దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)ను మంచి ఆప్షన్‌గా చాలామంది భావిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నందున సురక్షితమైనది. అలాగే, ఆకర్షణీయ వడ్డీ రేటు, రిటర్న్స్ ఉంటాయి. వీటిపై ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. దీనిపై పెట్టుడిదారుకు లోన్, విత్‌డ్రా వంటి ప్రయోజనాలు ఉంటాయి. భారతీయులు ఎవరైనా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ల తరఫున కూడా ఓపెన్ చేయవచ్చు.

మార్పులు.. 7.9 శాతం వడ్డీ
ప్రభుత్వం గత ఏడాది పీపీఎఫ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. డిపాజిట్ల పొడిగింపు, వడ్డీ విధానాలలో మార్పులు వంటివి ఉన్నాయి. కొన్ని నిబంధనలను సడలిస్తే, మరికొన్నింటిని కఠినం చేసింది. మొత్తంగా కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా సులభతరం చేసింది. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.9 శాతం వడ్డీ లభిస్తోంది.

మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవచ్చు
PPF అకౌంట్ మినిమం డ్యురేషన్ కనీసం 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత కూడా ఖాతాను పొడిగించుకునే వెసులుబాటు ఉంది. పీపీఎఫ్ ఖాతా లేదా పొడిగించిన పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ అయన తర్వాత ఏడాదిలోగా దీనిని పూర్తి చేయాలి. ఇందుకు ఫారం 4ను ఇవ్వాలి. గతంలో పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకునేందుకు ఫారం హెచ్ ఇవ్వాల్సి వచ్చేది.

డిపాజిట్లు లేకుండా కొనసాగించవచ్చు
మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతాను ఎలాంటి డిపాజిట్లు లేకుండానే కొనసాగించుకునే వెసులుబాటు ఉంది. ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీని పొందవచ్చు. ఇలాంటి సందర్భాలలో సదరు పీపీఎఫ్ ఖాతాదారు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నగదు తీసుకునే అవకాశముంటుంది.

మాగ్జిమం డిపాజిట్ పరిమితి
ఇదివరకు ఏడాదిలో గరిష్టంగా 12 డిపాజిట్లకు అనుమతి ఉంది. ఇప్పుడు రూ.50తో గుణించేలా ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1.5 లక్షల డిపాజిట్ పరిమితి దాటకూడదు.

పీపీఎఫ్ ఖాతా మూసివేత
పీపీఎఫ్ ఖాతాను ముందే మూసివేసేందుకు నిబంధనలు జత చేశారు. రెసిడెన్సీ స్టేటస్ మారినట్లు పాస్‌పోర్ట్, వీసా లేదా ఆదాయపు పన్ను రిటర్న్ కాపీ అందించి పీపీఎఫ్ ఖాతాను పర్మినెంట్‌గా క్లోజ్ చేసుకోవచ్చు.

లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పీపీఎప్ మనీలో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతాను తెరిచిన తర్వాత మూడో సంవత్సరం నుండి ఆరో సంవత్సరం మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. పీపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి తీసుకునే రుణంపై వడ్డీ రేటును ప్రభుత్వం 1 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 2 శాతంగా ఉండేది.

36 నెలల్లో చెల్లించాలి
పీపీఎఫ్ పైన తీసుకునే రుణాన్ని 36 నెలల్లో చెల్లించాలి. లేదంటే బకాయి మొత్తంపై ఏడాదికి 6 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని డిపార్టుమెంట్ ఆప్ పోస్ట్ ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది.

పరిమితి దాటితే వడ్డీ రాదు.. పన్ను మినహాయింపు ఉండదు
పీపీఎఫ్ అకౌంట్ తెరిచేందుకు కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షలు ఏడాదికి ఇన్వెస్ట్ చేయవచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పరిమితి దాటితే వడ్డీ రాదు. ట్యాక్స్ మినహాయింపు ఉండదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications