For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫ్‌డీపై వడ్డీ తగ్గుతోందా? అయితే ఈ ప్రత్యామ్నయాలు బెటర్!

|

డబ్బంటే ఎవరికి చేదు? తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని భావిస్తారు. అందుకు ఉన్న అవకాశాలేమిటని పరిశీలిస్తారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతా కంటే నిర్ణీత వ్యవధికి ఫిక్స్‌డ్ చేయడం ద్వారా అధిక వడ్డీ వస్తుందనే ఆశతో పలువురు ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపు మొగ్గుచూపుతారు.

అయితే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు ఈ మధ్యకాలంలో గణనీయంగా తగ్గడంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీఐ)పై చెల్లించే వడ్డీని సైతం తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు పొదుపు సొమ్ముపై రాబడి తగ్గిపోనుంది. ముఖ్యంగా, ఈ పరిణామం సీనియర్‌ సిటిజన్లపై అధిక ప్రభావం చూపనుంది.

అధిక వడ్డీ ఇచ్చే పథకాల కోసం...

అధిక వడ్డీ ఇచ్చే పథకాల కోసం...

సంప్రదాయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తక్కువగా వస్తుండడంతో పలువురు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ తమ పొదుపు సొమ్ముపై అధిక వడ్డీ వచ్చే ఇతర పథకాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎంత వరకు శ్రేయస్కరం? అనే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.

స్మాల్‌ ఫైనాన్స్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌లు...

స్మాల్‌ ఫైనాన్స్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌లు...

ఇలాంటి వారికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు ఆహ్వానం పలుకుతున్నాయి. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులు డిపాజిట్లపై కొంత అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి.

 రిస్క్ ఏమైనా ఉంటుందా?

రిస్క్ ఏమైనా ఉంటుందా?

అయితే ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులు ఈ మధ్య కాలంలో కొత్తగా పుట్టుకొచ్చినవి. ఇవి వాటి వ్యాపారంలో ఇంకా స్థిరత్వం సాధించలేదు కాబట్టి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే కొంత మేర రిస్క్ ఉండొచ్చు. అంతేకాదు, ఈ తరహా బ్యాంక్‌ శాఖ మీరుంటున్న ప్రాంతంలో ఉందో లేదో కూడా తెలుసుకోండి. లేకపోతే భవిష్యత్‌లో లావాదేవీలు జరపడం కష్టమవుతుంది.

ఇలా చేయడం శ్రేయస్కరం...

ఇలా చేయడం శ్రేయస్కరం...

రిస్క్ బారి నుంచి తప్పించుకోవాలంటే.. మీ పొదుపు సొమ్ము మొత్తం ఈ తరహా బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం మంచిది. కాబట్టి మీ దగ్గరున్న సొమ్ములో 25 శాతం వరకు ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టవచ్చని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.

కార్పొరేట్‌ కంపెనీల డిపాజిట్లు...

కార్పొరేట్‌ కంపెనీల డిపాజిట్లు...

ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కార్పొరేట్ కంపెనీలు ఆఫర్ చేసే పథకాలు కూడా మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఎంచుకునే ముందు.. అత్యుత్తమ రేటింగ్‌ (ఏఏఏ) కలిగిన కార్పొరేట్‌ కంపెనీల డిపాజిట్‌ పథకాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ తరహా కంపెనీలు ఏడాది, మూడేళ్ల కాలపరిమితికీ డిపాజిట్లను స్వీకరిస్తున్నాయి.

ఏడాది పొడవునా అందుబాటులో...

ఏడాది పొడవునా అందుబాటులో...

కార్పొరేట్ కంపెనీలైన బజాజ్‌ ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా ఫైనాన్స్‌, ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల కంటే 1నుంచి 2.5 శాతం మేర అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. అంతేకాదు, ఏడాది పొడవునా ఈ డిపాజిట్‌ పథకాలు అందుబాటులో ఉంటాయి. పైగా మీరు పొదుపు చేసిన మొత్తంపై.. ప్రతినెలా, మూడు, ఆరు నెలలకు లేదా వడ్డీ మొత్తం ఒకేసారి అందుకునే వీలుంటుంది.

English summary

ఎఫ్‌డీపై వడ్డీ తగ్గుతోందా? అయితే ఈ ప్రత్యామ్నయాలు బెటర్! | fixed deposit holders are looking for more interest than banks

The fixed deposit holders who kept their savings in treditional banks now looking at some other schemes which can offer high rate of interest .
Story first published: Sunday, September 22, 2019, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X