For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FDపై అతి తక్కువ రిటర్న్స్: మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

|

సురక్షిత పెట్టుబడి సాధనంగా అందరూ ఇష్టపడేది ఫిక్స్డ్ డిపాజిట్. పెద్ద మొత్తం లేదా చిన్న మొత్తం ఏ రూపంలో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవలి కాలంలో FD వడ్డీ రేట్లు తగ్గాయి. కరోనా కారణంగా బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లతో పాటు FD వడ్డీ రేట్లు కూడా క్షీణించాయి. మరికొద్ది రోజులు ప్రస్తుత వడ్డీ రేటు ట్రెండ్ కొనసాగే అవకాశముంది. ప్రధాన జాతీయ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టం వద్ద ఉన్నాయి. FD వడ్డీ రేట్లు అయితే దాదాపు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ FD వడ్డీ రేటు 3.50 శాతం నుండి 5.70 శాతం, HDFC వడ్డీ రేటు 3.50 శాతం నుండి 6.25 శాతం, యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు 3.50 శాతం నుండి 6.50 శాతం వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.

వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేటు

- SBI - 7 days - 10 years - 3.50% - 5.70%,

- HDFC Bank - 7 days - 10 years - 3.50% - 6.25%,

- Axis Bank - 7 days - 10 years - 3.50% - 6.50%,

- Bank of Baroda - 7 days - 10 years - 4.25% - 6.15%,

- ICICI Bank - 7 days - 10 years - 3.50% - 6.00%,

- Punjab National Bank - 7 days - 10 years - 4.25% - 5.80%,

- IDBI Bank - 15 days - 20 years - 3.10% - 5.90%,

- Canara Bank - 7 days - 10 years - 4.25% - 5.85%,

- RBL Bank - 7 days - 10 years - 5.00% - 7.25%,

- Yes Bank - 7 days - 10 years - 5.00% - 7.25%.

ఆరేళ్లలో పరిస్థితి మారిపోయింది

ఆరేళ్లలో పరిస్థితి మారిపోయింది

భారత జాతీయ బ్యాంకులు 2015లో FD పైన 8 శాతం నుండి 9 శాతం వడ్డీ రేట్లను (ఏడాదికి) అందించాయి. ప్రయివేటు బ్యాంకులు 8 శాతం నుండి 9.25 శాతం వరకు అందించాయి. ఫారెన్ బ్యాంకులు 6.75 శాతం నుండి 8.6 శాతం వరకు అందించాయి. అయితే ఈ అయిదారేళ్ల కాలంలో పరిస్థితి మారిపోయింది. ఆరేళ్ల క్రితం 9 శాతం వరకు ఉన్న FD వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతానికి పడిపోయింది. కొన్ని ప్రయివేటు బ్యాంకులు గరిష్టంగా ఏడు శాతం వరకు ఇస్తున్నాయి. అక్టోబర్ 2019లో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతంగా ఉండగా మార్చి 2020 నాటికి 4.40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం రుణాలు తక్కువ వడ్డీ రేట్లలో ఉండగా, FD వడ్డీ రేట్లు కూడా అతి తక్కువగా ఉన్నాయి.

సీనియర్స్‌కు ఇవి బెట్టర్

సీనియర్స్‌కు ఇవి బెట్టర్

సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే 0.25 శాతం నుండి 0.50 శాతం వరకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే ఇతర పథకాల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. అది కూడా తక్కువ రిస్క్ కలిగిన స్కీమ్‌లు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీంలో రూ.15 లక్షల వరకు అయిదేళ్ల కాలపరిమితికి ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. అయితే దీనిని ప్రతి మూడు నెలలకు ఓసారి సవరిస్తారు. మీరు సీనియర్ సిటిజన్ కాకపోతే మీ పేరెంట్ పేరు మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ప్రధానమంత్రి వయవందన యోజన వంటివి ఉన్నాయి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో 6.6 శాతం వడ్డీ రేటు వస్తుంది. సాధారణ పౌరులకు సావరీన్ గోల్డ్ బాండ్స్ కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు.

English summary

FDపై అతి తక్కువ రిటర్న్స్: మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? | FD Interest Rates Are Low, Where Should You Invest Now?

Fixed Deposits (FDs) have always stood as a traditional financial instrument to invest money, be it a big amount or a small amount, to keep the money secure with an assured return.
Story first published: Thursday, November 25, 2021, 13:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X