For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1 లక్ష షాపింగ్ చేయండి, పండుగ తర్వాత చెల్లించండి: బంపరాఫర్లు ఇవే...

|

దసరా, దీపావళి సీజన్ వ్యాపారులకు అసలైన పండుగ. దీనిని ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివి బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతుంటాయి. ఈసారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సెల్‌తో ముందుకు వస్తోంది. 29 సెప్టెంబర్ నుంచి సేల్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు ఓ బంపరాఫర్ కూడా ఇచ్చింది. మీ వద్ద రూపాయి లేకుండానే రూ.1 లక్ష వరకు షాపింగ్ చేయవచ్చు... అదేమిటో, ఎలాగో తెలుసుకోండి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు, కానీ తాత్కాలికంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు, కానీ తాత్కాలికం

క్రెడిట్ కార్డ్ లేకున్నా డబ్బులు తర్వాత చెల్లించవచ్చు

క్రెడిట్ కార్డ్ లేకున్నా డబ్బులు తర్వాత చెల్లించవచ్చు

చేతిలో క్రెడిట్ కార్డ్ ఉంటే డబ్బులు లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం ఇష్టం లేనివారు లేదా కార్డ్స్ లేని వారి పరిస్థితి ఏమిటి? అందుకే ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. క్రెడిట్ కార్డ్ లేకపోయినా మీరు రూ.1 లక్ష వరకు కొనుగోలు చేయవచ్చు. పండుగ తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉంది.

ముందు కొనండి.. ఆ తర్వాత చెల్లించండి..

ముందు కొనండి.. ఆ తర్వాత చెల్లించండి..

పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా కొనుగోలుదారులు కార్డ్‌లెస్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ వెసులుబాటు కోసం ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్ సైట్‌లో పేర్కొంది. ముందు కొనండి.. ఆ తర్వాత చెల్లించండి అనే పేరుతో ఈ ఆపర్ తీసుకు వచ్చింది. ఎలాంటి డౌన్ పేమెంట్ లేకపోవడం గమనార్హం.

పేమెంట్ కోసం మూడు ఆప్షన్స్...

పేమెంట్ కోసం మూడు ఆప్షన్స్...

ఫ్లిప్‌కార్ట్ మూడు పేమెంట్స్ ఆప్షన్స్ ఇచ్చింది.

- మొదటిది జీరో వడ్డీ రేటుతో మరుసటి నెలలో మొత్తం చెల్లించడం.

- రెండోది జీరో వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా చెల్లింపు

- మూడోది 12 నెలల పాటు ఈఎంఐలో చెల్లించడం.

ప్రాసెసింగ్ ఫీజు లేదు...

ప్రాసెసింగ్ ఫీజు లేదు...

- వీటికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు.

- కేవైసీ ప్రాసెస్ మాత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది.

- పండుగ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగించకుండా పర్సనల్ లోన్ తీసుకోకుండా ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

దరఖాస్తు, చెల్లింపులు ఇలా...

దరఖాస్తు, చెల్లింపులు ఇలా...

- పాన్ నెంబర్‌తో పాటు అడిగిన ఇతర వివరాలను ఇవ్వాలి. ఎంత వరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారనే వివరాలు కూడా ఇవ్వాలి.

- ఆన్ లైన్‌లో రెండు నిమిషాల్లో పూర్తయ్యే KYC వివరాలు అందించాలి.

- కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు.

- My Accounts > Cardless Credit విభాగంలో మీ క్రెడిట్ లిమిట్ చెక్ చేసుకోవచ్చు.

- ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా వచ్చే నెల 15వ తేదీ లోగా చెల్లించాలి.

ఏ రోజు ఏ సేల్స్?

ఏ రోజు ఏ సేల్స్?

సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఫ్యాషన్స్, టీవీలు, అప్లియెన్సెస్, హోమ్, ఫర్నీచర్, బ్యూటీ, టాయ్స్, స్మార్ట్ డివైస్ వంటి సేల్స్ ఉంటాయి.

