For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు కొత్తగా పెళ్లయిందా.. ఈ 11 సూచనలు మీ జంటకే!

|

కొత్తగా పెళ్లయితే ఆర్థిక విషయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశపై చాలామందికి డైలమా ఉంటుంది. అప్పటి వరకు పెద్దవాళ్ళ మధ్య పెరిగి, వారే ఆర్థిక వ్యవహారాలు చూసుకొని ఉండటంతో కొత్తగా పెళ్లైన వారికి సరైన ఆర్థిక ప్రణాళిక ఉండే అవకాశాలు తక్కువ. పైగా ఇటీవలి కాలంలో ఎక్కువ జంటలు నగరాలకు వచ్చి వేరుగా ఇద్దరే ఉంటున్నారు. వేతనంగా వచ్చిన మొత్తాన్ని చాలామంది రేపటి కోసం ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఆర్థిక ప్రణాళిక ఎంతో ముఖ్యం.

రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్

వీటిని పాటించడం ముఖ్యం..

వీటిని పాటించడం ముఖ్యం..

కొత్తగా పెళ్లైన వారికే కాదు, ఎవరికైనా ఆర్థిక ప్రణాళిక అవసరం. కానీ అప్పుడే పెళ్లైన వారికి వీటి పట్ల పెద్దగా అవగాహన ఉండకపోవడం లేకపోతే పట్టించుకోకపోవడం వంటివి ఉంటాయి. ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేస్తునే భవిష్యత్తు గురించి ఆలోచించేవారికి ఢోకా ఉండదు. ఇందుకు కొన్ని లక్ష్యాలు ఉండాలి, నిర్వహణ సరిగా ఉండాలి, ఏది అవసరమో దానికి ఖర్చు చేయడంలో తప్పులేదు కానీ అనవసరం అనుకున్న దానిని పక్కన పెట్టడం మంచిది, పెళ్లి తర్వాత ట్యాక్సులు తగ్గించుకొని, పదవీ విరమణ సమయంలో వచ్చే మొత్తం ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

లక్ష్యం పెట్టుకోవాలి

లక్ష్యం పెట్టుకోవాలి

కొత్తగా పెళ్లైన జంట తాత్కాలికి ఎంజాయ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ఓ లక్ష్యం పెట్టుకోవాలి. ఇల్లు కొనడం, ఫ్లాట్ తీసుకోవడం, రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మొత్తంలో పక్కన పెట్టేలా ప్లాన్ చేసుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాలి. ఆర్థిక క్రమశిక్షణతో పాటు పొదుపు చేయడం అవసరం. మీ ఆదాయంలో అన్ని ఖర్చులు పోను 15 శాతం నుంచి 20 శాతం వరకు పొదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయండి. మీ వేతనం అకౌంట్లో పడగానే ఆటోమేటిక్‌గా ఫ్యూచర్ ప్రణాళికల కోసం కట్ అయ్యే విధంగా చూసుకోవాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు కూడా సాధించుకునేలా ప్లాన్ చేసుకోండి.

ఆర్థిక ప్రణాళిక

ఆర్థిక ప్రణాళిక

ఆర్థిక ప్రణాళిక ఎంతో ముఖ్యం. అంతేకాదు, భాగస్వాముల మధ్య ఆర్థిక పరమైన రహస్యాలు ఉండకూడదు. మీకు ఎంత వస్తుంది, ప్రతి నెల ఎంత ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలనే అంశాలు ఇద్దరికీ తెలిసి ఉండాలి. మీకు ఏమైనా అప్పులు ఉంటే వాటిని సాధ్యమైనంత త్వరగా తీర్చే ప్రయత్నాలు చేయాలి. మీకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే వాటిని లెక్కించి బడ్జెట్ తయారు చేసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వేర్వేరుగా సంపాదన ఉన్నా, ఒకే సంపాదన ఉన్నా.. మీరు చేసే ఖర్చులు అన్నీ ఇద్దరికీ తెలిసి ఉండాలి.

