For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ సగం పతనం, క్రిప్టో మార్కెట్ ఎందుకు క్షీణిస్తోంది?

|

క్రిప్టో మార్కెట్ దారుణంగా పతనమైంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం 5 శాతం నుండి 6 శాతం మేర పడిపోయాయి. అన్నింటికంటే అధికంగా మీమ్ కాయిన్ షిబా ఇను దాదాపు 12 శాతం పడిపోయింది. దాదాపు మేజర్ క్రిప్టో కాయిన్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. బిట్ కాయిన్ ఓ సమయంలో 33,000 డాలర్ల దిగువకు, ఎథేరియం 2500 దిగువకు పడిపోయింది.

బిట్ కాయిన్ 5 శాతం పతనం

బిట్ కాయిన్ 5 శాతం పతనం

ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4.89 శాతం క్షీణించి 32,899 డాలర్ల వద్ద, ఎథేరియం 6.05 శాతం క్షీణించి 2,396 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దాదాపు అన్ని క్రిప్టోలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. బిట్ కాయిన్ 24 గంటల కనిష్టం 32,650 డాలర్లు కాగా, గరిష్టం 34,694 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 625.49 బిలియన్ డాలర్లు పడిపోయింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం, 52 వారాల గరిష్టం కూడా 68,990.90 డాలర్లు. 52 వారాల కనిష్టం మాత్రం 28,825.76 డాలర్లు.

క్రిప్టోలన్నీ పతనం

క్రిప్టోలన్నీ పతనం

వివిధ క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే బిట్ కాయిన్ 4.97 శాతం తగ్గి 32,853 డాలర్లు, ఎథేరియం 5.96 శాతం తగ్గి 2396 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 6.59 శాతం తగ్గి 0.533 డాలర్లు, టెర్రా 1.21 శాతం క్షీణించి 59.08 డాలర్లు, సోలానా 8.07 శాతం తగ్గి 71.94 డాలర్లు, క్రిప్టో డాట్ కామ్ 10.67 శాతం తగ్గి 0.234 డాలర్లు, టెర్రా యూఎస్‌డీ 0.01 శాతం క్షీణించి 0.9922 డాలర్లు, స్టెల్లార్ 7.22 శాతం తగ్గి 0.153 డాలర్లు, డోజీకాయిన్ 6.03 శాతం తగ్గి 0.117 డాలర్లు, షిబా ఇను 11.80 శాతం క్షీణించి 0.000016 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

అందుకే పతనం

అందుకే పతనం

ఫెడ్ రిజర్వ్ అర శాతం మేర వడ్డీ రేట్లు పెంచుతామని ప్రకటించింది. ఆ సమయంలో బిట్ కాయిన్ 40,000 డాలర్ల వద్ద ఉంది. కానీ ఫెడ్ వడ్డీ రేటు పెంపు, ద్రవ్యోల్భణం, మాంద్యం భయాలు వంటి అంశాలు ఇటు స్టాక్ మార్కెట్, అటు క్రిప్టో మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. క్రిప్టో మార్కెట్ కరోనా సమయంలో భారీగా పుంజుకుందని, ఒక విధంగా అతిగా పెరిగిందని, ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే సగాని కంటే పైగా పడిపోయింది.

English summary

బిట్ కాయిన్ సగం పతనం, క్రిప్టో మార్కెట్ ఎందుకు క్షీణిస్తోంది? | Crypto Crash: Why is cryptocurrency market crashing?

The global crypto market cap has shrunk to $1.54 trillion, decreasing by 2.28% in the last 24 hours, according to CoinMarketCap data on Monday.
Story first published: Monday, May 9, 2022, 19:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X