For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ మేక్ లేదా బ్రేక్: మళ్లీ పుంజుకుంటుందా?

|

బిట్ కాయిన్ వ్యాల్యూ పైపైకి ఎగురుతూ, అంతలోనే కిందకు పడుతోంది. టర్కీ క్రిప్టోకరెన్సీ నిషేధం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంశం బిట్ కాయిన్ వంటి క్రిప్టో పైన తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గత వారం, ఈ వారం ప్రారంభంలో క్రిప్టోకరెన్సీ దారుణంగా పతనమైంది. అయితే టెస్లా, ఇతర సంస్థల నిర్ణయాలు కాస్త సానుకూలంగా ఉండటంతో బిట్ కాయిన్ తిరిగి పుంజుకుంది. రెండు రోజులుగా బిట్ కాయిన్ 54,000 డాలర్లకు పైనే కదలాడుతోంది. బిట్ కాయిన్ పక్షం రోజుల క్రితం 63వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 50వేల డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది.

ఇటీవల బిట్ కాయిన్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్‌ను ఎదుర్కొంటోంది. బిట్ కాయిన్ గత వంద రోజుల్లో దాని సగటు ధర కంటే పుంజుకుంది. అయితే ఇప్పటికీ 50 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువనే ట్రేడ్ అవుతోంది. బిట్ కాయిన్ 50 రోజుల సగటును క్రాస్ చేయకుంటే 57,000 డాలర్ల వద్ద కదలాడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 Bitcoin is facing a make or break moment, technicals show

బిట్ కాయిన్ బ్రేకింగ్ ఔట్ అంత సులభం కాదని, గతవారం ఇలాంటి ప్రయత్నంలో విఫలమైందని చెబుతున్నారు. బిట్ కాయిన్ ఇటీవలి కాలంలో క్షీణించినప్పటికీ, గత ఏడాది కాలంలో 511 శాతం ఎగిసింది. గత 12 నెలల కాలంలో ద్రవ్యోల్భణం, సెంట్రల్ బ్యాంకు పాలసీలు అతిపెద్ద డ్రైవర్లుగా ఉన్నాయి.

English summary

బిట్ కాయిన్ మేక్ లేదా బ్రేక్: మళ్లీ పుంజుకుంటుందా? | Bitcoin is facing a make or break moment, technicals show

Bitcoin is facing a make or break moment following a recent bout of selling, according to technical analysis.
Story first published: Thursday, April 29, 2021, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X