For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం నగదు ఉపసంహరణ, చెక్‌బుక్... ఆగస్ట్ నుండి ICICI బ్యాంకు కొత్త ఛార్జీలు

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తర్వాత మరో బ్యాంకు ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ, చెక్ బుక్ ఛార్జీలను మారుస్తోంది. ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు కొత్త ఛార్జీలు ఆగస్ట్ నెల నుండి వర్తిస్తాయి. నగదు ట్రాన్సాక్షన్ పరిమితులను, ఛార్జీలను బ్యాంకు సవరించింది. ఆగస్ట్ 1వ తేదీ నుండి బ్యాంకు ఖాతాదారులు ఉచిత ట్రాన్సాక్షన్స్ మించి ఏటీఎంల్లో నగదు ఉపసంహరించుకుంటే మరింత ఎక్కువ చార్జీ చెల్లించవలసి ఉంది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ, చెక్కుబుక్స్, ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన కొత్త మార్పులు పొదుపు ఖాతాలతోపాటు వేతన ఖాతాలకు వర్తిస్తాయి.

ట్రాన్సాక్షన్ పరిమితి

ట్రాన్సాక్షన్ పరిమితి

హైదరాబాద్‌తో పాటు ఆరు మెట్రో నగరాల్లో ఉచిత ఉపసంహరణ పరిమితి మూడు మాత్రమే. ఇది ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు వర్తిస్తుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఇది వర్తిస్తుంది. నాన్-మెట్రోల్లో అయితే ఐదు ఉపసంహరణలు ఉచితం. అంతకుమించి చేసే ఒక్కో ఉపసంహరణపై రూ.20 ఛార్జీ వర్తిస్తుంది. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రూ.8.50గా ఉంది. గోల్డ్, సిల్వర్, మాగ్నం, టైటానియం, వెల్త్ కార్డ్ హోల్డర్స్ అందరికీ వర్తిస్తుంది.

హోం బ్రాంచీలో ట్రాన్సాక్షన్

హోం బ్రాంచీలో ట్రాన్సాక్షన్

ఐసీఐసీఐ బ్యాంకు హోం బ్రాంచీలో నెలకు నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్‌కు అనుమతిస్తోంది. ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.150 ఛార్జీ వర్తిస్తుంది.

హోం బ్రాంచీలో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్

హోం బ్రాంచీలో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్

ఆగస్ట్ 1వ తేదీ నుండి ఐసీఐసీఐ బ్యాంకు హోం బ్రాంచీలో నెలకు రూ.1 లక్ష వరకు ఉచిత పరిమితి. రూ.1 లక్ష దాటితే రూ.5 లక్షల వరకు కనీసం రూ.150 ఛార్జ్ చేస్తారు.

నాన్-హోం బ్రాంచీలో రోజుకు రూ.25,000కు ఉచితం. రూ.25,000 దాటితే ప్రతి వెయ్యికి రూ.5 ఛార్జ్ ఉంటుంది.

థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్స్

థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్స్

థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ లిమిట్ రోజుకు రూ.25,000. రూ.25000 వరకు ట్రాన్సాక్షన్ పరిమితిపై రూ.150 ఛార్జ్ వర్తిస్తుంది. రూ.25000 మించి అనుమతి లేదు. ఒక ఏడాదిలో 25 లీవ్స్ చెక్కుబుక్ ఉచితం. ఆ పైన 10 లీవ్స్ ప్రతి చెక్కుబుక్‌కు రూ.20 చార్జీ.

English summary

ఏటీఎం నగదు ఉపసంహరణ, చెక్‌బుక్... ఆగస్ట్ నుండి ICICI బ్యాంకు కొత్త ఛార్జీలు | CICI Bank ATM cash withdrawal, chequebook charges from August

ICICI Bank is all set to revise charges for cash withdrawals from ATMs, cheque books and other financial transactions from next month.
Story first published: Sunday, July 11, 2021, 19:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X