For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్టర్లకు పీపీఎఫ్ అకౌంట్ ఈ డిపాజిట్ చాలా ముఖ్యం, వడ్డీ రేటు పెంపు ఇలా!

|

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వడ్డీ రేటును ప్రతి ఏడాదికి ఒకసారి సవరిస్తారు. నెల ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. పీపీఎప్ ఖాతాలో నగదు జమ చేసే వారికి 5వ తేదీ చాలా ముఖ్యం. పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం ప్రతి నెల 5వ తేదీ నుండి నెల చివరి తేదీ వరకు ఉన్న కనీస మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని వడ్డీని లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతాదారు ఒక నెలలో 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు నగదు జమ చేస్తే కస్టమర్ ఆ నెల మొత్తానికి వడ్డీ పొందేందుకు అర్హులు. ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు పీపీఎఫ్ మొత్తాన్ని జమ చేయడం ద్వారా రాబడి పెంచుకోవచ్చు.

అలా చేస్తేనే వడ్డీ

అలా చేస్తేనే వడ్డీ

పీపీఎఫ్ అకౌంట్ రూల్ ప్రకారం మినిమం పీపీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా 5వ తేదీ నుండి ఆ నెల చివరి వరకు వడ్డీని లెక్కిస్తారు. పీపీఎఫ్ అకౌంట్‌లో 5వ తేదీ వరకు పడిన మొత్తంపై వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ తేదీ దాటిన తర్వాత ఎంత జమ చేసినప్పటికీ వడ్డీ రేటు వచ్చే నెల వరకు వర్తించదు. కాబట్టి ప్రతి నెల 5వ తేదీ లోపు జమ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్దగా తేడా ఉండదని అనుకోవద్దు. ఇలాంటి చిన్న మొత్తాలు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతాయి. మొదటి ఐదు రోజుల్లో జమ చేస్తే మిగతా 25 రోజులకు కూడా వడ్డీ వర్తిస్తుంది. 5వ తేదీలోపు జమ చేస్తే ఆదాయం పెంచుకోవచ్చు.

చెక్కు డిపాజిట్ చేస్తే

చెక్కు డిపాజిట్ చేస్తే

పీపీఎఫ్ ఖాతాదారు చెక్కు ద్వారా డిపాజిట్ చేస్తుంటే కనుక వారు డిపాజిట్ చేసిన తేదీని చెక్ క్లియర్ చేసిన తేదీగా పరిగణిస్తారు. కాబట్టి అలాంటి పీపీఎఫ్ ఖాతాదారులు ముందుగానే డిపాజిట్ చేయడం మంచిది. తద్వారా నెలకు 5వ తేదీ లేదా అంతకంటే ముందు చెక్ క్లియర్ అవుతుంది. అది ఆ నెల పీపీఎఫ్ వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తుంది. లేదంటే ఆ నెల వడ్డీని కోల్పోతారు.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

ఏప్రిల్ 2016 నుండి పీపీఎఫ్‌తో పాటు ఇత‌ర చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌కు త్రైమాసిక ప్ర‌తిప‌దిక‌న వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం పీపీఎఫ్ చందాదారులకు ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికానికి 7.1 శాతం వ‌డ్డీరేటును ప్ర‌క‌టించింది.

English summary

ఇన్వెస్టర్లకు పీపీఎఫ్ అకౌంట్ ఈ డిపాజిట్ చాలా ముఖ్యం, వడ్డీ రేటు పెంపు ఇలా! | Deposit date in PPF account matter for investors, How to maximise interest

The Public Provident Fund (PPF) interest rate is announced on a quarterly basis but it’s counted on a monthly basis. According to the PPF account rules, the Government of India (GoI)-backed small saving scheme calculates PPF account interest on the basis of minimum PPF balance available in the PPF account from 5th to last date of the month.
Story first published: Wednesday, April 21, 2021, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X