For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు అత్యధిక రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్

|

ప్రస్తుతం వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పైన తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మంచి రాబడిని ఇచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. ఎక్కువ డెట్ సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఆధారిత రిటర్న్స్ అందిస్తాయి. రిస్క్‌కు ఇష్టపడనివారు అలాగే, సీనియర్ సిటిజన్లు ఈ వైపు మొగ్గు చూపకపోవచ్చు.

చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ

చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ

ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఈ బ్యాంకులు పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల కంటే అధిక రాబడిని అందిస్తాయి. మీరు మూడు సంవత్సరాల పర్సనల్ ఫైనాన్స్ గోల్ కలిగి ఉంటే అదే సమయంలో సురక్షిత పెట్టుబడుల కోసం చూస్తే ప్రస్తుతం రూ.2 కోట్ల లోపు మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఉత్తమ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల 3 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల 3 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు రెగ్యులర్ సిటిజన్స్ కంటే సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువగా ఉంటుంది.

Ujjivan Small Finance Bank వడ్డీ రేటు 6.75%, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50%, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.35% శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.25%, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.25% ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువగా ఉంటుంది.

ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల్లో మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్

ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల్లో మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్

ఇండస్ఇండ్ బ్యాంకు 6.50%, ఆర్బీఎల్ బ్యాంకు 6.10 శాతం, యస్ బ్యాంకు 6.00 శాతం, కరూర్ వైశ్య బ్యాంకు 6.00 శాతం వడ్డీ రేటు ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.50%, కెనరా బ్యాంకు 5.40 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.40 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.15 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.10 శాతంగా ఉంది.

English summary

రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు అత్యధిక రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్ | 5 Best 3 Year Fixed Deposits For Both Regular & Senior Citizens

As a risk-averse investor, you may not be interested to invest in fixed deposits of banks due to the current low-interest rate regime.
Story first published: Sunday, July 11, 2021, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X