For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్ ఇన్సురెన్స్ బిగ్ న్యూస్: క్లెయిమ్స్ తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి

|

ఆరోగ్య బీమాలో మరింత పారదర్శకత కోసం ఇన్సురెన్స్ రెగ్యులేటర్ Irdai తాజాగా బీమా సంస్థలకు ఇన్సురెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించామో ఇన్సూరర్స్ (బీమా సంస్థలు) కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. అదే సమయంలో హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్ కూడా పెరిగాయి. అయితే కొన్నింటిని తిరస్కరిస్తారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం Irdai తాజా ఆదేశాలు జారీ చేసింది.

అందుబాటులో సమాచారం

అందుబాటులో సమాచారం

హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్‌కు సంబంధించి బీమా సంస్థలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని Irdai సూచించింది. ఒకవేళ క్లెయిమ్స్‌ను తిరస్కస్తే అందుకు తగిన కారణాలను పాలసీదారులకు తెలియజేయాలని స్పష్టం చేసింది. అన్ని బీమా సంస్థలు, క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియలో వివిధ దశల్లో పాలసీదారులకు స్పష్టమైన, పారదర్శక సమాచారాన్ని అందించాలని సర్క్యులర్ జారీ చేసింది. పాలసీదారులు నగదురహిత అభ్యర్థనలు/క్లెయిమ్స్ స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా బీమా సంస్థలు తమ వెబ్ సైట్ లేదా పోర్టల్ లేదా యాప్స్ ద్వారా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపింది.

వివిధ దశల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా

వివిధ దశల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా

క్లెయిమ్స్ అభ్యర్థన మొదలు, అది పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వివిధ దశలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు పాలసీదారులకు వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఈ సూచనలు ప్రభుత్వరంగ బీమా సంస్థలైన ఏఐసీ, ఈసీజీసీలకు వర్తించవని తెలిపింది.

తప్పనిసరిగా పాటించాలి

తప్పనిసరిగా పాటించాలి

హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ సర్క్యులర్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ (TPA)తో పాటు లైఫ్, జనరల్, స్టాండలోన్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలకు ఉద్దేశించబడిందని తెలిపింది. బీమా సంస్థలు, టీపీఏలు వీటిని తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. అయితే క్రాప్ ఇన్సురెన్స్, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఇన్సురెన్స్ సెక్టార్‌లు ఏఐసీ, ఈసీజీసీకి వర్తించవు.

English summary

హెల్త్ ఇన్సురెన్స్ బిగ్ న్యూస్: క్లెయిమ్స్ తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి | Be more transparent in health insurance claims settlement

Insurance sector regulator Irdai has asked all insurers to be more transparent in their health insurance claim settlement process and apprise the policyholders of reasons in case of denial of claims filed.
Story first published: Monday, March 22, 2021, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X