For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం మారితే పాత పీఎఫ్ అకౌంట్ మొత్తాన్ని తీసుకోవద్దు!

|

ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువమంది తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. చాలామంది ఉద్యోగాలు మారగానే పాత సంస్థ పీఎఫ్ ఖతా నుండి డబ్బులు ఉపసంహరించుకుంటారు. అయితే అలా కంపెనీ మారినప్పుడు తరుచూ నగదు విత్‌డ్రా చేయడం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. మీరు పాత సంస్థ పీఎఫ్ ఖాతా నుండి నగదును తీస్తే మీ భవిష్యత్తు అవసరాల కోసం భారీ మొత్తంలో నిధి, సేవింగ్స్‌ను అట్టిపెట్టుకునే అవకాశం కోల్పోయినట్లే. పాత సంస్థలో పీఎఫ్ ఖాతా నుండి నగదును ఉపసంహరించుకోవడం ద్వారా పెన్షన్ కంటిన్యుటీ ఉండదు. కాబట్టి కొత్త కంపెనీలో చేరినప్పుడు అత్యంత అవసరమైతే తప్ప, ఆ మొత్తాన్ని తీసుకోవద్దని, పాత సంస్థ పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థ ఖాతాలోకి విలీనం చేయడం మంచిదని చెబుతున్నారు.

రిటైర్మెంట్ త‌ర్వాత మీకు వెంట‌నే డ‌బ్బు అవ‌స‌రం లేక‌పోతే కొన్నేళ్ల పాటు పీఎఫ్‌ను అలాగే కొనసాగించాలనేది నిపుణుల సూచన. పాత సంస్థ నుండి కొత్త సంస్థలోకి మారినప్పుడు ఆ సంస్థ ఖాతాలోకి పీఎఫ్‌ను బదలీ చేస్తే వడ్డీ కూడా బదలీ అవుతుంది. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు నగదును ఉపసంహరించుకోకుటే మూడేళ్ల వరకు వడ్డీ వస్తుంది. మూడేళ్ల తర్వాత దానిని డార్మెంట్ ఖాతాగా పరిగణిస్తారు. చాలామంది పీఎఫ్ మొత్తాన్ని సురక్షిత నిధిగా భావిస్తారు. అందుకే ఆ మొత్తాన్ని తీసుకోరు.

Dont withdraw PM money soon after changing job!

కానీ ఆదాయం ప‌న్ను చ‌ట్టం నిబంధ‌న‌ల ప్ర‌కారం కాంట్రిబ్యూష‌న్ లేకున్నా ఆ ఖాతాను డీృయాక్టివేట్ చేయ‌రు. కానీ ఆ సమయంలో వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను విధిస్తారు. ఒక‌వేళ PF అకౌంట్ ఇన్-యాక్టివ్ అయితే ఆ త‌ర్వాత ఆ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ ఫండ్‌కు వెళ్తుంది.

English summary

ఉద్యోగం మారితే పాత పీఎఫ్ అకౌంట్ మొత్తాన్ని తీసుకోవద్దు! | Don't withdraw PM money soon after changing job!

Employees working in non-public sectors change their jobs each 2-3 years which is a development now. However, with the change in job, withdrawing the complete PF cash of the previous firm could be a loss.
Story first published: Saturday, October 23, 2021, 17:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X