Dhanlaxmi Bank interest rate: ధనలక్ష్మీ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు...
ప్రముఖ ప్రయివేటురంగ ధనలక్ష్మీ బ్యాంకు 01వ తేదీ ఆగస్ట్ 2021 నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పై వడ్డీరేట్లను సవరించింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ధనలక్ష్మీ బ్యాంకు వార్షిక ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.105.09 కోట్లు, నెట్ ప్రాఫిట్ రూ.37.19 కోట్లుగా నమోదయింది. ఈ ప్రయివేటురంగ బ్యాంకు రెగ్యులర్, సీనియర్ సిటిజన్స్ కోసం వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తోంది. ధనమ్ అభివృద్ధి టర్మ్ డిపాజిట్ స్కీం, ధనమ్ క్యుమ్యులేటివ్ డిపాజిట్ సర్టిఫికెట్(DCDC), సురభి డిపాజిట్, ధనమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ డిపాజిట్, శ్రీ ధన చక్ర డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ వంటి స్కీమ్స్‌ను అందిస్తోంది. వివిధ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ధనలక్ష్మి బ్యాంకు అందించే వడ్డీ రేట్లు ఇక్కడ చూడండి.
ధనలక్ష్మి బ్యాంకు రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంటరెస్ట్ రేట్స్
7 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితికి రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన బ్యాంకు ప్రస్తుతం 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3.75 శాతం, 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై 4.25 శాతం, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 5.15 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.30 శాతం, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.40 శాతం, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 15 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.75,
- 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.75,
- 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 4.00,
- 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 4.25,
- 1 ఏడాది నుండి 2 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.15,
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.30,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.40,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.50
సీనియర్ సిటిజన్లకు ధనలక్ష్మీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇచ్చే వడ్డీ రేటు ఇలా ఉంది..
- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 15 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.75,
- 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.75,
- 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 4.00,
- 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 4.25,
- 1 ఏడాది నుండి 2 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.65,
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.80,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.90,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 6.00
ధనలక్ష్మి బ్యాంకు బల్క్ డిపాజిట్ ఇంటరెస్ట్ రేట్
రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 2.75,
- 15 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 2.75,
- 46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25,
- 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.5,
- 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 3.75.
ఇటీవలే ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) 16వ తేదీ ఆగస్ట్ 2021 నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పై వడ్డీరేట్లను సవరించింది. ఐడీబీఐ బ్యాంకు రెండు రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తుంది. ఇందులో సువిథ ఫిక్స్డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలు ఉన్నాయి. ఈ రెండింటిలోను కనీస డిపాజిట్ మొత్తం రూ.10,000, ఆటో రెన్యూవల్, నెలవారీ, త్రైమాసికం, ఏడాది ఇన్‌కం ప్లాన్స్, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేట్లు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, స్వీప్-ఇన్ వంటి అంశాలు ఉన్నాయి. సువిధ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద ఏడు రోజుల నుండి పది సంవత్సరాల పదవీ కాలాన్ని ఎంచుకోవచ్చు. అయితే ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్ స్కీంలో సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందడానికి అయిదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.
ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేట్ల సవరణ అనంతరం ఏడు రోజుల నుండి 30 రోజుల కాలపరిమితిపై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 2.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3 శాతం వడ్డీ రేటు, 91 రోజుల నుండి 6 నెలల కాలపరిమితిపై 3.50 శాతం వడ్డీ రేటు, 6 నెలల నుండి ఏడాది కాలపరిమితిపై 4.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఏడాది కాలపరిమితి వడ్డీ రేటు 5.05 శాతంగా ఉండగా, ఏడాది నుండి రెండేళ్ల మధ్య కాలపరిమితిపై 5.15 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.20 శాతం, మూడేళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై 5.40 శాతం, అయిదేళ్ల కాలపరిమితిపై (ట్యాక్స్ సేవింగ్ FD) 5.25 శాతం, అయిదేళ్ల నుండి ఏడేళ్ల కాలపరిమితిపై 5.25 శఆతం, ఏడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.25 శాతం, పదేళ్ల నుండి ఇరవై ఏళ్ల కాలపరిమితిపై 4.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.