For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిజినెస్ కోసం ఎయిర్‌టెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్, వివరాలు ఇవే

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. దీంతో టెలికం సంస్థలు కస్టమర్లకు కొన్ని ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో ఇటీవల కొన్ని అదనపు డేటా ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్‌టెల్ వాణిజ్య సంస్థల కోసం ప్రత్యేకంగా వర్క్ ఫర్మ్ హోమ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు ఎయిర్ టెల్ వ్యాపార సంస్థల సేవల విభాగం ఎయిర్ టెల్ బిజినెస్ తెలిపింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: 3GB డేటాతో జియో సూపర్ ఆఫర్, మరెన్నో ప్రయోజనాలివే...వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: 3GB డేటాతో జియో సూపర్ ఆఫర్, మరెన్నో ప్రయోజనాలివే...

ఎయిర్ టెల్ Work@Home

ఎయిర్ టెల్ Work@Home

ఉద్యోగులు మరింత సమర్థవంతంగా, సురక్షితంగా ఇంటి నుండి పని చేసేందుకు కనెక్టివిటీ, కొలాబరేషన్ టూల్స్, సెక్యూరిటీ కలిపి అందిస్తున్నట్లు తెలిపింది. ఆయా సంస్థలు తమకు కావాల్సిన సదుపాయాలను ఈ పథకానికి జత చేసుకోవచ్చునని తెలిపింది. సంస్థల అవసరాలను బట్టి తమ సేవలు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ఎయిర్ టెల్ Work@Home ప్లాన్ కింద కార్పోరేట్ బ్రాడ్‌బాండ్, 4G డేటా సిమ్, ఫ్రీ G-సూట్, కార్పోరేట్ Mi-Fi సేవలు అందిస్తుంది.

గూగుల్ మీట్, జూమ్ అందుబాటులో

గూగుల్ మీట్, జూమ్ అందుబాటులో

కనెక్టివిటీలో ఇబ్బందులు లేకుండా, సహకార సాధనాలు, భద్రతతో కూడిన ఈ ఆఫర్ సమగ్ర పరిష్కారంతో ఇంటి వద్ద వర్క్ చేస్తుంటే కార్యాలయ అనుభూతిని ఇస్తుందని చెబుతోంది. Airtel Work@Homeలో వినియోగదారులు 1Gbpsఅల్ట్రా ఫాస్ట్ కార్పోరేట్ బ్రాడ్ బ్యాండ్, కాంప్లిమెంటరీ జీ సూట్ ప్యాక్‌తో హైస్పీడ్ 4G కార్పోరేట్ Mi-Fi పరికరాలు, కాంప్లిమెంటరీ జీ సూట్ ప్యాక్ 4G డేటా సిమ్, కాంప్లిమెంటరీ జీ సూట్ అండ్ ఎంపీఎల్ఎస్‌తో కార్పోరేట్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ఉన్నాయి. గూగుల్ మీట్, సిస్కో వెబెక్స్, జూమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రతా సంబంధ వీపీఎన్ ఉంటుంది.

రూ.799 నుండి ప్రారంభం

రూ.799 నుండి ప్రారంభం

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ఇంటి నుండి వర్క్ చేస్తుండటంతో అందుకు అనుగుణంగా ఇది ఉంటుంది. ఎయిర్ టెల్ కార్పోరేట్ బ్రాడ్‌బాండ్ రూ.799 నుండి ప్రారంభమవుతుంది.ఉద్యోగులు ఇంటి నుండి ఈజీగా పని చేసేందుకు ప్రియారిటీ 4G డేటా సిమ్ (ఫ్రీ జీసూట్ కలిపి) రూ.399. దీనిని తీసుకుంటే అన్-లిమిటెడ్ వీడియో కాన్ఫరెన్స్, 30GB/యూజర్ సెక్యూర్ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది.

కార్పోరేట్ Mi-Fi (ప్రీ జీ సూట్) మరో ఆప్షన్. 50GB ప్రియారిటీ 4G డేటా (నెలకు), జీ సూట్ లైసెన్స్. ఈ ప్లాన్ కూడా రూ.399 నుండి ప్రారంభం. వన్ టైమ్ డివైస్ ఖరీదు రూ.2,000.

English summary

బిజినెస్ కోసం ఎయిర్‌టెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్, వివరాలు ఇవే | Airtel Rs 2,498 prepaid plan launched

Airtel and Reliance Jio recently launched several new recharge plans in the country with the aim to offer more data at a lower price to users given everyone is working from home. Adding on to the list of newly launched plans Bharti Airtel today announced a new prepaid plan worth Rs 2,498.
Story first published: Tuesday, May 19, 2020, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X