For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్టర్ల ఆందోళన, స్టాక్ మార్కెట్లో తిరోగమనానికి కారణాలు..

|

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కరోనా కారణంగా గత రెండు నెలలుగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అడపాదడపా స్వల్ప లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజున తమ ఈక్విటీ పథకాల నికర ఆస్తు విలువను పెంచుకునేందుకు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారని, దీంతో నిన్న మార్కెట్ సెంటిమెంట్ బలపడి లాభాల్లో ముగిశాయని చెబుతున్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా మొర ఆలకించండి: సీతారామన్‌కు మాల్యా, లాక్‌డౌన్‌పై ఏమన్నాడంటే

ప్రభుత్వం ఊతమిస్తేనే..

ప్రభుత్వం ఊతమిస్తేనే..

నిన్న సెన్సెక్స్ 1,028 పాయింట్లు (3.62 శాతం) ఎగిసి 29,468 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 316 పాయింట్లు (3.82 శాతం) బలపడి 8,598 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. జనవరి నుండి సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ గరిష్టానికి చేరుకొని ఈ రెండు నెలల్లో 30 శాతానికి పైగా పడిపోయాయి. కానీ ఈ రోజు ఏప్రిల్ 1) మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఐతే కరోనా ప్రభావం భారీగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తన చర్యలతో మార్కెట్‌కు ఊతమివ్వాలని అప్పటి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ఆఫిసర్ మహేష్ పాటిల్ అన్నారు.

FPIల అమ్మకం కంటే ఎక్కువగా కొనుగోలు చేసిన DII

FPIల అమ్మకం కంటే ఎక్కువగా కొనుగోలు చేసిన DII

మ్యూచువల్ ఫండ్స్, ఇన్సెరన్స్ కంపెనీలు వంటి డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (DII)లు మంగళవారం రూ.3,576 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయని చెబుతున్నారు. అదే సమయంలో ఫారన్ పోర్ట్‌ఫోలియే ఇన్వెస్టర్లు వరుసగా 26వ రోజు విక్రయాలు జరిపారని, నిన్న రూ.3,044 కోట్లు విక్రయించారని తెలిపారు. మార్చిలో ఇది రూ.63,000 కోట్లుగా ఉందన్నారు.

అందుకే నిన్న మార్కెట్ సెంటిమెంట్ బలపడింది

అందుకే నిన్న మార్కెట్ సెంటిమెంట్ బలపడింది

ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగుతున్నారు. మార్చి నెలలో రూ.63,000 కోట్లకు పైగా షేర్లు విక్రయించారు. నిన్న ఒక్కరోజే రూ.3,044 కోట్ల షేర్లు ఉన్నాయి. మార్కెట్లలో FPI సేల్స్ పెరుగుతుండటంతో డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (DIIs), ఇండియన్ ఇన్సురెన్స్ కంపెనీలు వాటాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఎఫ్‌పీఐ సెల్లింగ్ కంటే ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్ నిన్న బలపడింది. కానీ ఎఫ్‌పీఐలు ఇండియన్ ఎంఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రేట్ కంటే భారీ ఎక్కువకు విక్రయించి వెళ్లిపోతున్నారు. ఇది మార్కెట్లను కిందకు లాగుతోంది.

ఈ రోజు ఇలా..

ఈ రోజు ఇలా..

ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం అయితే ఇండియన్ ఈక్విటీ, డెట్ మార్కెట్ నుండి ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు 15.9 బిలియన్డాలర్లు లేదా రూ.1.2 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. FPIలు వెనక్కి తీసుకోవడం బుధవారం మాత్రం మార్కెట్లపై ప్రభావం చూపాయి. అలాగే మార్చి నెలలో ఆటో సేల్స్ భారీగా తగ్గిపోయాయి. మారుతీ సుజుకీ సేల్స్ 47 శాతం, అశోక్ లేలాండ్ సేల్స్ 90 శాతం పడిపోయాయి. దీంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం నష్టపోయింది.

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

కార్పోరేట్లు జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCDs)పై రూ.60,000 కోట్ల వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చే నెల చెల్లింపుల కోసం రావాలి. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీల వద్ద క్యాష్ ఫ్లో లేదు. కాబట్టి చెల్లింపులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే పలు కంపెనీలు పేమెంట్స్ రీషెడ్యూల్ చేయాలని కోరాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సౌత్ కొరియా షేర్లు 1.34 శాతం, జపాన్ షేర్లు 3.48 శాతం, అమెరికా షేర్లు 3 శాతం వరకు నష్టపోయాయి.

English summary

analysis: Domestic buying key factor behind recent stocks rally

Indian stocks jumped on Tuesday, recouping majority of the previous day’s losses, as optimism in global markets helped offset the gloom around the continued spread of coronavirus across the country and worldwide. Brokers said aggressive purchases by domestic mutual funds to prop up the net asset values (NAVs) of their equity schemes on the last day of the financial year also lifted sentiment.
Story first published: Wednesday, April 1, 2020, 16:21 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more