కరోనా మహమ్మారి నుండి మీరు కోలుకున్నారా? వాస్తవానికి కరోనా దీర్ఘకాల రోగం కిందకు రాదు. కానీ దీర్ఘకాల రోగుల బీమా కంటే కరోనా నుండి కోలుకున్న బాధితులు ఇక నుండి ఆరోగ్య లేదా జీవిత బీమా పొందటం అంత ఈజీ కాదు! కరోనా ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కొత్త వేరియెంట్లతో భయాన్ని కలిగిస్తోంది. ఎంతోమంది ప్రాణాలను తీసుకు వెళ్తోంది. ఆర్థికంగా కూడా కోట్లాదిమంది చితికిపోతున్నారు. కరోనా నేపథ్యంలో భారీగా క్లెయిమ్స్ వస్తుండటంతో ఇన్సురెన్స్ కంపెనీలు ఎన్నో దారులు వెతుకుతున్నాయి.

కొద్ది నెలలు ఆగాల్సిందే
కరోనా బారినపడి కోలుకున్న వారు ఎవరైనా ఆ తర్వాత వెంటనే లైఫ్ ఇన్సురెన్స్ పాలసీని లేదా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలని భావిస్తే అది సాధ్యం కాకపోవచ్చు. కరోనాపై గెలిచిన వారికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చే ముందు చాలా కఠినమైన అండర్ రైటింగ్ నిబంధనలను తెచ్చాయి. కరోనా నుండి కోలుకున్న తర్వాత కనీసం 6 నెలల దాకా ఏ పాలసీ తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
కరోనా బారినపడి కోలుకున్న వారి దీర్ఘకాలిక ఆరోగ్యస్థితిగతులపై ఎలాంటి అంచనా లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన పాలసీలు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు 3 నెలల తర్వాత, కొన్ని సంస్థలు 6 నెలల తర్వాత కానీ పాలసీ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు.

డిశ్చార్జ్ సమ్మరీ సహా డాక్యుమెంట్స్
కరోనా నుండి బయటపడిన వారు ఆరోగ్య బీమాను తీసుకోవాలంటే కచ్చితంగా పూర్తి వివరాలు తెలియజేయాలి. డిశ్చార్జ్ సమ్మరీతో సహా కరోనా గురించి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలి. బీమా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అండర్ రైటింగ్ టీమ్ మీ వద్దకు వచ్చి మరిన్ని వివరాలు సేకరిస్తారు. మీ హెల్త్ రికార్డ్స్‌ను బట్టి మీకు ఆరోగ్య బీమాను ఇవ్వాలా లేదా అనేది తేలుస్తారు. బీమా ఇవ్వడాన్ని వాయిదా కూడా వేయవచ్చు. అంతేకాదు మెడికల్ టెస్టులు కూడా చేస్తాయి.
కరోనాతో పాటు వయస్సు, బీమా తీసుకునే మొత్తం, అప్పటికే ఉన్న జబ్బుల వంి కారణాలతో కూడిన మెడికల్ టెస్టులు తప్పనిసరి. కరోనా నుండి కోలుకున్న వారికి అదనపు టెస్టులు ఉండవచ్చు. ప్రస్తుతానికి ఆరు నెలలు అని చెబుతున్నప్పటికీ, ఊపిరితిత్తులు, గుండె వంటి వాటిపై కరోనా ప్రభావం పడవచ్చునని బీమా కంపెనీలు భావిస్తున్నాయి.

అధిక ప్రీమియం
జీవిత బీమా పాలసీలు దీర్ఘకాలానికి చెందినవి. దీంతో జీవిత బీమా కంపెనీలు మరిన్ని కఠినమైన నియమాలతో ఉంటాయి. లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు పాలసీ ఇచ్చే ముందు ఆరు నెలల గడువును పరిగణలోకి తీసుకోవడం లేదు. అంతేకాదు, ఇవ్వవలసి వస్తే అధిక ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు బీమా ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications