For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gram Suraksha Scheme: నెలకు రూ.1500 చెల్లిస్తే, చేతికి రూ.35 లక్షలు

|

పెట్టుబడిదారులకు సురక్షిత, భరోసాతో కూడిన రాబడిని అందించే పథకాల్లో ఇండియా పోస్టాఫీస్ స్కీమ్స్ ఉంటాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పెట్టుబడితో వడ్డీ రేటు తద్వారా రిటర్న్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పని తీరు పైన ఆధారపడవు. కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. సురక్షిత పెట్టుబడులు కావాలనుకునే వారు తమ భవిష్యత్తు కోసం ఇండియా పోస్ట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలాంటి పథకాల్లో గ్రామ సురక్ష పథకం ఒకటి. ఈ పథకం కింద నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ.35 లక్షలు చేతికి వస్తాయి.

చేతికి రూ.31 లక్షలకు పైగా

చేతికి రూ.31 లక్షలకు పైగా

ఈక్విటీ మార్కెట్‌లో రాబడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ పుంజుకుంటే మాత్రం ఇతర సురక్షిత పెట్టుబడి కంటే రాబడి అధికంగా ఉంటుంది. అయితే రిస్క్ తీసుకోలేనివారికి మాత్రం వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పోస్టాఫీస్ స్కీం పథకాలు మంచిది. అందులోను ఎక్కువ వడ్డీ ఉన్న దానిని ఎంచుకోవచ్చు. మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో గ్రామ సురక్ష పథకం.

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ ప్లాన్ అత్యుత్తమ ఎంపిక. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. రాబడులు కూడా కాస్త బాగుంటాయి. నష్టపరిహారం చాలా తక్కువ. ఇండియా పోస్ట్ అందించే గ్రామ సురక్ష పథకం ప్రొటెక్షన్ ప్లాన్ తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని ఇస్తుంది. రూ.1500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ.31 లక్షల నుండి రూ.35 లక్షలు చేతికి వస్తుంది.

ఈ పెట్టుబడికి నిబంధనలు

ఈ పెట్టుబడికి నిబంధనలు

- భారతీయుడై ఉండాలి. 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయస్సు కలిగిన ఎవరైనా ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

- గ్రామ సురక్ష పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుండి రూ.10 లక్షలు.

- పోస్టాఫీస్ పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా, వార్షికంగా చెల్లించవచ్చు.

- ప్రీమియం చెల్లింపుకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.

- గ్రామ సురక్ష పథకంలో చేరితో రుణాలు కూడా అందుబాటులో ఉంటాయి.

- ఈ పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత దీనిని సరెండర్ చేయవచ్చు. అయితే మెచ్యూరిటీ తీరకముందే సరెండర్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.

బెనిఫిట్ ఇలా..

బెనిఫిట్ ఇలా..

ఉదాహరణకు ఓ వ్యక్తి పోస్టాఫీస్ పథకంలో పందొమ్మిది ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన గ్రామ సురక్ష పాలసీని కొనుగోలు చేస్తే 55 ఏళ్ల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515 అవుతుంది. 58 ఏళ్లకు రూ.1463, అలాగే 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాలి. 55 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు.

English summary

Gram Suraksha Scheme: నెలకు రూ.1500 చెల్లిస్తే, చేతికి రూ.35 లక్షలు | For just Rs 1500 a month, you can accumulate Rs 35 lakh with this scheme

With any investment, there is a risk factor associated with it. In such a situation, you should invest in such a place where your money is secure and you will get better returns with less risk.
Story first published: Friday, November 5, 2021, 11:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X