For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే ఏడాదికి 1,00,000 డాలర్లకు బిట్ కాయిన్? ఈ క్రిప్టోలు కూడా..

|

బిట్ కాయిన్ వచ్చే ఏడాది నాటికి 1,00,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు స్టాండర్డ్ చార్టర్డ్ న్యూ క్రిప్టో కరెన్సీ రీసెర్చ్ టీమ్ బిట్ కాయిన్ భవిష్యత్తుపై అంచనాలు వెల్లడించింది. దీర్ఘకాలంలో ఈ కరెన్సీ 1,75,000 డాలర్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎథేరియం కూడా భారీగా లాభపడుతుందని ఈ బ్యాంకు తెలిపింది. ఎథేర్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 26,000 డాలర్ల నుండి 35,000 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. 2021 చివరి నాటికి లేదా 2022 ప్రారంభంలో బిట్ కాయిన్ లక్ష డాలర్లకు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది అని తెలిపింది. ప్రస్తుతం బిట్ కాయిన్ 50,000 డాలర్ల దిగువన ఉండగా, ఎతేరియం 3,500 డాలర్ల స్థాయిలో ఉంది.

బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు వివిధ క్రిప్టో కరెన్సీలు మున్ముందు దూసుకెళ్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెల రోజులుకు పైగా 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం 50,000 డాలర్ల సమీపంలో ఉంది. ఇటీవలి కాలంలో కార్డానో, డోజీకాయిన్, సోలానా దూసుకెళ్తున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు మరిన్ని క్రిప్టో కరెన్సీలు మంచి వృద్ధి నమోదు చేయవచ్చునని మార్కెట్ నిపుణుల అభిప్రాయం.

Bitcoin may hit $100,000 by early next year

గత వారం రోజుల్లో ఎతేరియం 12.34 శాతం మేర లాభపడింది. ఇటీవల క్రిప్టోల్లో జంప్ చేస్తున్న వాటిలో కార్డానో ముందు ఉంది. ఇది మున్ముందు మరింత బలపడుతుందని భావిస్తున్నారు. దీనిమార్కెట్ క్యాపిటలైజేషన్ 84 బిలియన్ డాలర్లు. క్రిప్టో కరెన్సీ ర్యాంకుల్లో చైన్ లింక్ 12వ స్థానంలో ఉంది. అయితే ఇటీవల ఇన్వెస్టర్లు ఈ క్రిప్టో వైపు మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియాలోను సానుకూలత కనిపిస్తోంది. గత ఏడు రోజుల్లో ఈ క్రిప్టో 23 శాతం లాభపడింది. మరో క్రిప్టో జోడీకాయిన్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 8000 శాతం రిటర్న్స్ అందించడం గమనార్హం. కార్డానో, డోజీకాయిన్‌తో పాటు అవలాంచే కూడా 2021లో మంచి రిటర్న్స్ అందించింది. ఆగస్ట్ నెలలో దీని వ్యాల్యూ మూడు రెట్లు పెరిగింది. ఇది 2020 సెప్టెంబర్‌లో ప్రారభం కాగా, అప్పటి నుండి 2440 శాతం రిటర్న్స్ అందించింది.

- Bitcoin BTC - $46,006.32 - 1.03 శాతం డౌన్
- Ethereum ETH - $3,471.33 - 1.14 శాతం జంప్
- Cardano ADA - $2.43 - 2.43 శాతం డౌన్
- Binance Coin BNB - $408.54 - 1.55 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.04 శాతం డౌన్
- XRP - $1.09 - $1.45 శాతం డౌన్
- Dogecoin - $0.25 - $1.59 శాతం డౌన్
- Polkadot DOT - $27.73 - 0.91 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.03 శాతం జంప్
- Solana SOL - $211.55 - $21.67 శాతం జంప్

English summary

వచ్చే ఏడాదికి 1,00,000 డాలర్లకు బిట్ కాయిన్? ఈ క్రిప్టోలు కూడా.. | Bitcoin may hit $100,000 by early next year

A new cryptocurrency research team at Standard Chartered has predicted bitcoin will double in value and hit $100,000 by early next year and that it could be worth as much as $175,000 longer term.
Story first published: Friday, September 10, 2021, 20:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X