రైల్వే ప్రయాణీకులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB ఫైనాన్షియల్ సొల్యూషన్స్, రైల్వే టిక్కెట్స్‌ను విక్రయించే IRCTCతో కలిసి ప్రత్యేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విక్రయించింది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) భాగస్వామ్యంతో ఈ రూపే క్రెడిట్ కార్డుని అందిస్తోంది. ఎక్కువగా రైళ్లలో ప్రయాణించేవారు, టిక్కెట్ ధరలో కొంత ఆధా చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుందని BOB ఫైనాన్షియల్స్ తెలిపింది.
టిక్కెట్ బుకింగ్‌తో పాటు ఇతర కొనుగోళ్లకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, సీసీ, ఈసీ టిక్కెట్ బుకింగ్‌కు ఈ కార్డును వినియోగించుకోవచ్చు. ప్రతి రూ.100 ఖర్చుకు 40 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. వీటిని IRCTC వెబ్ సైట్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు.

ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు
అన్ని రైళ్లలో టిక్కెట్ బుకింగ్స్ పైన 1 శాతం వరకు ట్రాన్సాక్షన్ ఫీజు మినహాయింపు కూడా ఉంది. ఈ కార్డును జారీ చేసిన 45 రోజుల్లో కస్టమర్ ఒకేసారి అంటే ఒకే కొనుగోలులో రూ.1000 అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1000 బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా గ్రాసరీ, డిపార్టుమెంటల్ స్టోర్స్‌లో రూ.100 విలువ కలిగిన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే 4 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతర ఉత్పత్తుల కొనుగోలుపై 2 రివార్డు పాయింట్స్ లభిస్తాయి. రైల్వే లాంజ్‌లలోకి ఏడాదికి నాలుగు కాంప్లిమెంటరి విజిట్స్ ఉన్నాయి. ఈ కార్డు ద్వారా అన్ని పెట్రోల్ బంకుల్లో 1 శాతం వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది.

ఇలా రిడీమ్ చేసుకోవచ్చు
ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుదారు IRCTC వెబ్ సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఈ రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. IRCTC వెబ్ సైట్‌లోకి లాగ్-ఇన్ అయి కార్డుపై ఉండే, లాయాల్టీ నెంబర్‌ను వారి IRCTC లాగ్-ఇన్ ఐడీతో అనుసంధానం చేసుకోవడం ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. రైళ్లలో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గరిష్ట ఆదా చేసేలా ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

డిజిటల్ ఇండియాలో భాగంగా...
IRCTC BoB RuPay కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు స్వదేశీ రూపే చెల్లింపు ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా దార్శనికతను సాకారంలో భాగస్వామ్యం అవుతున్నట్లు చెబుతున్నారు. విస్తారమైన కస్టమర్ బేస్ కలిగిన ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ-టిక్కెటింగ్ వెబ్ సైట్ www.irctc.co.in, మొబైల్ యాప్ IRCTC Rail Connect ద్వారా ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications