For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డ్ రూల్స్: బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవచ్చు, ఎప్పటి నుండి అంటే

|

ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల ప్రకారం కస్టమర్ బిల్లింగ్ సైకిల్ తేదీలను ఒకసారి మార్చుకోవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ తేదీని మార్చుకోవడం అంత ఈజీ కాదు. కార్డును జారీ చేసినప్పుడే బిల్లింగ్ సైకిల్‌ను నిర్ణయిస్తాయి. కార్డు ఉన్నంత వరకు అదే ఉంటుంది. కొన్ని బ్యాంకులు మాత్రం కొన్ని సందర్భాల్లో మార్పుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. అప్పుడు బిల్లింగ్ సైకిల్‌కు అనుకూలంగా లేకుంటే కార్డును రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇటీవల ఆర్బీఐ జారీ చేసిన కొత్త క్రెడిట్ కార్డు నియమాల ప్రకారం ఒకసారి మార్చుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్స్‌కు స్టాండర్డ్ బిల్లింగ్ సైకిల్‌ను అనుమతించవు. కాబట్టి కార్డు జారీ చేసే సంస్థ నియమాలను అనుసరించి బిల్లింగ్ సైకిల్ వేర్వేరు కార్డులకు వేర్వేరుగా ఉంటుంది. అందుకే కార్డు హోల్డర్లు తమ సౌలభ్యాన్ని అనుసరించి బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మార్చుకునే వెసులుబాటు ఆర్బీఐ కార్డును జారీ చేసే సంస్థలకు ఇచ్చింది. ఈ కొత్త నియమాలు జూలై 1, 2022 నుండి అమల్లోకి వస్తున్నాయి.

 Credit card rules: Now you can change your billing cycle

బిల్లింగ్ సైకిల్ అనేది రెండు బిల్లు స్టేట్‌మెంట్స్ మధ్య కాలం. బిల్లింగ్ సైకిల్ వ్యవధి 30 రోజులు. ఆ 30 రోజుల్లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ప్రతిబింబిస్తాయి. బిల్లింగ్ సైకిల్ పూర్తయిన 15 నుండి 25 రోజుల్లో చెల్లించాలి. మీ బిల్లింగ్ సైకిల్ ఏప్రిల్ 9 నుండి మే 10 వరకు ఉంటే పేమెంట్ చివరి తేదీ జూన్ మొదటి వారంలో ఉండవచ్చు.

బిల్లింగ్ సైకిల్ ప్రారంభ తేదీ నుండి చెల్లింపు గడువు తేదీ వరకు వడ్డీ రహిత కాల వ్యవధి ఉంటుంది. ఈ లోపు కార్డు హోల్డర్లు క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాలి. గడువు తేదీ ముగిశాక చెల్లింపులు చేస్తే ఔట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీ, ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ అనుకూలతను బట్టి అంటే మీకు డబ్బులు చేతికి అందే సమయాన్ని బట్టి బిల్లింగ్ సైకిల్ మార్చుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

English summary

క్రెడిట్ కార్డ్ రూల్స్: బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవచ్చు, ఎప్పటి నుండి అంటే | Credit card rules: Now you can change your billing cycle

The billing cycle is the period between the closing dates of two consecutive bills. Your payment due date will be generally 15–25 days after your billing cycle ends.
Story first published: Thursday, May 26, 2022, 14:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X