For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటి మహాలక్ష్మి కోసం తీసుకున్న పథకంలో ఈ మార్పులు గమనించారా?

|

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఉండే కలనే వేరు కదా. అలాంటి ఆడపిల్ల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన పథకం. దీనికి ఎంతగానో ప్రాచుర్యం లభిస్తోంది. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కొన్ని నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ పథకంలో పెద్దగా మార్పులు చేయలేదు కానీ స్వల్ప మార్పులు చేశారు. వాటి గురించి తెలుసుకుందామా..

కరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరంకరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరం

ఆ ఖాతాలపై అధిక వడ్డీ రేటు..

ఆ ఖాతాలపై అధిక వడ్డీ రేటు..

ఈ పథకంలో భాగంగా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఖాతాలో కనీసం రూ. 250 జమ చేయాలన్న విషయం తెలిసిందే. అయితే ఈ కనీస మొత్తాన్ని కూడా జమచేయకుంటే దాన్ని డిఫాల్ట్ అకౌంట్ గా పరిగణిస్తారు. కొత్తగా నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం ఇలాంటి డిఫాల్ట్ ఖాతాలపై కూడా ఈ పథకంలో పేర్కొన్న వడ్డి రేటును చెల్లిస్తారు. మెచ్యూరిటీ వరకు ఖాతాను క్రమబద్దీకరించకున్నా ఈ వడ్డీ రేటు అందుతుంది. పాత నిబంధన ప్రకారం ఇలాంటి ఖాతాలపై పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేటును చెల్లించే వారు. ఈ ఖాతాపై వడ్డీ రేటు ప్రస్తుతం 4 శాతంగా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై ప్రస్తుతం వడ్డీ రేటు 8.7 శాతం ఉన్నది. పాపకు సంరక్షకునిగా ఉన్న వారు మరణించిన సందర్భంలో ఆ ఖాతా డిఫాల్ట్ ఖాతాగా మారే అవకాశం ఉంటుంది.

ముందుగానే ఖాతా ముగింపు

ముందుగానే ఖాతా ముగింపు

పథకంలోని కొత్త నిబంధనల ప్రకారం పాప చనిపోయిన సందర్భంలో లేదా ప్రాణాంతక వ్యాధుల చికిత్సలకు లేదా సంరక్షకుడి మరణం సందర్భంలో ఖాతాను ముగించి వేయవచ్చు. ఇంతకు ముందటి నిబంధన ప్రకారం పాప మరణించినప్పుడు, లేదా పాప నివాస స్థాయి మారినప్పుడు ఖాతాను క్లోజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే కొత్త నిబంధన ల్లో ముందుగా ముగించుకోవచ్చా లేదా మెచ్యూరిటీ వరకు కొనసాగించాలా అన్న దాన్నీ స్పష్టంగా పేర్కొనలేదు.

ఖాతా నిర్వహణ ఇలా

ఖాతా నిర్వహణ ఇలా

కొత్త నిబంధనల ప్రకారం.. 18 ఏళ్ల వయసు వచ్చే వరకు బాలిక ఖాతాను నిర్వహించడానికి వీలులేదు. పాత నిబంధనల ప్రకారం ఇది పదేళ్లు గా ఉంది. 18 ఏళ్ళు వచ్చే వరకు ఖాతాను సంరక్షకుడు నిర్వహిస్తారు. 18 ఏళ్ళు నిండిన తర్వాత అవసరమైన పత్రాలను ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు సమర్పించాలి.

ఇద్దరికన్నా ఎక్కువ ఆడపిల్లలు ఉంటే...

ఇద్దరికన్నా ఎక్కువ ఆడపిల్లలు ఉంటే...

ఇద్దరికన్నా ఎక్కువ ఆడపిల్లలు ఉన్న సందర్భంలో ఖాతాను ప్రారంభించడానికి అదనంగా డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తో పాటు అఫిడవిట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం మెడికల్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోయేది. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లకు ఖాతాను తెరవ వచ్చు. అయితే కవలలు లేదా ముగ్గురు ఆడ పిల్లలు ఒకే సారి పుట్టిన సందర్భంలో ఎక్కువ ఖాతాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించినా లేదా రెండో కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించినా మూడో ఖాతా అవసరం ఏర్పడుతుంది.

English summary

మీ ఇంటి మహాలక్ష్మి కోసం తీసుకున్న పథకంలో ఈ మార్పులు గమనించారా? | Do you know new changes in Sukanya samriddhi yojana scheme

Recently some new changes have made in popular girl child scheme Sukanya Samriddhi Yojana scheme. you need to know those changes to understand.
Story first published: Friday, March 13, 2020, 21:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X