For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: ఏడాదిలో ఈ స్టాక్ 56% రిటర్న్స్ ఇవ్వవచ్చు

|

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ HDFC సెక్యూరిటీస్ తాజాగా ఇంజినీర్స్ ఇండియా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని ఆశించవచ్చునని చెబుతుంది. ఏడాదిలో 56 శాతం కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వచ్చునని అంచనా వేస్తోంది. ఇంజినీర్స్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రూ.69.80 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి పెంచింది HDFC సెక్యూరిటీస్. అంటే ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ 56.27 శాతం రిటర్న్స్ ఇస్తుందని అంచనా వేస్తోంది.

- ఇంజినీర్స్ ఇండియా స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర (CMP) - రూ.69.75,
- టార్గెట్ ధర రూ.109,
- 1 ఏడాది కాలంలో రిటర్న్స్ 56.27%

Buy This Stock For 56% Returns In 1 Year

ఇంజినీర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిలకడైన ఫలితాలను నమోదు చేసింది. సమీక్ష త్రైమాసికంలో చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(CPCL), నాగపట్టణం నుండి రెండు భారీ ఆర్డర్స్‌ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ ఇన్‌ఫ్లో వ్యాల్యూ రూ.11.7 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ బలమైన దృక్పథాన్ని కలిగి ఉందని HDFC భావిస్తోంది. మార్జిన్ క్షీణత కారణంగా FY22E, FY23Eలో ఆదాయ అంచనాలను వరుసగా 9 శాతం, 6 శాతం తగ్గించినట్లు తెలిపింది. అయితే ఎన్ఆర్ఎల్, రామగుండం ఫెర్టిలైజర్స్‌లో పెట్టుబడిని, ఆరోగ్యకరమైన వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే మంచి ప్రదర్శన ఉండవచ్చునని తెలిపింది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి సంవరించినట్లు తెలిపింది.

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఆర్థికంగా నష్టపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మార్కెట్ పైన పూర్తి అవగాహనత, స్టాక్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. నిపుణుల సలహాలతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.

English summary

Investment: ఏడాదిలో ఈ స్టాక్ 56% రిటర్న్స్ ఇవ్వవచ్చు | Buy This Stock For 56% Returns In 1 Year

Brokerage firm HDFC Securities has recommended investors to buy Engineers India's stocks with a potential upside of 56.27%, within a target period of 1 year.
Story first published: Friday, November 19, 2021, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X