For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు ఏ బ్యాంకు ఖాతాదారుడు అయినా ఏ బ్యాంకు నుండి అయినా డబ్బులు ఉపసంహరించుకోవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 24వ తేదీన ప్రకటించారు. అంతేకాదు, ఖాతాల్లో కనీస నగదు లేకపోయినప్పటికీ (మినిమం బ్యాలెన్స్) పెనాల్టీ లేకుండా ఊరట కల్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి చర్యలు చాలా వరకు ప్రకటించారు. ఇప్పుడు క్రమంగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు అన్-లాక్‌లోకి వచ్చేశాం. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొన్ని ఉపశమనాలు క్రమంగా ఉండవు.

సాహసోపేతమైన అడుగు: 59 చైనీస్ యాప్స్ బ్యాన్‌పై పేటీఎం చీఫ్సాహసోపేతమైన అడుగు: 59 చైనీస్ యాప్స్ బ్యాన్‌పై పేటీఎం చీఫ్

ఏటీఎం పరిమితి మించితే ఇక ఛార్జ్

ఏటీఎం పరిమితి మించితే ఇక ఛార్జ్

సాధారణంగా ఏటీఎం నుండి మనీ తీసుకోవడానికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది. పరిమిత ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉచితం. ఇది మించితే ఛార్జీలు వసూలు చేస్తాయి. ఏటీఎం నుండి మీరు కేవలం డబ్బును ఉపసంహరించుకోవడమే కాకుండా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు, ఇతర బ్యాంకు అకౌంట్‌కు మనీ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు ఎస్బీఐ మెట్రోనగరాల్లో ఎనిమిది ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇందులో ఎస్బీఐ ఐటీఎం నుండి 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి 3 తీసుకోవచ్చు. నాన్-మెట్రో కస్టమర్లు పది ట్రాన్సాక్షన్స్, ఇందులో ఎస్బీఐ నుండి ఐదు, ఇతర బ్యాంకు నుండి ఐదు తీసుకోవచ్చు. పరిమితి దాటితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన రూ.20 ప్లస్ జీఎస్టీ విధిస్తుంది. నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన రూ.8 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఇది జూలై 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.

మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా

మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా

కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జూన్ 30వ తేదీ వరకు ఛార్జ్ చేయలేదు. సాధారణంగా ఆయా బ్యాంకుల్లో కస్టమర్ అకౌంట్లలో కనీస మొత్తం ఉండాలి. మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధిస్తాయి. ఆయా బ్యాంకును బట్టి ఇది ఉంటుంది.

ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మెట్రో, పట్టణాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10,000. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,000. కనీస ఖాతాలో నెల రోజుల షార్ట్‌ఫాల్ ఆధారంగా జరిమానా ఉంటుంది.

కనీస నిల్వ రూ.7500 నుండి రూ.10,000 మధ్య ఉంటే రూ.150 ప్లస్ ట్యాక్స్, రూ.5000 నుండి రూ.7500 మధ్య ఉంటే రూ.300 ప్లస్ ట్యాక్స్, రూ.2500 నుండి రూ.5000 మధ్య ఉంటే రూ.450 ప్లస్ ట్యాక్స్, రూ.2500కు లోపు ఉంటే రూ.600 ప్లస్ ట్యాక్స్ జరిమానాగా విధిస్తుంది.

ఇది గుర్తు పెట్టుకోండి

ఇది గుర్తు పెట్టుకోండి

ఇక నుండి ఏటీఎంకు వెళ్లినప్పుడు మన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పరిమితిని గుర్తుంచుకొని, ఆ మేరకు తీసుకోవడం మంచిది. ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ఫైన్ విధిస్తారు.

ఇక కరోనా నేపథ్యంలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి. ఇంకొంతమంది వేతనాల్లో కోత విధించారు. మరికొంతమంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారు. ఇలాంటి వారి చేతిలో నగదు లేక.. ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. చేతిలో నగదు ఉంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి.

జరిమానా ఇలా తప్పించుకోండి

జరిమానా ఇలా తప్పించుకోండి

చాలామంది వేతనజీవులు ఉద్యోగం మారడం లేదా నగరాలు మారుతుంటారు. కాబట్టి ఒకటికి మించి బ్యాంకుల్లో అకౌంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని బ్యాంకులు కొన్ని నెలల తర్వాత జీరో అకౌంట్‌గా ఉండే శాలరీ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కిందకు మారుస్తాయి. వేతన క్రెడిట్స్ లేకపోవడంతో అలా చేస్తాయి. అంటే మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచాలి అని అర్థం. ఇలాంటివి ఒకటికి మించి బ్యాంకు అకౌంట్స్ ఉండి, భారంగా అనిపిస్తే ఈమెయిల్ లేదా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఖాతాలు మూసివేసే అవకాశాన్ని పరిశీలించాలి. కరోనా టైంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం మంచిది. అత్యవసరమైతే తప్ప బ్యాంకు బ్రాంచీని లేదా ఏటీఎంకు వెళ్లకపోవడం బెట్టర్.

English summary

జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు | Banks charges for these services from July 1

As India begins to gradually lift its lockdown, some of the relief measures announced earlier when the pandemic was taking root may now be slowly rolled back. These bank charges get restored from today, July 1.
Story first published: Thursday, July 2, 2020, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X