For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హామీ ఇస్తున్నారా? బీ కేర్ ఫుల్.. మీ క్రెడిట్ స్కోర్ పై దెబ్బ పడుతుంది జాగ్రత్త..

|

మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారా? మీకు సంపాదన బాగా ఉందా? అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారా? అయితే మీలాంటి వారే కావాలి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకునే వారికి. మీకు బాగా తెలిసిన వారు బ్యాంకు నుంచి రుణం పొందాలనుకున్నప్పుడు మీ హామీని ఇవ్వమని కోరవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మొహమాటానికన్నా సంతకం పెడితే ఇక ఆ రుణ భారం మీ మెడకు చుట్టుకున్నట్టే. భవిష్యత్తులు మీరు హామీ సంతకం పెట్టిన వ్యక్తి రుణాన్ని చెల్లించే విషయంలో వ్యవహరించే తీరు మీకు ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.

షాకింగ్: 'ఐటీ కంపెనీలకు మరో మార్గం లేదు, 10% ఉద్యోగాల కోతషాకింగ్: 'ఐటీ కంపెనీలకు మరో మార్గం లేదు, 10% ఉద్యోగాల కోత

మీరు రుణం చెల్లిస్తానని ఒప్పుకున్నట్టే..

మీరు రుణం చెల్లిస్తానని ఒప్పుకున్నట్టే..

మీరు రుణానికి గ్యారంటీ ఇచ్చారంటే రుణం చెల్లించే కాలపరిమితిలో సంభందిత వ్యక్తి రుణం చెల్లించకపోతే మీరు చెల్లిస్తానని ఒప్పుకున్నట్టే లెక్క. రుణం తీసుకున్న వ్యక్తి తన వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నన్ని రోజులు మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. దురదృష్టవశాత్తు రుణం తిరిగి చెల్లించనప్పుడే తల నొప్పి మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉండకుండా చూసుకోవాలి.

ఎవరైనా హామీగా ఉండవచ్చు..

ఎవరైనా హామీగా ఉండవచ్చు..

బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి ఎవరైనా హామీ ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు గ్యారంటీ సంతకం చేయవచ్చు. అయితే వీరి ఆర్ధిక స్థోమతను బట్టి మాత్రమే రుణానికి హామీగా ఉండే అవకాశం ఉంటుంది. రుణ గ్యారంటీకి సంభందించిన నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే హామీ సంతకం చేయడానికి అవకాశం ఉంటుంది. హమీదారు వయసు, ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

* మీరు రుణ హామీ ఇచ్చే ముందు ఆ వ్యక్తి ఆర్ధిక పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతాడా లేదా చేసుకోండి. ఒకవేళ చెల్లించలేని పరిస్థితి ఉంటే కాస్త ముందు జాగ్రత్తగా దూరం ఉండటమే మేలు.

* ఒకవేళ హామీగా ఉండాలనుకుంటే అతను రుణం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నా మీరు చెల్లించే స్థాయి ఉండాలి. లేకపోతే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి. మీరు హామీ ఇవ్వాలనుకునే వ్యక్తికీ ఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నాయేమో తెలుసుకోండి. ఒకవేళ తీసుకుని ఉంటె వాటి చెల్లింపులో ఏమైనా సమస్యలున్నాయో చూడండి.

* ఒకవేళ ఇలాంటి ఇబ్బంది వద్దనుకుంటే మీరు సున్నితంగా తిరస్కరించడం మేలు.

* మీరు రుణానికి గ్యారంటీ ఉంటే ఆ మేరకు మీ రుణ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి మీరు రుణ హామీ ఇస్తున్నారంటే మీకు సమస్యలు ఉండవచ్చన్నమాట.

* మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న వారికి గ్యారంటీ అవసరం ఉండదు. రుణదాత గ్యారంటీ అడుగుతున్నారంటే ఏ కారణంగా అడుగుతున్నారో తెలుసుకోండి. లేకపోతే మీరు అతని తరపున రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది.

క్రెడిట్ స్కోర్ కు దెబ్బ

క్రెడిట్ స్కోర్ కు దెబ్బ

* బ్యాంకు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణం పొందేవిషయంలో క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యమైనది. మీరు హామీగా ఉండే సమయంలో మీ క్రెడిట్ స్కోర్ ను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే విధంగా తీసుకున్న రుణం సరిగ్గా చెల్లించనప్పడు ఆ మేరకు క్రెడిట్ స్కోర్ బ్యూరోలకు ఆ సమాచారం తెలియజేస్తాయి. అప్పుడు రుణం తీసుకున్న వ్యక్తితో పాటు రుణ హామీ ఇచ్చిన వ్యక్తి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు భవిష్యత్తులో రుణం తీసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

* ఇక రుణం తీసుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించకపోయినా లేదా ఆవ్యక్తి మరణించి రుణ మొత్తం మిగిలిపోయినా బ్యాంకులు తీసుకునే చర్యలకు భాద్యత వహించాల్సి రావచ్చు. అందుకే రుణాలకు హామీ ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి.

English summary

హామీ ఇస్తున్నారా? బీ కేర్ ఫుల్.. మీ క్రెడిట్ స్కోర్ పై దెబ్బ పడుతుంది జాగ్రత్త.. | Are you giving loan Guarantee? Be careful.. It can hit your credit score!

While giving loan Guarantee think twice because in future it may hit your credit score if the borrower didn't pay the loan amount properly. If the borrower defaults or unable to pay the loan you will be responsible for the remaining due amount.
Story first published: Friday, November 8, 2019, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X