For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ వారంలో 15,000 తగ్గింది: బంగారం ధరకు ఫుల్‌స్టాప్ పడిందా, ఈ వారం ఎలా ఉంటుంది?

|

గత వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో దాదాపు 200 డాలర్లు వరకు తగ్గింది. ఆగస్ట్ ప్రారంభంలో 2,072 పలికిన ధర గతవారం 1,880 డాలర్లు కూడా పలికిన సందర్భం ఉంది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 1,900 డాలర్ల పైకి చేరుకుంది. అయినప్పటికీ 2,000 డాలర్ల దిగువనే ఉంది. ఇక వెండి ధర దాదాపు 30 డాలర్ల నుండి 24 డాలర్లకు దిగి వచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావంపై ఆధారపడి పసిడి ధరలు ఉంటాయని చెబుతున్నారు.

దశాబ్దం కనిష్టానికి గ్యాస్ ధర, అక్టోబర్ నుండి భారీగా తగ్గే ఛాన్స్దశాబ్దం కనిష్టానికి గ్యాస్ ధర, అక్టోబర్ నుండి భారీగా తగ్గే ఛాన్స్

పసిడి ధరలకు ఫుల్‌స్టాప్ పడిందా?

పసిడి ధరలకు ఫుల్‌స్టాప్ పడిందా?

అంతకుముందు భారీగా పెరిగిన పసిడి ధర గత వారం ఏకంగా వేల రూపాయల్లో తగ్గాయి. రష్యా వ్యాక్సీన్, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, డాలర్ కుదురుకోవడం వంటి వివిధ కారణాలతో పసిడి ధరలకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా అంటే అప్పుడే కాదని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ధరలు ఇలాగే తగ్గుతాయని చెప్పలేమని, కరోనా సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

పసిడి, బంగారం ఈ వారం ఎలా ఉండనుంది?

పసిడి, బంగారం ఈ వారం ఎలా ఉండనుంది?

దేశీయంగా పసిడి అక్టోబర్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.51,100 దిగువకు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే రూ.48,700 నుండి రూ.50,000 దికువకు కూడా రావొచ్చునని చెబుతున్నారు. వెండి కాంట్రాక్ట్ రూ.71,700కు పైకి వెళ్ళకుంటే ప్రతికూలత నమోదు చేసే అవకాశముందని అంటున్నారు.

లక్షల దిశగా బంగారం ధర..!

లక్షల దిశగా బంగారం ధర..!

గత సంక్షోభాల పరిస్థితులను గమనించినప్పడు పసిడి ధరలు సమీప కాలంలో తిరిగి ఇటీవలి గరిష్టానికి చేరుకోకపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2,000 డాలర్ల లోపు కొట్టుమిట్టాడవచ్చునని చెబుతున్నారు. మార్కెట్‌కు ఇది ఆరోగ్యకరంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 15,000 డాలర్లకు (మన మార్కెట్లో 10 గ్రాములు రూ.3 లక్షలకు పైగా) చేరుకోవచ్చునని, అయితే అందుకు దారి వేయడానికి ముందు ఔన్స్ 1700 డాలర్ల దిగువకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary

అక్కడ వారంలో 15,000 తగ్గింది: బంగారం ధరకు ఫుల్‌స్టాప్ పడిందా, ఈ వారం ఎలా ఉంటుంది? | Analysis: Gold price plunges nearly $200 in a week

This week’s rundown is a roller coaster ride. Gold saw its biggest daily drop in seven years, falling nearly $200 this week from $2,060 an ounce to below $1,880.
Story first published: Monday, August 17, 2020, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X