For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ 4 బ్యాంకుల్లో మంచి రాబడి... ఇవి చూడండి

|

ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి సురక్షిత పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. రిస్క్-లేని సాధనాలు మెచ్యూరిటీ వరకు మీకు స్థిరమైన రాబడిని అందిస్తాయి. సాధారణంగా సెక్యూర్డ్ పెట్టుబడుల కోసం రెగ్యులర్, సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ సాధనాలు మార్కెట్ ఆధారిత రాబడితో అనసంధానించబడనందున ఇవి సురక్షితమైనవిగా చెప్పవచ్చు.

ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అస్యూర్డ్ రిటర్న్స్‌తో పాటు ఏడు రోజుల నుండి పదేళ్ల టెన్యూర్‌తో సౌకర్యవంత కాలపరిమితిని ఇస్తాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడిగా దీనిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏడాది కాలపరిమితితో నాలుగు సెక్యూర్డ్ బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇక్కడ తెలుసుకోండి...

ఏడాది కాలపరిమితిపై..

ఏడాది కాలపరిమితిపై..

ప్రస్తుతం కమర్షియల్, ప్రయివేటు బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. 1 ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ పైన పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. 5 ఎక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు 6.75 శాతం కంటే ఎక్కువగా అందిస్తున్నాయి.

అలాగే డీఐసీజీసీచే రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు రెగ్యులర్ సిటిజన్ల కంటే 0.50 శాతం ఎక్కువగా ఉన్నాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.75%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50%, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50%, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50%, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.35% వడ్డీ రేటును అందిస్తోంది.

ప్రయివేటు రంగ బ్యాంకులు..

ప్రయివేటు రంగ బ్యాంకులు..

ఏడాది కాలపరిమితిపై ప్రయివేటు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. రెగ్యులర్ సిటిజన్ల కంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు అర శాతం ఎక్కువగా ఉంటుంది. RBL బ్యాంకు 6.10%, యస్ బ్యాంకు 6.00%, ఇండస్ఇండ్ బ్యాంకు 6.00%, DCB బ్యాంకు 5.70%, కరూర్ వైశ్య బ్యాంకు 5.25% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

కమర్షియల్ బ్యాంకులు

కమర్షియల్ బ్యాంకులు

ఏడాది కాలపరిమితిపై కమర్షియల్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. యూనియన్ బ్యాంకు 5.25%, కెనరా బ్యాంకు 5.20%, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 5.15%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.40%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.35% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

English summary

ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ 4 బ్యాంకుల్లో మంచి రాబడి... ఇవి చూడండి | 4 Best 1 Year Fixed Deposits To Invest

Making secure investments for personal financial goals is always preferred as the risk-free instruments of your choice tend to give your fixed returns till the maturity period.
Story first published: Thursday, July 8, 2021, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X