For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా బుట్టలో పడుతున్నారు.. మిల్లీనియల్స్‌కు ఫైనాన్షియల్ లిటరసీ కీలకం

|

మిల్లీనియల్స్ అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. విస్తారమైన ఉత్సుకత ఉంటుంది. ఇది 'స్మార్ట్' యుగం. చేతిలో ఎప్పటికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇంటర్నెట్ నిత్యం అందుబాటులో ఉంటుంది! ప్రపంచమంతా చేతిలోనే ఉంది. మిల్లీనియల్స్ తమ ఆసక్తిని వివిధ రంగాలకు పరిమితం చేస్తుంటారు. అయితే ఆర్థిక ఆక్షరాస్యత పట్ల లేదా పర్సనల్ ఫైనాన్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మిల్లీనియల్స్ ఆర్థిక నిర్వహణ పట్ల తక్కువ శ్రద్ధను కనబరుస్తున్నారు.

ఆర్థిక నిర్వహణకు క్రమశిక్షణ, సహనం, ఓపెన్ మైండ్ అవసరం. దేశంలో ఆర్థిక అక్షరాస్యత గురించి మాట్లాడాలని అనుకుంటే అది చాలా తక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారత జనాభాలో కేవలం 27 శాతం మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యులు.

రుణాల పట్ల ఆకర్షితులు

రుణాల పట్ల ఆకర్షితులు

ఎవరికైనా ఫైనాన్సింగ్, క్రెడిట్ సిస్టమ్స్, డెట్ మేనేజ్‌మెంట్ తప్పనిసరి. ఆర్థిక అక్షరాస్యత ఈ మూడు అంశాల సమన్వయాన్ని కలిగి ఉంటుంది. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. సబ్జెక్ట్ పైన పట్టు లేకపోతే డ్రీమ్ రిటైర్మెంట్ కార్పోరాను కూడబెట్టుకోలేరు. లో-ఫైనాన్షియల్ లిటరసీ అయితే ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కే పరిస్థితిని దూరం చేస్తుంది.

ఉదాహరణకు ఇటీవలే యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన ఓ విద్యార్థి, ఓ ఫిన్ టెక్ కంపెనీ లాంచ్ చేసిన యాప్‌కు ఆకర్షితుడయ్యాడు.

సులభంగా చిన్న మొత్తంలో రుణాలు ఇవ్వడంతో ఆకర్షితుడయ్యాడు. ఈ రుణాన్ని అనుకూలమైన కాలపరిమితితో తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ రుణాన్ని సేకరించడం చాలా ఈజీ. కానీ దీనిపై వడ్డీతో భారంగా మారి, ఆ మొత్తం ఎప్పటికి అప్పుడు ఎక్కువ అవుతోంది. ఆర్థిక క్రమశిక్షణ లేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. రుణ సాధనాల చిక్కుల గురించి అవగాహన లేకపోతే చాలా సమస్యలు ఎదురు కావొచ్చు. క్రెడిట్ రిపోర్ట్‌లో ఓసారి రుణ డిఫాల్ట్ అయితే అది కొన్నేళ్ల పాటు ప్రభావం చూపిస్తుంది.

వ్యక్తిగత ఫైనాన్స్ తెలుసుకోవాలి

వ్యక్తిగత ఫైనాన్స్ తెలుసుకోవాలి

యుక్తవయస్సులో లేదా సంపాదన ఆరంభించిన సమయంలోనే వ్యక్తిగత ఫైనాన్స్‌ను తెలియజెప్పడం, భవిష్యత్తులో అనిశ్చితి నుండి వారిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. వివిధ ఆర్థిక ఉత్పత్తులు, ఎంపికలను అన్వేషించడం ద్వారా మున్ముందు సంక్షోభాలను తట్టుకోవచ్చు. అంతేకాదు, వారి ఆర్థిక లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడానికి, నియంత్రణ ద్వారా ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా వారికి సహకరిస్తుంది.

ఫైనాన్షియల్ లిటరసీ

ఫైనాన్షియల్ లిటరసీ

ఫైనాన్షియల్ లిటరసీ యావత్ ప్రజానీకంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారికి మంచి భవిష్యత్తును అందించేలా, వారి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అందుకే జీవితంలో ఫైనాన్షియల్ లిటరసీ కూడా చాలా ముఖ్యం. ప్రధానంగా టెక్నాలజీ వెంట పరుగులు పెట్టే మిల్లీనియల్స్ దీనిపై దృష్టి సారించాలి.

English summary

అలా బుట్టలో పడుతున్నారు.. మిల్లీనియల్స్‌కు ఫైనాన్షియల్ లిటరసీ కీలకం | Financial literacy is key for all including millennials

Financially literacy is a tough nut to crack, but when mastered, it can ease life’s burdens tremendously. Obviously, an early headstart for the same would be of significant help, and this is what we need to start working towards.
Story first published: Tuesday, December 7, 2021, 14:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X