For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 స్టార్ రేటింగ్ ఫండ్స్‌లో ప్రతి నెల పెట్టుబడి పెట్టండి: అదిరిపోయే రిటర్న్స్

|

దేశంలో ఎక్కువమంది ఇన్వెస్ట్ చేస్తున్న వాటిలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(SIPs) ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా ప్రకారం 2500కు పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ వేలాది ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే అంశానికి సంబంధించి పెట్టుబడిదారుల్లో కన్ఫ్యూజన్ ఉండటం సహజం. ఇటీవలి కాలంలో సిప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన కొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచించవచ్చు.

ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ సిప్ కష్టమే

ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ సిప్ కష్టమే

స్టాక్ మార్కెట్ పైన వివిధ అంశాలు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలు వివిధ అంశాలపై ఆధారపడి ఉన్నందున ఈ ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ పైన పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్‌లో పూర్తిస్థాయిలో సరైన మ్యూచువల్ ఫండ్‌ను గుర్తించడం కష్టమే. ఈ రోజు టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ లాంగ్ టర్మ్‌లో అదే విధంగా ఉండకపోవచ్చు.

ఒక ఫండ్ ఏదైనా బ్యాంకింగ్స్ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే సంవత్సర కాలంగా మంచి వృద్ధి నమోదవుతుంది. అయితే ఇప్పటి నుండి ఆర్థిక వృద్ధి తగ్గవచ్చు. అప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ పడిపోయి, ఫండ్ పనితీరు పైన ప్రభావం పడుతుంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే ఉద్దేశ్యంతో ఓ ఐటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు బాగానే ఉండవచ్చు. కానీ ఆర్థిక కార్యకలాపాలు తగ్గితే ఐటీ స్టాక్స్ పడిపోయి, ఆ ఫండ్ పైన ప్రభావం పడుతుంది. ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ పోర్ట్‌పోలియోలోని టాప్ 10 స్టాక్స్ పైన ఆధారపడి ఉంటుంది. సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పలు ఫండ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్

క్రిసల్, మార్నింగ్ స్టార్, వ్యాల్యూ రీసెర్చ్ వంటి ఏజెన్సీలు యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చాయి. మరికొన్నేళ్ల పాటు ఇదే రేటింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిప్ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. సెన్సెక్స్ 53,000 పాయింట్ల సరికొత్త రికార్డ్ వద్ద ఉంది. ఇలాంటి సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సరికాదు. అయితే ఏడాది కాలంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ 40 శాతం రాబడిని ఇచ్చింది. మూడు, అయిదేళ్ల కాలంలో వరుసగా 14 శాతం, 16 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో రూ.500 పెట్టుబడి ద్వారా సిప్ ప్రారంభించవచ్చు. ప్రారంభ మరియు పెట్టుబడి మొత్తం రూ.1000. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ AMU 28,333 కోట్లుగా ఉంది.

ఎడెల్వెసిస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్

ఎడెల్వెసిస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్

క్రిసిల్.. ఎడెల్వెసిస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ AMU రూ.833కోట్లు మాత్రమే. 2007లో ఈ ఫండ్ ప్రారంభమైంది. సగటున ఏడాదికి 12 శాతం రిటర్న్స్ ఇచ్చింది. రూ.500 ద్వారా సిప్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. దీని ఆధారంగా మాత్రమే పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.

English summary

5 స్టార్ రేటింగ్ ఫండ్స్‌లో ప్రతి నెల పెట్టుబడి పెట్టండి: అదిరిపోయే రిటర్న్స్ | 5 Star Rated Funds to invest through SIPs

One of the most popular investments in the country at the moment are SIPs. According to data from the Association of Mutual Funds in India, there are more than 2500 mutual fund schemes, often leaving investors confused on which funds to invest when making a selection.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X