డిసెంబర్ 1 నుంచి FASTag: ఎయిర్‌టెల్ సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
భారతీ ఎయిర్ టెల్ తన కస్టమర్లకు ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా FASTag కొనుగోలుపై రూ.50 క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా FASTag కొనుగోలు చేస్తే అదనంగా రూ.50 క్యాష్ బ్యాక్ ప్రయోజనం ఉంది.

క్యాష్ బ్యాక్ ఆఫర్
ఇందుకు ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డిజిటల్, రిటైల్ టచ్ పాయింట్స్ వద్ద FASTagను అందుబాటులో ఉంచుతుంది. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.50 క్యాష్ బ్యాక్ ఉంటుంది.

సెలెక్ట్ బ్యాంకింగ్ పాయింట్స్ వద్ద కొనుగోలు...
ఎయిర్ టెల్ థ్యాంక్స్ కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.50 క్యాష్ బ్యాక్ అదనపు ప్రయోజనాన్ని పొందనున్నారని కంపెనీ తెలిపింది. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సెలక్ట్ బ్యాంకింగ్ పాయింట్స్ వద్ద కూడా FASTagను కొనుగోలు చేయవచ్చు.

2.5 శాతం క్యాష్ బ్యాక్
FASTagను కొనుగోలు చేసేందుకు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), రిజిస్ట్రేషన్ నెంబర్ డూప్లికేట్ కాపీలు ఇవ్వవలసి ఉంటుంది. FASTag యూజర్లు అన్ని టోల్ చెల్లింపులపై 2.5 శాతం క్యాష్ బ్యాంక్ కూడా పొందవచ్చునని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది. FASTag ద్వారా నిర్వహించే టోల్ ఛార్జీల పేమెంట్స్‌కు ఇది వర్తిస్తుంది.

వ్యాలెట్‌తో లింక్
FASTag ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేదా వ్యాలెట్‌తో లింక్ అయి ఉంటుందని, దీంతో టోల్ ఛార్జీలు వెంటనే అకౌంట్ నుంచి కట్ అవుతాయని, దీంతో FASTagను మళ్లీ ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.

డిజిటల్ ప్రోత్సాహం
డిజిటల్ పార్కింగ్ చెల్లింపులు, డిజిటల్ చలాన్ చెల్లింపులు వంటి సేవలు కూడా కస్టమర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, వీటిని అందిస్తామని, భారత్ నిర్మిస్తున్న శక్తిమంతమైన డిజిటల్ వ్యవస్థకు ఇది తోడ్పడుతుందని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ COO గణేష్ అనంత నారాయణన్ అన్నారు. క్యాష్ లెస్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు.