For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్: HDFCతో భారీ డిస్కౌంట్

|

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ సేల్స్‌కు సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్‌తో వస్తోంది. పండుగ ఆఫర్‌లలో భాగంగా వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, మంచి డీల్స్ వంటివి ఉంటాయి.

దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీ నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ పెస్టివెల్ సేల్ ప్రారంభం అవుతోంది. అయితే ఎప్పటి వరకు ఇది కొనసాగుతుందో వెల్లడించాల్సి ఉంది. ప్రీమియం మెంబర్స్‌కు 24 గంటల ముందే సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 16వ తేదీ నుండి బిగ్ బిలియన్ డేస్ ప్రారంభిస్తోంది.

విజిటింగ్ కార్డ్ సైజ్‌లో ఆధార్ ఇలా తీసుకోండి.. ఇవి తప్పనిసరివిజిటింగ్ కార్డ్ సైజ్‌లో ఆధార్ ఇలా తీసుకోండి.. ఇవి తప్పనిసరి

HDFC కార్డు ఉంటే తక్షణ డిస్కౌంట్, బజాజ్ ఫిన్ సర్వ్‌తో

HDFC కార్డు ఉంటే తక్షణ డిస్కౌంట్, బజాజ్ ఫిన్ సర్వ్‌తో

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్‌లో భాగంగా ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును ఉపయోగిస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది. షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా వర్తిస్తుంది. కనిష్టంగా రూ.1,000 కొనుగోలు చేస్తే 5 శాతం అడిషనల్ క్యాష్ బ్యాక్ ఉంది. అయితే మొదటి ఆర్డర్ పైన ఈ 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. అమెజాన్ మొబైల్స్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ సహా వివిధ ఉత్పత్తులపై ఆఫర్ ఇస్తోంది.

బజాజ్ ఫిన్ సర్వ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై వడ్డీరహిత వాయిదాల్లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. రూ.1 లక్ష వరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ పే డెయిలీ షాపింగ్ రివార్డ్స్ ఉంటాయి. దీంతో రూ.500 వరకు సేవ్ చేయవచ్చు.

దక్షిణ భారతీయుల కోసం అమెజాన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోను షాపింగ్ కోసం వెసులుబాటు కల్పిస్తోంది.

చిన్న, మధ్యస్థాయి వ్యాపారులకు అవకాశం

చిన్న, మధ్యస్థాయి వ్యాపారులకు అవకాశం

ఈ సంవత్సరం అమెజాన్ తన సేల్స్‌లో చిన్న, మధ్యస్థ వ్యాపారులను కూడా చేర్చింది. ఈ అమ్మకం స్మాల్ అండ్ మీడియం బిజినెస్(SMB)పై దృష్టి సారించామని, ఇక్కడి నుండి కొనుగోలు చేసిన వారికి ఆ తర్వాత 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. భారత్‌లో చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలను ప్రారంభించేందుకు అమెజాన్ 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. 2025 నాటికి 10 మిలియన్ల చిన్న వ్యాపారులను డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆఫర్స్.. గోల్డెన్ అవర్

ఆఫర్స్.. గోల్డెన్ అవర్

ఈ సేల్‌లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసే వన్ ప్లస్ 8టీ 5జీ ఫోన్, అక్టోబర్ 15న రానన్న అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్స్‌ను కూడా విక్రయిస్తారు. వీటితో మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, పిల్లల బొమ్మలపై కూడా ఆఫర్స్ ఉన్నాయి.

అమెజాన్ యాప్‌లో రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు గోల్డెన్ అవర్స్‌లో కొన్ని ఉత్పత్తులపై నిబంధనల మేరకు ప్రత్యేక రాయితీ ఉంటుంది.

English summary

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్: HDFCతో భారీ డిస్కౌంట్ | Amazon Great Indian festive sale to start on October 17

HDFC Bank customers making new purchases during the Amazon Great Indian Festival sale will be able to avail a 10 percent instant discount.
Story first published: Tuesday, October 6, 2020, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X