For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New MV Act: ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా ఇలా చేయండి!!

|

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. త్వరలో మరొక షాక్ కూడా తగలనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియం అధికం కానుంది. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు మీ బీమాను ప్రభావితం చేస్తుంది.

<strong>హోమ్ లోన్ తీసుకుంటారా.. అయితే శుభవార్త, 400 జిల్లాల్లో లోన్</strong> హోమ్ లోన్ తీసుకుంటారా.. అయితే శుభవార్త, 400 జిల్లాల్లో లోన్

ఇష్టారీతిగా ఉండే ఎక్కువ ప్రీమియం

ఇష్టారీతిగా ఉండే ఎక్కువ ప్రీమియం

HDFC ఎర్గో జనరల్ ఇన్సురెన్స్‌కు చెందిన అనురాగ్ రస్తోగి ఆధ్వర్యంలోని 9 మంది సభ్యుల కమిటీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు - బీమా మొత్తానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ నేపథ్యంలో మంచిగా వాహనాలు నడిపే గూడ్స్ డ్రైవర్లకు తక్కువ ప్రీమియం, ఇష్టారీతిగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు ఎక్కువ ప్రీమియం ఉండటం సరైనదేనని పాలసీ బజార్ డాట్ కామ్ హెడ్ (మోటార్ ఇన్సురెన్స్) సజ్జా ప్రవీణ్ అన్నారు.

బీమా ఎక్కువ కట్టాల్సి రావొచ్చు

బీమా ఎక్కువ కట్టాల్సి రావొచ్చు

ప్రస్తుతం మోటార్ బీమా ప్రీమియంను ప్రధానంగా బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. ఓ వాహనం బీమా చేయించాలంటే తయారీ సంస్థ, మోడల్, వేరియంట్స్ పైన ఆధారపడి ఉన్నాయి. కమిటీ సూచనల అనంతరం... ఎన్నిసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంత ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుందని రిలయన్స్ జనరల్ ఇన్ష్యూరెన్స్ ఈడీ మరియు సీఈఓ రాకేష్ చెప్పారు.

అమెరికాలో ఎలా ఉంటుందంటే...

అమెరికాలో ఎలా ఉంటుందంటే...

ఈ మేరకు కమిటీ అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ప్రీమియం నిబంధనలను అధ్యయనం చేస్తోంది. భారత దేశానికి అనువుగా ఉండే దానిని పరిశీలిస్తోంది. అమెరికా వంటి దేశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే దాని తీవ్రత మేరకు ఇన్సురెన్స్ ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు సీటుబెల్టు ధరించకపోతే దానిపై ప్రీమియం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బెల్టు ధరించనంత మాత్రానా కారుకు పెద్దగా నష్టం లేదని చెబుతున్నారు. దీనికి కేవలం అరవై డాలర్లు మాత్రమే ప్రీమియంపై విధిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే ప్రీమియం రెట్టింపు అయ్యే అవకాశముంటుంది. పదే పదే మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడినట్లయితే ప్రీమియం ధర కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుందట.

బీమా కొనుగోలు...

బీమా కొనుగోలు...

ప్రస్తుతం మోటార్ బీమా కొనుగోలు ఆన్ లైన్ ద్వారా పది శాతం మాత్రమే జరుగుతున్నాయి. రాబోవు రెండు మూడేళ్లలో ఇది 30 నుంచి 40 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఓనర్‌షిప్ మార్పు

ఓనర్‌షిప్ మార్పు

తమ వాహనాలు విక్రయించాలనుకునే ఓ విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. కారు లేదా ద్విచక్ర వాహనం సేల్ చేసిన తర్వాత కేవలం డబ్బు ట్రాన్సాక్షన్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. ఇప్పటి వరకు ఇలా చేసి ఉంటే ఆలోచించాల్సిందే. మీ వాహనం ఓనర్‌షిప్‍‌ను దానిని కొనుగోలు చేసిన వారి పేరు పైకి మార్చాలి. ఎందుకంటే మీ వాహనం కొనుగోలు చేసిన వారు ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తే చలాన్ మీరు అందుకునేలా ఉండకూడదు. వాహనం మీది అయి తాళాలు మరొకరి చేతికి ఇచ్చినా మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది.

చలాన్‌లో తేడా ఉంటే...

చలాన్‌లో తేడా ఉంటే...

మీ ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్‌లో ఏదైనా తేడా ఉంటే మీరు మీ రాష్ట్ర లేదా ప్రాంతీయ ట్రాఫిక్ అథారిటీ ద్వారా పరిష్కారం కోరవచ్చు. మన ట్రాఫిక్ ఉల్లంఘనల ప్రభావం బీమా పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి పరిష్కరించుకోవాలి. అయితే ఇలాంటివి ఎక్కువగా ఉండవు.

డ్రైవింగ్ బాగుంటే...

డ్రైవింగ్ బాగుంటే...

ప్రస్తుతం వాహన తయారీ కంపెనీ, కొనుగోలు తేదీ, వాహనం రంగు, సర్వీస్ కాస్ట్ వంటివి మాత్రమే బీమా ప్రీమియానికి ప్రాతిపదికలు. త్వరలో మీ డ్రైవింగ్ ఆధారంగా కూడా ప్రీమియం ఉంటుంది. గుడ్ డ్రైవింగ్ బుక్‌లో ఉంటే అది ప్రయోజనకరం.

Read more about: traffic
English summary

New MV Act: ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా ఇలా చేయండి!! | Stick to traffic rules and avoid increases in motor premium

A country that faces nine crashes every 10 minutes has decided to act tough on drivers who cause accidents.
Story first published: Friday, September 20, 2019, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X