For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC పత్రాలను ఓసారి చెక్ చేసుకోండి, కంప్యూటర్ ప్రింట్ తప్పుతో లక్షల నష్టం!

|

మీ ఎల్ఐసీ పాలసీ రికార్డులు తనిఖీ చేసుకోండి! ఎందుకంటే పాలసీ పత్రాల్లో ప్రింటింగ్ పొరపాట్లు ఉండవచ్చు. కంప్యూటర్ మిస్టేక్ కారణంగా ఎల్ఐసీ... ఓ పాలసీదారుకు పెద్ద మొత్తంలో.. అంటే పాలసీ కంటే ఎక్కువ ఇవ్వవలసి వచ్చింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. పత్రాల ప్రకారం తనకు ఇస్తానని చెప్పిన మొత్తం ఇవ్వాలని అతను కోర్టుకు వెళ్లాడు. దీంతో ఎల్ఐసీ ప్రీమియం మొత్తం కాకుండా, కంప్యూటర్ మిస్టేక్ ప్రకారం ఇవ్వకుండా కోర్టు ఆదేశాలతో అతను చెల్లించిన మొత్తానికి వడ్డీని కలిపి ఇచ్చే పరిస్థితి వచ్చింది.

ఇప్పటికే బంగారం 'జీరో', చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయికి ప్లస్ఇప్పటికే బంగారం 'జీరో', చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయికి ప్లస్

మెచ్యూరిటీ అమౌంట్ రూ.14.92 లక్షలు మాత్రమే

మెచ్యూరిటీ అమౌంట్ రూ.14.92 లక్షలు మాత్రమే

చెన్నైకి చెందిన సుబ్రమణియన్ 2010లో ఓ ఎల్ఐసీ పాలసీ తీసుకున్నాడు. తనకు అందిన డాక్యుమెంట్స్ ప్రకారం మెచ్యూరిటీ సమయానికి రూ.62.50 లక్షలు వస్తాయి. ఇందుకు నెలకు రూ.31,153 ఎనిమిదేళ్ళ పాటు చెల్లించాలి. ఆయన జూలై 2018 దాకా చెల్లించాడు. కానీ తీరా అతని మెచ్యూరిటీ తీరాక వచ్చే మొత్తం రూ.62.50 లక్షలు కాదని, మెచ్యూరిటీ మొత్తం రూ.14.92 మాత్రమేనని తెలిపింది. కంప్యూటర్ ఎర్రర్ కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తెలిపింది.

హైకోర్టుకు సుబ్రమణియమ్

హైకోర్టుకు సుబ్రమణియమ్

సుబ్రమణియమ్ 8 ఏళ్ల పాటు రూ.31.77 లక్షల వరకు చెల్లించాడు. అయితే మరణానంతరం మాత్రమే రూ.61.50 లక్షలు వస్తాయి. కానీ మెచ్యూరిటీ అమౌంట్ మాత్రం రూ.14.92 లక్షలు. దీనినే చెల్లిస్తామని ఎల్ఐసీ చెప్పడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు రూ.62.50 లక్షలు వచ్చేలా తీర్పు ఇవ్వాలని కోరాడు. తన క్లయింట్ ప్రతి నెల క్రమం తప్పకుండా ఎనిమిదేళ్ల పాటు చెల్లింపులు జరిపాడని, పత్రాల్లో పేర్కొన్నట్లు రూ.62.50 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వాలని సుబ్రమణియమ్ తరఫు లాయర్ సుందర్ మోహన్ కోర్టులో వాదించాడు.

ఎల్ఐసీ వాదన

ఎల్ఐసీ వాదన

రూ.62.50 లక్షలు డెత్ బెనిఫిట్ సమ్ అస్యూర్డ్ అని ఎల్ఐసీ లాయర్ వాదించాడు. పాలసీ చివరలో మెచ్యూరిటీ మాత్రం రూ.14.92 లక్షలు మాత్రమేనని కోర్టుకు తెలిపాడు. పాలసీ పత్రాలను నింపే సమయంలో కంప్యూటర్ ప్రింటర్ పొరపాటు కారణంగా మెచ్యూరిటీ సమ్ అస్యూర్డ్‌లో ఖాళీగా ఉందని పేర్కొన్నాడు.

జడ్జి ఏం చెప్పారంటే

జడ్జి ఏం చెప్పారంటే

జస్టిస్ పీడీ ఆదికేశవులు ఈ కేసును విచిత్రమైనదిగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో రెండు పార్టీలు సరిగ్గా శ్రద్ధ చూపలేదని అభిప్రాయపడ్డారు. పత్రాల్లోని చాలా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. మెచ్యూరిటీ మొత్తం రూ.62.50 లక్షలు అని పిటిషనర్ తెలిపారు. పాలసీ షెడ్యూల్‌లోని రెండు పిగర్స్‌లో ఇది ఒకటి. కానీ ఎల్ఐసీ మాత్రం రూ.14.92 లక్షలుగా పేర్కొంది. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు పత్రాలు తప్ప మరే ఆధారం లేదన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఎల్ఐసీ మెచ్యూరిటీ మొత్తంలో పొరపాటును గుర్తించిందని, దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అలాగే పిటిషనర్ డాక్యుమెంట్స్‌లోని కొన్ని ఖాళీల గురించి ఎలాంటి ప్రశ్నలు ఎల్ఐసీని సంప్రదించలేదని తెలిపారు.

ఇదీ తీర్పు

ఇదీ తీర్పు

పిటిషనర్ డాక్యుమెంట్స్ లోపాల గురించి అడగకుండానే నెలకు మొత్తం రూ.31.77 లక్షలు చెల్లిండాని కోర్టు పేర్కొంది. ఈ కాలంలో ఆయన చట్టబద్ధమైన డబ్బును చెల్లించారు. ఈ నేపథ్యంలో కోర్టు మధ్యేమార్గంగా తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్లుగా ఆయన చెల్లించిన రూ.31.77 లక్షలకు 7.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని హైకోర్టు.. ఎల్ఐసీని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఎల్ఐసీ మెచ్యూరిటీ మొత్తం కాకుండా లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అయితే ప్రింటింగ్ ఎర్రర్ వల్ల ఒక్కో సమయంలో పాలసీదారు కూడా నష్టపోయే అవకాశముంటుంది. కాబట్టి పత్రాలను తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

English summary

LIC పత్రాలను ఓసారి చెక్ చేసుకోండి, కంప్యూటర్ ప్రింట్ తప్పుతో లక్షల నష్టం! | computer print mistake, LIC cost lakhs of rupees

A misaligned computer print out of a policy document has cost the Life Insurance Corporation (LIC) of India a few lakhs.
Story first published: Wednesday, June 3, 2020, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X