్వారా పొందవచ్చు.

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌‌తో ఉచిత మెడికల్ బెనిఫిట్స్

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌‌తో ఉచిత మెడికల్ బెనిఫిట్స్

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఉచిత మెడికల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ గ్రూప్ టేక్ కేర్ ఇన్సురెన్స్ ప్లాన్ అందించే ఉచిత వైద్య ప్రయోజనాలు, అత్యవసర సేవలు పొందవచ్చు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.20 లక్షలు అంతకు మించి ఉంటే 10 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD), 10 ఉచిత ఫేస్-టు-ఫేస్ అపాయింటుమెంట్స్, రూ.3000 వరకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఖర్చులు, అపరిమిత అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉంటే 10 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD), 6 ఉచిత ఫేస్-టు-ఫేస్ అపాయింటుమెంట్స్, రూ.1500 వరకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఖర్చులు, అపరిమిత అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు తీసుకుంటే 10 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD), 4 ఉచిత ఫేస్-టు-ఫేస్ అపాయింటుమెంట్స్, రూ.1000 వరకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఖర్చులు, అపరిమిత అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఉంటే 10 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD), 2 ఉచిత ఫేస్-టు-ఫేస్ అపాయింటుమెంట్స్, రూ.500 వరకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఖర్చులు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.1 లక్షల నుండి రూ.3 లక్షల మధ్య ఉంటే 8 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD), 2 ఉచిత ఫేస్-టు-ఫేస్ అపాయింటుమెంట్స్, రూ.500 వరకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఖర్చులు.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్‌ మొత్తం రూ.10,000 నుండి రూ.1 లక్షల మధ్య ఉంటే 4 టెలీ కన్సల్టేషన్స్ (జనరల్ ఫిజిషియన్/స్పెషలిస్ట్/హాస్పిటల్ OPD).

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ 700 రోజుల వరకు ఓపెన్ చేయవచ్చు. 15 మే 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ పైన డీసీబీ బ్యాంకు అందించిన ఇటీవలి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....

- 7 days to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.55%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.05%,

- 15 days to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.55% సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.05%,

- 46 days to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,

- 91 days to less than 6 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 6 months to less than 12 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.70%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.20%,

- 12 months to less than 15 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.80%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.30%,

- 15 months to less than 18 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%

- 18 months to less than 700 days - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 700 days - రెగ్యులర్ వడ్డీ రేటు 6.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.90%.

ఇవి గుర్తుంచుకోండి...

ఇవి గుర్తుంచుకోండి...

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి పాన్ కార్డు అవసరం.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా కోసం మీ మొబైల్ నెంబర్, చిరునామా బ్యాంకులో నమోదు చేసుకోవాలి.

- ఆరోగ్య బీమా సేవలు అందించే బాధ్యత బీమా కంపెనీలది. పైన చర్చించిన ఫీచర్స్‌ను ఉపయోగించుకోవాలా వద్దా అనే అంశాన్ని ఎంచుకోవచ్చు. బీమా ప్రొవైడర్ ఆరోగ్య బీమా సేవలకు బ్యాంకు జవాబుదారీ కాదు లేదా బాధ్యత వహించదు.

- ఆరోగ్య బీమా సేవలను ఉపయోగించుకోవడానికి ముందుగా మీరు మీ మొబైల్ డిఫాల్ట్ యాప్ స్టోర్ నుండి IL Take Care మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

- DCB హెల్త్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి ముందు వర్తించే నిబంధనలు, షరతులు చదవాలి.

English summary

అదిరిపోయే ఆఫర్, ఈ స్కీంతో FD వడ్డీ రేటుతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు | Free Medical Benefits with DCB Health Plus Fixed Deposit scheme

Fixed deposit options come with a range of benefits such as guaranteed returns, additional rates for senior citizens, tax benefits if invested for 5 years, deposit insurance cover provided by DICGC, and so on.
Story first published: Tuesday, August 3, 2021, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X