For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు కెనరా బ్యాంక్ గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు ఏ కాలపరిమితిపై ఎంత తగ్గించిందంటే?

|

ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆప్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(MCLR) ఆధారిత రుణాలపై వీటిని తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ వడ్డీ రేట్లను అన్ని కాలపరిమితులపై కస్టమర్లకు ఊరట కల్పించింది. 10 బేసిస్ పాయింట్ల నుండి 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.

కార్డులతో ఆఫ్‌లైన్ చెల్లింపులు, ఆర్బీఐ సరికొత్త డిజిటల్ పేమెంట్ పైలట్!కార్డులతో ఆఫ్‌లైన్ చెల్లింపులు, ఆర్బీఐ సరికొత్త డిజిటల్ పేమెంట్ పైలట్!

వడ్డీ రేట్లు తగ్గింపు ఇలా.. నేటి నుండి అమల్లోకి

వడ్డీ రేట్లు తగ్గింపు ఇలా.. నేటి నుండి అమల్లోకి

నెల రోజల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 7.20శాతం నుంచి 7శాతానికి, మూడు నెలల కాలపరిమితి రుణాలపై 7.45 శాతం నుంచి 7.15 శాతానికి, 6 నెలల కాలపరిమితి రుణాలపై 7.5 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 7.55 శాతం నుంచి 7.45 శాతానికి పరిమితం చేసింది. తగ్గించిన వడ్డీ రేట్లు నేటి (ఆగస్ట్ 7, శుక్రవారం) నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎంసీఎల్ఆర్ తగ్గింపు రుణగ్రహీతలపై వడ్డీ రేటు భారాన్ని తగ్గిస్తుంది.

ఆర్బీఐ సంకేతాలు

ఆర్బీఐ సంకేతాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు అవసరమైతే మరిన్ని వడ్డీ రేట్ల కోతలు విధించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. ఆర్బీఐ ఇప్పటికే వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు గత MPC సమావేశాల్లో రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2019 ఫిబ్రవరి నుండి మొత్తం 250 బేసిస్ పాయింట్లు తగ్గాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

గత కొంతకాలంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వివిధ బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాలను కస్టమర్లకు బదలీ చేస్తున్నాయి. ఇదివరకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 14 శాతం నుండి 20 శాతం వరకు ఉండేవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 9.60%-15.65%, కెనరా బ్యాంకు వడ్డీ రేట్లు 8.50%-13.90%, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు 8.35%-10.20%, పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.80%-11.65%, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.10%-15.10%, ఐడీబీఐ బ్యాంకు 8.90%-13.59%, ఇండియన్ బ్యాంకు వడ్డీ రేట్లు 9.20%-13.65%గా ఉన్నాయి.

English summary

కస్టమర్లకు కెనరా బ్యాంక్ గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు ఏ కాలపరిమితిపై ఎంత తగ్గించిందంటే? | Canara Bank slashes MCLR by up to 30 bps

State owned Canara Bank on Thursday slashed its marginal cost of fund-based lending rate (MCLR) by up to 30 basis points across various tenors.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X