ఆచితూచి కొనుగోలు

ఆచితూచి కొనుగోలు

కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా ఒకేసారి కారు, ఖరీదైన ఎలక్ట్రానిక్ వంటి పరికరాలు కొనుగోలు చేస్తుంటారు. తాహతకు మించి లోన్ పెట్టి వీటిని తీసుకుంటారు. కానీ మరీ ఆర్థికంగా బరువు అయ్యేలా కొనుగోలు చేయడం సరికాదు. ఆదాయం, ఖర్చుల ఆధారంగా వీటిని తీసుకోవడం మంచిది.

ఎమర్జెన్సీ ఫండ్

ఎమర్జెన్సీ ఫండ్

ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఆరు నెలలు ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకోవడం మంచిది. అలా అయితే ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా దీనిని ఉపయోగించుకోవచ్చు.

పదవీ విరమణ

పదవీ విరమణ

రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ డబ్బు చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలా అయితే విరమణ తర్వాత మీ జంట హాయిగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం ప్రతి నెల మీ ఆదాయంలో 15 శాతం నుంచి 20 శాతం వరకు పదవీ విరమణ కోసం కేటాయించాలి.

పెట్టుబడులు...

పెట్టుబడులు...

పీపీఎఫ్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇలాంటి వాటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.

ఇన్సురెన్స్

ఇన్సురెన్స్

మంచి ఇన్సురెన్స్ స్కీంలో చేరాలి. మీ ఆదాయానికి అనుగుణంగా అది ఉండాలి. మీకు అనుకూలంగా ఉంటే టర్మ్ ప్లాన్ ఎంచుకోండి.

హెల్త్ ఇన్సురెన్స్

హెల్త్ ఇన్సురెన్స్

హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు చేయడం కూడా మరిచిపోవద్దు. మీ వైద్య అవసరాలకు అనుగుణంగా మీకు సరిపోయే వైద్య బీమాను ఎంచుకోండి. మీ కంపెనీ అందించే బీమాకు భిన్నంగా ఉండేలా చూసుకోండి. అన్నింటిని కవర్ చేసేలా ఉండాలి.

రుణాలు తీసుకుంటే..

రుణాలు తీసుకుంటే..

వివిధ సందర్భాల్లో రుణాలు తీసుకోవడం సహజం. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకోవడం కంటే ముందస్తుగా ప్లాన్ చేసుకొని పొదుపు చేసి ఆ అవసరం తీర్చుకోవడం ఉత్తమ మార్గం. కచ్చితమైన పరిస్థితుల్లో రుణాలు తీసుకోవాలనుకుంటే వడ్డీ రేటు సహా అన్నింటిని చెక్ చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డు వంటివి ఉపయోగిస్తే నిర్ణీత తేదీలోపు చెల్లింపులు జరపాలి.

ఇల్లు కొనుగోలు

ఇల్లు కొనుగోలు

మీరు కిరాయి ఇంట్లో ఉంటే కనుక.. మీకు సాధ్యమైతే ఇంటిని కొనుగోలు చేయడం మంచిది. ముందు నుంచే ఇల్లు కొనాలనే లక్ష్యంతో ఆర్థిక ప్రణాళిక ఉండాలి. మీరు గృహ రుణం తీసుకుంటే నెలవారీ వాయిదా మీ ఆదాయంలో 35 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది. భార్యా, భర్త.. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే కనుక జాయింట్ వెంచర్ పేరిట తీసుకోవడం మంచిది. తద్వారా పన్ను నుంచి మినహాయింపులు పొందాలి.

English summary

మీకు కొత్తగా పెళ్లయిందా.. ఈ 11 సూచనలు మీ జంటకే! | Tips to married couple for good financial life

Getting married means entering to new life. Everything will be new including financial life. Married couple sometime get confused when they come across financial jargons. In order to help them we are herewith 9 Tips for married couple for good financial life.
Story first published: Monday, October 28, 2019, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X