For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి పతనం: కారు నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మీ ఖర్చుపై ప్రభావమెలా

|

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవుతోంది. మంగళవారం 28 పైసలు పడిపోయి 71.88 పైసలకు పడిపోయింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ దాడి తర్వాత ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అలాగే యూఎస్ డాలర్ వంటి సేఫ్ హెవెన్ అసెట్స్ వైపు చూస్తున్నారని ఫారెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు.

SBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులుSBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులు

భారత్‍‌లో వినియోగదారుడిపై ప్రభావం

భారత్‍‌లో వినియోగదారుడిపై ప్రభావం

'సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై దాడులు చమురు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. సాధ్యమైనంత త్వరలో ఉత్పత్తి తిరిగి ప్రారంభం కాకుంటే ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక పడుతుంది. అలాగే వినియోగదారుడిపై కూడా భారం పడుతుంది. ఈ ప్రభావం ఆటోమేటిక్‌గా భారత్ పైన కూడా ఉంటుంది. ఇప్పటికే భారత్ మందగమనంలో ఉంది. ఈ ప్రభావం కూడా తోడయ్యే అవకాశం ఉంది' అని డ్రిప్ కాపిటల్ కో-సీఈవో మరియు కో-ఫౌండర్ పుష్కర్ ముఖేవార్ అన్నారు.

ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత ప్రభావం మనపై ఎలా పడుతుందో తెలుసుకుందాం....

విదేశీ విద్య

విదేశీ విద్య

చాలామంది విద్యార్థులు తమ ఫారన్ స్టడీస్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే హఠాత్తుగా కరెన్సీ విలువ తగ్గితే విద్యార్థులపై ప్రభావం పడుతుంది. విద్యార్థుల బడ్జెట్, స్పాన్సర్‌పై భారం పడుతుంది. డాలర్ మారకంతో రూపాయి పడిపోవడం అంటే... ప్రతి డాలర్‌కు విద్యార్థులు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.

ఉదాహరణకు 2017లో ఒకరు సగటున ఓ డాలర్‌కు రూ.65 ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.71.5 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు పది శాతం పెరుగుదల ఉంది. విదేశీ విద్యకు రూపాయి మార్పులు ఎంతో కీలకం. మీ ట్యూషన్ ఫీజు నుంచి మీ బోర్డింగ్, ఫుడ్, ట్రావెల్ ఖర్చుల వరకు ప్రతి ఖర్చు పెరుగుతుంది. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా అదే బడ్జెట్‌లో మీ ఖర్చు ఉండదు. రూపాయి విలువ తగ్గుతుంటే ఖర్చు కూడా పెరుగుతుంది.

విదేశీ ప్రయాణం

విదేశీ ప్రయాణం

మీరు అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే హాలీడే ప్లాన్ చేసి ఉన్నారా? అయితే రూపాయి బలహీనత అక్కడి మీ రెస్టారెంట్లు, హోటల్స్, రైలు లేదా బస్సు లేదా క్యాబ్ రైడ్‌లు, షాపింగ్స్‌పై ప్రభావం చూపుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో అక్కడ మీరు చెల్లించాల్సిన సొమ్ము అధికం అవుతుంది. మీరు గత బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్లాన్ చేసి డబ్బు దగ్గర పెట్టుకుంటే వాటిని జమ చేయడం లేదా ఇప్పటికే ఫారన్ టూర్లో ఉంటే షాపింగ్ అమౌంట్ నుంచి సర్దుబాటు చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. కరెన్సీ ఇలాగే పడిపోతుంటే వసతిని మార్చుకునే పరిస్థితి ఉండవచ్చు. ఇప్పటికీ టూర్ ప్లాన్ చేసుకోని వారు ఎవరైనా కేవలం విదేశీ ఆహ్లాదం కోసం వెళ్లాలనుకుంటే రూపాయి కంటే కరెన్సీ తక్కువ ఉన్న దానిని లేదా డాలర్ కంటే మంచి ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం.

ద్రవ్యోల్భణం

ద్రవ్యోల్భణం

ముడి చమురు ధరలు పెరుగుదల, రూపాయి బలహీనపడటం నేరుగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. తయారీ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రోజు వారీ వినియోగ వస్తువులపై నేరుగా ప్రభావం చూపుతుంది. అయితే ద్రవ్యోల్భణం అదుపులో ఉందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ద్రవ్యోల్భణం పెరగకపోవచ్చు.

చమురు ధరలు

చమురు ధరలు

రూపాయి బలహీనపడితే చమురు ధరలు పెరుగుతాయి. భారత్‌లో 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి ఇలాగే పడిపోతుంటే ఇంధన ధరలు పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగితే కూరగాయలు వంటి రోజువారీ వస్తువులపై కూడా కొంత ప్రభావం పడుతుంది.

చికిత్స ఖర్చు

చికిత్స ఖర్చు

చాలా వైద్య పరికరాలను మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి సంబంధిత చికిత్స ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు విదేశాల్లో పొందాలనుకుంటే మీ బడ్జెట్‌ను కూడా పెంచుకోవడం మంచిది. చాలా మెడిసిన్స్ దిగుమతి చేసుకుంటున్నందున వీటి ధరలు కూడా పెరగవచ్చు.

కార్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు...

కార్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు...

చాలా ఆటోమొబైల్ వస్తువులను దిగుమతి చేసుకుంటాం. దీంతో వీటి ధరలు కూడా కాస్త పెరిగే అవకాశముంది. కారు (ఇంపోర్టెడ్ సంబంధిత) వంటి ఖరీదైన వస్తువులు కొనాలనుకుంటే మీరు గతంలో ప్లాన్ చేసుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించవలసి ఉంటుంది. ల్యాప్‌టాప్స్, పీసీ కాంపోనెంట్స్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. వీటి ధరలు పెరగనున్నాయి. టీవీలు... ముఖ్యంగా ఎల్ఈడీ వంటి టీవీల ధరలు ఖరీదు అవుతాయి. ఎందుకంటే మనం టీవీ ప్యానల్స్‌నూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం.

English summary

రూపాయి పతనం: కారు నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మీ ఖర్చుపై ప్రభావమెలా | Rupee falls due to rise in crude prices. Here's how the rupee's decline will impact you

The Indian rupee witnessed a 28-paisa fall to 71.88 against the US dollar in early trade on Tuesday amid rising demand for the US dollar vis-a-vis other currencies overseas.
Story first published: Tuesday, September 17, 2019, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X