For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: ఇక ఆరోగ్య బీమా ప్రీమియం నెలవారీగా చెల్లించవచ్చు!

|

ఆరోగ్య బీమా తీసుకునే వారికి శుభవార్త. త్వరలోనే మీరు మీ ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలు, వార్షికంగా చెల్లించే సదుపాయాన్ని బీమా కంపెనీలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంభందించి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సాధారణ, స్టాండ్ అలోన్ బీమా కంపెనీలకు సూచనలు చేసింది. ఈ కంపెనీలు దాఖలు చేసే పాలసీల్లో ఈ మేరకు స్వల్ప మార్పులు చేయాలని ఒక సర్క్యూలర్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. బీమా కంపెనీలు ఈ సదుపాయం కోసం ప్రీమియం స్వరూపంలో గానీ, చార్జీల్లో గానీ ఎలాంటి మార్పులు చేయరాదని కూడా పేర్కొన్నట్టు సమాచారం.

* ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం మరికొన్ని తీవ్రమైన అనారోగ్యాలు కూడా బీమా కవరేజీ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు బీమా పరిశ్రమ
* అంతే ప్రస్తుతమున్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు బీమా కంపెనీలు ఐ ఆర్ డీ ఏ ఐ అనుమతి పొందాల్సి ఉంటుంది.

Soon, pay health insurance premiums in instalments

బీమా వ్యాప్తికి అవకాశం

* సర్టిఫికేషన్ ప్రాతిపదికన 'సాధారణ, స్టాండ్ అలోన్ బీమాకంపెనీలు తెచ్చే వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో మార్పులు చేయడం వల్ల బీమా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* ఇదిలా ఉంటే ఆరోగ్య బీమా కంపెనీలు తమ ఇండివిడ్యువల్ ఉత్పత్తులకు సంబంధించి బేస్ ప్రీమియం రేట్లలో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.

* బీమా కంపెనీలు కొన్ని రకాల మార్పులు చేసేందుకు అవకాశం కల్పించినా ప్రయోజనం పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండరాదని ప్రతిపాదించారు.

* బీమా కంపెనీల పూర్వపు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీమా ఉత్పత్తుల్లో మార్పులు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం లభించాలన్నదే ప్రధాన ఉద్దేశం.

పాలసీ దారులకు లబ్ది..

* సాధారణంగా జీవిత బీమా పాలసీల ప్రీమియంను నెలవారీ, మూడునెలలు, ఆరు నెలలు, ఏడాది లేదా ఏక మొత్తంగా చెల్లిస్తుంటాము. విడతల వారీగా చెల్లించడం వల్ల పాలసీ దారుపై ఆర్ధిక ప్రభావం అంతగా ఉండదు.

* అయితే ఆరోగ్య బీమా ప్రీమియంను మాత్రం ఒక్కసారే చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల బీమా కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే చాలామంది ఈ బీమా విషయంలో వెనుకడుగు వేస్తుంటారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ విడతల వారీగ్గా బీమా ప్రీమియంను చెల్లించే సదుపాయం కల్పిస్తే ఎక్కువ మంది ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు.

English summary

గుడ్‌న్యూస్: ఇక ఆరోగ్య బీమా ప్రీమియం నెలవారీగా చెల్లించవచ్చు! | Soon, pay health insurance premiums in instalments

Policyholders will now be given the option to pay health insurance premiums in various frequencies or instalments such as monthly, quarterly or half yearly.
Story first published: Tuesday, September 24, 2019, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X