For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‌న్యూస్: ఈ సేవల కోసం మిస్డ్ కాల్ నెంబర్స్ ఇవే...

|

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) తన కస్టమర్లు బ్రాంచీకి రాకుండానే వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు BOB తన కస్టమర్లు, అకౌంట్ హోల్డర్ల కోసం కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన నెంబర్లు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వెల్లడించింది. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు తమ కస్టమర్లకు బ్యాంకుకు రాకుండానే వివిధ సేవలు అందిస్తున్నాయి.

Petrol, Diesel Prices: ఈ ప్రాంతాలలో రూ.100 దాటిన పెట్రోల్ ధరPetrol, Diesel Prices: ఈ ప్రాంతాలలో రూ.100 దాటిన పెట్రోల్ ధర

టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా...

టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా...

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, చెక్ బుక్ వంటి ఇతర అవసరాల కోసం బ్యాంకు చుట్టూ తిరగవలసిన అవసరం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక నంబర్ల జాబితాను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడంతో సహా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే టోల్-ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా పలు సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకోవచ్చునని తెలిపింది. BoB జారీ చేసిన ఫోన్ నెంబర్లు 24 X7 అందుబాటులో ఉంటాయి.

అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం..

- అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం - 8468001111 కు మిస్ కాల్స్ ఇవ్వాలి.

- చివరి 5 ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవడం కోసం - 8468001122 కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

- టోల్ ఫ్రీ-18002584455/ 18001024455

- వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం - 8433888777

వెంటనే బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలు

వెంటనే బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలు

BOB వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చెక్ స్టేటస్ తెలుసుకోవడం, వడ్డీ రేట్లు, మినీ స్టేట్‌మెంట్స్ వంటివి తెలుసుకోవచ్చు. బ్యాంక్ బరోడా ఎమ్ కనెక్ట్ ప్లస్ యాప్‌ను కూడా తీసుకు వచ్చింది. ఖాతాదారులు 24X7 వారి మొబైలd ఫోన్లలో బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలను వెంటనే పొందవచ్చు.

English summary

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‌న్యూస్: ఈ సేవల కోసం మిస్డ్ కాల్ నెంబర్స్ ఇవే... | Bank of Baroda List of phone numbers you must know to avoid visiting branch

The Bank of Baroda has introduced a list of important numbers for its customers and account holders amid coronavirus pandemic. The customers can continue their banking services from their home in order to maintain the COVID-19 norms at the bank branches.
Story first published: Wednesday, May 12, 2021, 9:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X