30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మొబైల్స్, ట్యాబ్స్, గాడ్జెట్స్, యాక్సెసరీస్ సేల్స్ ఉంటాయి.

క్రేజీ డీల్స్

క్రేజీ డీల్స్

క్రేజీ డీల్స్ కూడా ఉన్నాయి. మొబైల్స్, టీవీలు, లాప్ టాప్స్‌తో పాటు వివిధ వస్తువులపై క్రేజీ డీల్స్ ఉంటాయి. 12AM, 8AM, 4PM సమయాలకు ఈ క్రేజీ డీల్స్ ఉంటాయి.

ఫ్లాష్ సేల్

ఫ్లాష్ సేల్

రెడ్ మీ నోట్ 5 మామూలు ధర రూ.10,999. ప్లాష్ సేల్‌లో భాగంగా దీనిని రూ.7,499కి ఇస్తున్నారు. 30 సెప్టెంబర్ మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. ఫ్లాష్ సేల్ ప్రతి గంటకు ఒకటి ఉంటుంది. రూ.10 వేల విలువ కలిగిన జేబీఎల్ ఫ్రీఎక్స్ రూ.4వేలకే రానుంది. 30 సెప్టెంబర్ 12AMకి ఈ సేల్ ఉంటుంది. 29 సెప్టెంబర్ 11PMకు రూ.6500 విలువ కలిగిన జ్యూసర్ మిక్సర్ రూ.2699కి వస్తుంది.

మహా ప్రైస్ డ్రాప్

మహా ప్రైస్ డ్రాప్

దుస్తులు, బ్యూటీ, హోమ్ డెకార్స్ తదితర ఉత్పత్తులపై మహా ప్రైస్ డ్రాప్ పేరుతో 20 శాతం వరకు తక్కువకు విక్రయిస్తున్నారు. రూ.999 విలువ కలిగిన రిమోట్ కంట్రోల్ కార్లు రూ.499కి, డియోడరాంట్స్ పైన 40 శాతం తగ్గింపు, రూ.3వేల విలువ కలిగిన ప్రెజర్ కుక్కర్ రూ.1349కి రానుంది.

రష్ హవర్

రష్ హవర్

సెప్టెంబర్ 29, 30 తేదీలలో ఉదయం 12 గంటల నుంచి 2 గంటల మధ్య రష్ హవర్ పేరుతో ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌కు వివిధ రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. దుస్తులు, సైకిల్స్, బెడ్స్ ఉంటాయి.

బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ తేదీలు

బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ తేదీలు

- 29-Sep-2019 నుంచి 04-Oct-2019 - TVs & Appliances Up to 75% Off

- 29-Sep-2019 నుంచి 04-Oct-2019 - Clothing, Footwear Up to 90% Off

- 29-Sep-2019 నుంచి 04-Oct-2019 - Toys, Beauty & Baby Care From Rs.49

- 29-Sep-2019 నుంచి 04-Oct-2019 - Home & Furniture 50 - 90% Off

- 29-Sep-2019 నుంచి 04-Oct-2019 - Grocery Rs.1 Deals

- 30-Sep-2019 నుంచి 04-Oct-2019 - Mobile Phones Lowest Prices of the Year

-30-Sep-2019 నుంచి 04-Oct-2019 - Electronics Up to 90% Off

- 30-Sep-2019 నుంచి 04-Oct-2019 - Laptops & Tablets Best Offers

English summary

రూ.1 లక్ష షాపింగ్ చేయండి, పండుగ తర్వాత చెల్లించండి: బంపరాఫర్లు ఇవే... | No Credit Card needed: Buy goods worth Rs.1 lakh, pay later this festival

This festival season, you can make purchases up to Rs 1 lakh and pay later without credit card. During its upcoming The Big Billion Days sale from 29th September, Flipkart’s innovative Cardless Credit feature would allow customers to shop up to Rs Rs 1 lakh and pay later.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X