For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాగ్రత్త!:v పీఎఫ్ ఖాతా ఉందా, ఈపీఎఫ్ఓ నుంచి మీకు హెచ్చరిక

|

న్యూఢిల్లీ: దాదాపు ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల సౌలభ్యం కోసం పీఎఫ్ ఉపసంహరణ, నామినేషన్, ట్రాన్సుఫర్, పాస్‌బుక్ మెయింటెనెన్స్ సహా ఎన్నో వెసులుబాట్లు కల్పించింది. ఓ ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఉపసంహరించుకోవచ్చు. ఏమైనా ఈపీఎఫ్ఓకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ప్రత్యేక పరిస్థితుల్లో పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ తాజాగా కొన్ని చీటింగ్ అంశాల్లో ఉద్యోగులను హెచ్చరిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ మూసివేయట్లేదు, VRS ప్యాకేజీ ఎంత అంటే?బీఎస్ఎన్ఎల్ మూసివేయట్లేదు, VRS ప్యాకేజీ ఎంత అంటే?

వారి బారిన పడవద్దు

వారి బారిన పడవద్దు

మోసగాళ్లు, డబుల్ డీలర్స్ బారిన పడవద్దని ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. వీళ్లు ఆకర్షణీయ బెనిఫిట్స్‌తో మిమ్మల్ని ఆకర్షిస్తారని చెబుతోంది. తాము ప్రయివేట్ లేదా థర్డ్ పార్టీ సంస్థలను నియమించుకోలేదని స్పష్టం చేసింది. పీఎఫ్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను తామే చూసుకుంటున్నట్లు తెలిపింది. పీఎఫ్ తరఫున నిర్వహణ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదని తెలిపింది.

తప్పుడు వ్యక్తుల కాల్స్, సందేశాలు..

తప్పుడు వ్యక్తుల కాల్స్, సందేశాలు..

ఉద్యోగులు ఎవరూ కూడా ఫోన్ కాల్ లేదా మెసేజ్‌లు లేదా ఈ మెయిల్స్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేసే ట్రాప్‌లో పడవద్దని ఈపీఎఫ్ఓ సూచించింది. ఇలాంటి సందేశాలతో మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. EPFO ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంకు అకౌంట్ వంటి వివరాలను ఎప్పటికీ కోరదని తెలిపింది.

జాగ్రత్తగా ఉండాలి

జాగ్రత్తగా ఉండాలి

అలాగే, డబ్బులు డిపాజిట్ చేయాలని పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఫోన్లు వస్తే అది తప్పుడు ఫోన్ అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఉద్యోగులకు సూచించింది. వాటిని ఏమాత్రం నమ్మవద్దని తెలిపింది.

స్టేటస్ తెలుసుకోవచ్చు

స్టేటస్ తెలుసుకోవచ్చు

ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ పోర్టల్, www.epfindia.gov.in. ద్వారా క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చునని తెలిపింది. అయిదేళ్ల సర్వీస్‌కు ముందుగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటే పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పిల్లల వివాహం, విద్య, అనారోగ్యం, రుణాల చెల్లింపు, ఇల్లు కొనుగోలు, భూమి కొనుగోలు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకోవచ్చునని పేర్కొంది.

English summary

జాగ్రత్త!:v పీఎఫ్ ఖాతా ఉందా, ఈపీఎఫ్ఓ నుంచి మీకు హెచ్చరిక | EPFO alert: Provident Fund body warns against fake calls, messages

The Employees’ Provident Fund Organisation (EPFO), the principal managers of provident fund accounts, has enabled multiple facilities including provident fund withdrawal, nomination, transfer, passbook maintenance, for the ease of employees.
Story first published: Thursday, October 24, 2019, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X