For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి

|

సగటు భారతీయ కుటుంబంలో సొంతిల్లు అనేది అత్యంత ప్రతీష్టాత్మక కలలో ఒకటి! తగినంత పొదుపు చేస్తూ, మీ సొంత డబ్బుతో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. కానీ దీనికి సమయం తీసుకుంటుంది. మీ వద్ద నిధులు పరిమితంగా ఉంటే బ్యాంకు నుండి ఇంటి కోసం రుణం తీసుకోవడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. రుణ మొత్తం పెద్ద మొత్తం కాబట్టి ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి. మీ ఉద్యోగం, వ్యాపారం, అనుభవం, మీ క్రెడిట్ హిస్టరీ, ఇంటి వ్యాల్యూ ఆధారంగా మీకు రుణం వస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవడానికి మనకు సరైన కాలవ్యవధిని, తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకును, మనకు అవసరమైన మొత్తం వచ్చే బ్యాంకును ఎంచుకోవాలి.

మీరు కొనుగోలు చేయాలనుకున్న ఆస్తిని బట్టి కాలపరిమితి ఉంటుంది. హోమ్ లోన్ వ్యవధి కనిష్టంగా అయిదేళ్లు, గరిష్టం 30 ఏళ్లు ఉంది. ఇంటిని కొనుగోలు చేసేవారు ఈఎంఐ భారాన్ని తక్కువగా చేసుకోవడానికి అయిదు నుండి పదిహేనేళ్లకు బదులు సాధారణంగా 20 నుండి 20 ఏళ్లను ఎంచుకుంటారు. రుణ కాలపరిమితిని ఇష్టారీతిన కాకుండా మన ఆదాయాన్ని బట్టి ఎంచుకోవాలి. కాలపరిమితి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం...

రుణగ్రహీ వయస్సు

రుణగ్రహీ వయస్సు

హోమ్ లోన్ పదవీ కాలాన్ని ఎంచుకోవడానికి కీలకమైన అంశం మీ వయస్సు. దీని ఆధారంగా ఎంచుకోవాలి. మీ వయస్సు 30 ఏళ్లు అంతకు తక్కువ ఉంటే మీరు హోమ్ లోన్ కాలపరిమితిని 25 నుండి 30 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోవాలి. అప్పటికే కుటుంబ భారం మీ మీద ఉంటుంది కాబట్టి గరిష్ట ఖర్చులు ఉంటాయి.

కాబట్టి ఈఎంఐ భారం తగ్గించుకొని, కాలవ్యవధిని పెంచుకోవడం మంచిది. అయితే ఆర్థికంగా మీకు ఇబ్బందులు లేని పరిస్థితుల్లో అధిక ఈఎంఐని ఎంచుకోవాలి. అంటే కాలపరిమితి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మీ వడ్డీ చెల్లింపు భారం కాస్త తగ్గుతుంది.50 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండి పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉంటే తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం మేలు.

రుణ మొత్తం

రుణ మొత్తం

మీరు తీసుకున్న రుణ మొత్తం మీ కాలపరిమితిలో రెండింతలు, అంతకంటే ఎక్కువగా చెల్లించవలసి రావొచ్చు. మీరు తీసుకున్న రుణ మొత్తం ద్వారా కూడా మీ కాలపరిమితిని నిర్ణయించుకోవచ్చు. మీ లోన్ మొత్తం మీ నెలవారీ ఆదాయానికి చాలా ఎక్కువ రెట్లు అయితే సుదీర్ఘ కాలాన్ని, తక్కువ రెట్లు అయితే తక్కువ పదవీ కాలాన్ని ఎంచుకోవాలి. మీ నెలవారీ ఆదాయంలో హోమ్ లోన్ కోసం సగం లేదా అంతకంటే ఎక్కువ వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమంటే ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుంది. తక్కువ కాలపరిమితి ఉంటే వడ్డీ భారం కాస్త తగ్గుతుంది. ఏదేమైనా మీ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది కలిగించని ఈఎంని ఎంచుకోవాలి.

వడ్డీ చెల్లింపు

వడ్డీ చెల్లింపు

మీ క్రెడిట్ స్కోర్ మీ వడ్డీ రేటును నిర్ణయించడంలో తోడ్పడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కాలపరిమితి కూడా వడ్డీ భారం పైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీరు రూ.80 లక్షల హోమ్ లోన్ 8.2 శాతం వడ్డీ రేటుతో 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకుంటే మీపై వడ్డీ భారం రూ.60 లక్షల వరకు పడుతుంది. అదే 25 ఏళ్లకు అయితే రూ.1.8 కోట్లు అవుతుంది. అంటే దాదాపు మీరు తీసుకున్న మొత్తానికి రెండింతలు.

జాగ్రత్తగా ఎంచుకోవాలి?

జాగ్రత్తగా ఎంచుకోవాలి?

హోమ్ లోన్ తీసుకోవడం, ఈఎంఐ-కాలపరిమితిని ఎంచుకోవడం చాలా కీలకం. ఎందుకంటే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అని లెక్కలు వేసుకొని.. భారం కాకుండా ఎంచుకోవాలి. పర్సనల్ లోన్ లేదా వెహికిల్ లోన్ తీసుకుంటే మనం ఎంచుకున్న కాలపరిమితిని బట్టి 10 శాతం నుండి 40 లేదా 50 శాతం ఈఎంఐకి వెళ్తుంది. కానీ హోమ్ లోన్ తీసుకుంటే చాలా పెద్ద మొత్తం పోతుంది. రూ.60,000 వేతనం వస్తే హోమ్ లోన్ కోసమే రూ.40 వేలకు అటు ఇటుగా పోవచ్చు. కాబట్టి దీనిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి | Are you taking home loan? Consider these factors

To help you understand better, here is the guide to know about your home loan tenure and how it affects your overall payments.
Story first published: Tuesday, November 23, 2021, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X