For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF కంటే బెట్టర్... 4 బెస్ట్ హై రేటెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్

|

బలమైన మూలధన లాభాలు, స్థిరమైన ఆదాయ ప్రవాహం కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమైనవి. కార్పోరేట్, ప్రభుత్వ బాండ్స్, కార్పోరేట్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటివి స్థిర ఆదాయ ఆస్తులలో పెట్టుబడి పెట్టేవే డెట్ మ్యూచువల్ ఫండ్స్. స్థిరమైన ఆదాయం, రిస్క్ లేని పెట్టుబడి కోసం చూసేవారికి ఇది అనుకూలంగా ఉండవచ్చు.

ఈక్విటీ ఫండ్స్ కంటే డెట్ ఫండ్స్ తక్కువ రిస్కును కలిగి ఉంటాయి. ఎందుకంటే వీటిపై మార్కెట్ ప్రభావం తక్కువగా ఉంటుంది. మీరు పీపీఎఫ్ వంటి సంప్రదాయక డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లో పెట్టుబడులు పెడుతుంటే కనుక, అలాగే తక్కువ రిస్క్, స్థిర రాబడి కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం కావొచ్చు.

ఎన్నేళ్లలో ఎంత రిటర్న్స్?

ఎన్నేళ్లలో ఎంత రిటర్న్స్?

పీపీఎఫ్ కంటే ఆకర్షితంగా ఉండే ఐదు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇక్కడ పరిశీలిద్దాం. ఇందులో HDFC క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఐసీఐసీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఎస్బీఐ మాగ్నం మీడియం డ్యురేషన్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఆల్ సీసన్స్ బాండ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఉన్నాయి.

- HDFC క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్‌లో ఏడాదిలో 10.85 శాతం రిటర్న్స్, 3 ఏల్లలో 9.60 శాతం, 5 ఏళ్లలో 9.01 శాతం రిటర్న్స్ వస్తాయి.

- ICICI ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్‌లో ఏడాదిలో 9.35 శాతం, మూడేళ్లలో 9.51 శాతం, అయిదేళ్లలో 9.22 శాతం రిటర్న్స్ వస్తాయి

- SBI మాగ్నం మీడియా డ్యురేషన్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్‌లో ఏడాదిలో 7.12 శాతం, మూడేళ్లలో 10.17 శాతం, అయిదేళ్లలో 9.81 శాతం రిటర్న్స్ వస్తాయి

- ICICI ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్‌లో ఏడాదిలో 7.10 శాతం, మూడేళ్లలో 10.10 శాతం, అయిదేళ్లలో 9.66 శాతం రిటర్న్ వస్తాయి.

ప్రారంభమైనప్పటి నుండి 9.48 శాతం రిటర్న్స్

ప్రారంభమైనప్పటి నుండి 9.48 శాతం రిటర్న్స్

HDFC క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్ స్కీంను HDFC మ్యూచువల్ ఫండ్ జారీ చేస్తుంది. ఫండ్స్ ఎక్స్‌పెన్సేస్ రేషియా 1.05 శాతంగా ఉంది. ఇతర క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌తో పోలిస్తే అత్యధిక ఎక్స్‌పెన్స్ రేషియో.

ICICI ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్‌‌‌తో అత్యధిక రిటర్న్స్ 9.35 శాతం. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున సంవత్సరానికి 9.48 శాతం రాబడిని ఇచ్చింది.

సగటు రిటర్న్స్

సగటు రిటర్న్స్

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీడియం డ్యురేషన్ ఫండ్ ఎస్బీఐ మాగ్నం మీడియం డ్యురేషన్ ఫండ్ డైరెక్ట్ జారీ అవుతోంది. వన్ ఇయర్ గ్రోత్ రేట్ 7.12 శాతంగా ఉంది. వ్యాల్యూ రీసెర్చ్ ప్రకారం ఇది ప్రారంభమైనప్పటి నుండి ఏడాదికి సగటున 9.99 శాతం రిటర్న్స్ అందిస్తోంది.

ICICI ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్‌‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించింది.

English summary

PPF కంటే బెట్టర్... 4 బెస్ట్ హై రేటెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ | 4 Best High Rated Debt Mutual Funds Better Than PPF

When it comes to receiving strong capital gains and a steady stream of income, debt mutual funds are the best to bet.
Story first published: Sunday, July 4, 2021, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X