For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వద్దు వద్దు.. నామినీని మరవొద్దు

|

మీకు తెలుసా నామినీకి ఉన్న ప్రాధాన్యం. జీవిత బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, బ్యాంకుల్లో డిపాజిట్లు, పోస్టాఫీసుల్లో ఖాతాలు వంటి వాటి దరఖాస్తుల్లో నామినీకి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కొంత మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల అనుకోని సందర్భాల్లో ఏమైనా జరిగితే సంబంధిత వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు ఆర్ధిక ప్రయోజనాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే నామినీ సదుపాయాన్ని కల్పించారు. నామినీ పేరును తెలియజేయడం వల్ల సంబంధిత వ్యక్తి తదనంతరం రావాల్సిన సొమ్ముకు హక్కుదారుగా పేర్కొనడమన్నట్టు. అయితే వివిధ సందర్భాల్లో నామినీకి సంబంధించిన వివరాల ప్రాధాన్యం గురించి చూద్దాం.

జీవిత బీమా పాలసీలు

జీవిత బీమా పాలసీలు

బీమా పాలసీని తీసుకునే సమయంలో నామినీ వివరాలు అందించాల్సి ఉంటుంది. వ్యక్తి మరణించిన సమయంలో ఆ వ్యక్తి పాలసీకి సంబంధించిన ప్రయోజనాలను నామినీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకటికన్నా ఎక్కువ మందిని నామినేట్ చేసినప్పుడు వారి వాటాను పేర్కొనాల్సి వస్తుంది.

బ్యాంక్ ఖాతాలు

బ్యాంక్ ఖాతాలు

బ్యాంకు ఖాతాలో ఒకరి పేరును మాత్రమే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఉమ్మడిగా బ్యాంకు లాకర్ ఖాతాను నిర్వహిస్తుంటే మాత్రం ఇద్దరి వరకు నామినేషన్ కు అనుమతిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, రీకరింగ్ డిపాజిట్ ఖాతాలు ఒకే బ్యాంకులో ఉన్నప్పుడు వేర్వేరు నామినీలను ఎంచుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ లో ముగ్గురి వరకు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. యూనిట్లను కలిగి ఉన్న వ్యక్తి దురదృష్ట వశాత్తు మరణించినట్టయితే ఆ యూనిట్లను నామినీకి బదలాయించడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఫోలియో లు లేదా ఖాతాలు తెరిచినపుడు నామినేషన్ సదుపాయాన్ని తప్పనిసరి చేశారు. కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, ఇతర వ్యక్తులను కూడా నామినీగా పేర్కొనే సదుపాయం కల్పిస్తున్నారు.

ప్రావిడెంట్ ఫండ్

ప్రావిడెంట్ ఫండ్

ప్రావిడెంట్ ఫండ్ ఒకరికి మించి నామినేషన్లకు అనుమతిస్తుంది. ఇందులో ప్రతి నామినీ వాటాను పేర్కొనాల్సి ఉంటుంది.

నామినీ వివరాల్లో మార్పులు చేసుకోవద్దని అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా నామినీ వివరాలు ఇవ్వడమే మేలు. సంబంధిత వ్యక్తి మరణించిన సమయంలో అతనికి సంబంధించిన ఆస్తులను పొందే విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటాయి. అంతే కాకుండా ఆర్ధిక ప్రయోజనాలను పొందడంలోనూ ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

English summary

వద్దు వద్దు.. నామినీని మరవొద్దు | Assets care: Don't forget nominee

Nomination is the process of appointing a person to take care of your assets in the event of death. So that don't forget to mention nominee name in your application form of insurance policy etc.
Story first published: Saturday, April 18, 2020, 17:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X