For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే ఇక్కడ అంతకంటే ఎక్కువే!

|

చేతిలో డబ్బులు ఉండి, ప్రస్తుతానికి వాటితో అవసరం లేకుంటే చాలామంది వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేస్తుంటారు. ఎంతోకొంత వస్తుందని FDలకు మొగ్గు చూపుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది నాలుగుసార్లు రెపో రేటును తగ్గించింది. దీంతో కస్టమర్లు తీసుకునే రుణాలపై వడ్డీ భారం తగ్గుతుండగా, మరోవైపు డిపాజిట్స్ పైన వచ్చే వడ్డీ తగ్గుతుంది. అంటే డిపాజిట్స్ పైన వడ్డీ రేటు తగ్గడంతో వడ్డీ ద్వారా వచ్చే రాబడి తగ్గుతుంది. ఈ ఏడాది ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ప్రభుత్వరంగ SBI, HDFC, PNB, ICICI వంటి బ్యాంకులు FDలపై 6.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఏడాది నుంచి పదేళ్ల వరకు ఉన్న FDలకు ఇది వర్తిస్తుంది. ఇంతకంటే ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

స్విస్ బ్యాంకులో మహారాష్ట్ర రాజ కుటుంబ దంపతులకు ఖాతాస్విస్ బ్యాంకులో మహారాష్ట్ర రాజ కుటుంబ దంపతులకు ఖాతా

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు/న్యూ ప్రైవేటు బ్యాంకు FDs

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు/న్యూ ప్రైవేటు బ్యాంకు FDs

అధిక రిటైల్ డిపాజిట్స్‌ను ఆకర్షించేందుకు DCB, IDFC ఫస్ట్ బ్యాంకు వంటి బ్యాంకులు, కొత్త ప్రయివేటు బ్యాంకులు సాధారణ పౌరులకు 7.80 శాతం నుంచి 8.4 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. వీటిల్లో పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇవి ఇన్సురెన్స్, క్రెడిట్ గ్యారంటీ స్కీం కిందకు వస్తాయి. కాబట్టి సహకార బ్యాంకులతో పోలిస్తే ఇవి సురక్షితం.

పోస్టాఫీస్ స్కీమ్స్

పోస్టాఫీస్ స్కీమ్స్

పోస్టాఫీస్ స్కీమ్స్ FDల కంటే సురక్షితమైనవి. అంతేకాకుండా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటివి కొన్ని లాంగ్ టర్మ్ డిపాజిట్స్. మరికొన్ని షార్ట్ టర్మ్, మీడియా టర్మ్ డిపాజిట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పథకాలపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే 1.5 శాతం వరకు ఎక్కువగా కూడా వస్తాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు అధిక పన్నుతో పాటు పన్ను ప్రయోజనాలు అందిస్తాయి.

ట్యాక్స్ ఫ్రీ బాండ్స్

ట్యాక్స్ ఫ్రీ బాండ్స్

పన్ను చెల్లించేవారికి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. పన్ను పరిధిలోకి వచ్చేవారు ప్రభుత్వ సంస్థలు జారీ చేస్తున్న పన్నురహిత బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ డిపాజిట్లలో డిఫాల్ట్ ప్రమాదం తక్కువ. 10 నుంచి ఇరవై ఏళ్ల కాలపరిమితితో ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ట్యాక్స్ ఫ్రీ బాండ్లపై 5.1 శాతం నుంచి 5.4 శాతం వరకు రాబడి ఉంది.

English summary

డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే ఇక్కడ అంతకంటే ఎక్కువే! | Are you Looking for higher return than bank FD?

With the Reserve Bank of India cutting repo rate by 135 basis points in this year so far, banks are reducing interest rate on their term deposits so that they will be able to pass on the reduction in repo rate to lending rates.
Story first published: Monday, November 25, 2019, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X