For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ELSS vs PPF: పన్నులు, ఉపసంహరణ, బేసిక్ రిటర్న్స్... ఏది బెస్ట్?

|

ELSS పనితీరు మార్కెట్ అనుసంధానమైనది. పెట్టుబడి మొత్తంలో గణనీయ భాగం ఈక్విటీ పెట్టుబడుల్లోకి వెళ్తుంది. దీంతో మార్కెట్ అస్థిరత ఫలితం పైన ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో మాత్రం ఇది ఫలవంత పెట్టుబడిగా చెప్పవచ్చు. ఫలవంతమైన ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడులు పీపీఎఫ్, ఎఫ్‌డీ వంటి సంప్రదాయ సెక్యూరిటీలను గణనీయమైన మార్జిన్‌తో అధిగమించాయి. ఏదేమైనా ఇది దీర్ఘకాలిక సంపద సృష్టికి మరింత అవకాశమిస్తుంది. రిస్క్ ఇష్టపడని వారు దీనికి ప్రాధాన్యతను ఇవ్వవచ్చునని సూచిస్తున్నారు.

పన్ను ఆదా

పన్ను ఆదా

PPF లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధి తీసుకోవడానికి ఉపయోగపడే స్కీం. ప్రతి ఏడాది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పీపీఎఫ్ కోసం కేటాయించాలి. పీపీఎఫ్ స్కీంలో చేరితే పెట్టుబడి మొత్తం పైన వడ్డీ రాబడి ఉంటుంది. అలాగే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ELSS) ఈ రెండు పన్ను ఆదా చేసే పొదుపు పథకాలు. సెక్షన్ 80సీ కింద ఈ రెండింటిలో పెట్టుబడులు పెట్టడానికి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మినహాయింపు అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించే పథకాలకు వేర్వేరు రాబడులు, రిస్క్, లాక్-ఇన్ పీరియడ్, పన్నులు ఉంటాయి. పన్ను ఆదాకు పెట్టుబడి పెట్టే ముందు పలు అంశాలు పరిశీలించాలి.

బేసిక్ రిటర్న్స్, లాక్-ఇన్ పీరియడ్

బేసిక్ రిటర్న్స్, లాక్-ఇన్ పీరియడ్

- పీపీఎఫ్ వడ్డీ రేటు రిటర్న్స్ స్థిరంగా ఉండవు. ప్రతి త్రైమాసికానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరిస్తుంది. పీపీఎఫ్‌తో పాటు ఇతర స్మాల్ సేవింగ్స్ ప్లాన్స్ వడ్డీ రేట్లను సవరిస్తుంది. వడ్డీ రేటు ఎక్కువగా ప్రభుత్వ బాండ్స్ రాబడి పైన ఆధారపడి ఉంటాయి.

- ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ రిటర్న్స్ పోర్ట్ పోలియో మెంబర్స్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ ఆధారిత స్వభావం కారణంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ దీర్ఘకాలంలో స్థిర ఆదాయ సాధనాలను అధిగమిస్తాయి. గత మూడు, అయిదు, పదేళ్ల కాలంలో వరుసగా 9 శాతం, 16 శాతం, 13 శాతం వార్షిక రిటర్న్స్ ఇచ్చాయి.

- పీపీఎఫ్ లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. కొన్ని నిబంధనలతో ముందస్తు క్లోజింగ్, ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంది. పాక్షిక ఉపసంహరణ ఏడాదికి ఒకసారి అనుమతి ఉంది. ఇది కూడా ఈ స్కీంలో చేరిన ఏడేళ్ల నుండి ప్రారంభమవుతుంది.

- ఈఎల్ఎస్ఎస్ లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు. అయితే ఈ పెట్టుబడిని మరింత కాలం అట్టిపెట్టుకోవచ్చు.

హామీ

హామీ

- రిస్క్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే పన్ను ఆదా కోసం ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం. పీపీఎఫ్ మూలధనం, వడ్డీకి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వంతో నిర్వహించబడుతోంది.

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవి షేర్లలో ప్రధానంగా పెట్టుబడులు పెడతాయి. అయితే సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు.

- పీపీఎఫ్ పెట్టుబడి ట్యాక్స్-ఫ్రీ రిటర్న్స్ ఇస్తుంది.

-పీపీఎఫ్ గరిష్ట పరిమితి 20 ఏళ్లు.

- ఈఎల్ఎస్ఎస్ అప్పర్ సర్క్యూట్ ఏమీ లేదు. మీరు ఎంత దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంత చేయవచ్చు.

English summary

ELSS vs PPF: పన్నులు, ఉపసంహరణ, బేసిక్ రిటర్న్స్... ఏది బెస్ట్? | ELSS vs PPF: Which one is better for investment?

The performance of an ELSS is market-linked, and a considerable amount of the money invested flows into equity investments. As a result, market volatility affects the results. In the long term, it has proven fruitful.
Story first published: Wednesday, November 17, 2021, 20:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X