For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్: ఏప్రిల్ 1 నుండి వడ్డీ క్యాష్ పేమెంట్ రూల్స్ మార్పు

|

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఎంఐఎస్, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల వడ్డీ చెల్లింపు క్రెడిట్ కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా లింక్ చేయాలని పోస్టల్ డిపార్టుమెంట్ నిర్ణయించింది. దీనికి గడువును మార్చి 31, 2022 వరకు ఇచ్చింది. MIS/SCSS/TD సండ్రీ ఆఫీస్ ఖాతా నుండి ఏప్రిల్ 1వ తేదీ నుండి నగదు రూపంలో వడ్డీ చెల్లింపు అనుమతించబడదని పేర్కొంది.

ఖాతాదారుడు తన సేవింగ్స్ ఖాతాను MIS/SCSS/TD ఖాతాలతో 31-03-2022 వరకు లింక్ చేయకపోతే, MIS/SCSS/TD వివిధ ఆఫీస్ ఖాతాల్లో జమ చేయబడిన వడ్డీలు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా చెక్కు ద్వారా చెల్లించబడతాయని తెలిపింది.

Cash payment rules on interest payment changing from April 1

MIS/SCSS/TD ఖాతాల పైన వడ్డీ 01-04-2022 నుండి ఖాతాదారుని పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయబడుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఖాతాదారులు తమ నెలవారీ, త్రైమాసికం, వార్షిక వడ్డీ, బకాయి క్రెడిట్ కోసం తమ పొదుపు ఖాతాను (పోస్టాఫీస్ సేవింగ్స్ లేదా బ్యాంకు) లింక్ చేయలేదంటే ఈ ఖాతాలకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం సంట్రీ ఆఫీస్ ఖాతా ద్వారా చెల్లించబడదని పేర్కొంది.

MIS/SCSS/TD ఖాతా హోల్డర్లు వడ్డీ చెల్లింపు కోసం పొదుపు ఖాతాను లింక్ చేయడం ద్వారా క్రింది ప్రయోజనాలను పొందగలరని సర్క్యులర్ గమనించింది. MIS/SCSS/TD ఖాతాల నుండి నేరుగా వడ్డీని ఉపసంహరించుకోకుంటే సేవింగ్స్ ఖాతాలో జమ చేయబడిన వడ్డీ అదనపు వడ్డీని పొందుతుంది.

English summary

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్: ఏప్రిల్ 1 నుండి వడ్డీ క్యాష్ పేమెంట్ రూల్స్ మార్పు | Cash payment rules on interest payment changing from April 1

Post Office Savings Schemes big update! Cash payment rules on interest payment changing from April 1.
Story first published: Tuesday, March 15, 2022, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X