38 ఏళ్ల వ్యాపారి అష్మిత్ విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఆయన భరణంగా తన భార్యకు రూ.30 లక్షలు చెల్లించాలి. ఇదివరకు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.10 లక్షలు వచ్చాయి. మరికొద్ది నెలల్లో మరో రూ.20 లక్షలు చేసి ఆ మొత్తాన్ని భరణంగా ఇవ్వాలి. కానీ ఏం చేయాలో తోచడం లేదు. ఇలాంటి వారి కోసమే బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశాల్లో ఇలాంటివి విపరీతమే. కానీ పాశ్చాత్య దేశాల్లో ఈ పథకాలు ఎప్పుడో అమలులోకి వచ్చాయి.

జపాన్‌లు డైవర్స్ ఇన్సురెన్స్ తప్పనిసరి దిశగా...
ఈజిప్ట్ వంటి దేశాల్లో డైవర్స్ ఇన్సురెన్స్‌ను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. పురుషులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయకుండా తమ మాజీ భార్యలకు చెల్లింపులు చేసేలా ఉండేందుకు ఈ చట్టాన్ని పరిశీలిస్తోంది ఈజిప్ట్. విడాకులకు అనుసంధానించబడిన ఆర్థిక ఖర్చులు, జీవిత భాగస్వామికి తదుపరి చెల్లింపుల అంశాన్ని పరిశీలిస్తే భారతీయులు డైవర్స్ కవర్ చేసేందుకు బీమా పొందే సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నారు.

భారత్‌లో డైవర్స్ సంఖ్య తక్కువే కానీ
భారతదేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంది. అయితే గత దశాబ్దకాలంగా మాత్రం విడాకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 13,62,316 డైవర్స్ జరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. అదే సమయంలో మనకు మాత్రం ఇది పెద్ద సంఖ్యనే.

డైవర్స్ సెటిల్మెంట్ రూ.2.04 లక్షల కోట్లు
విడాకుల సగటు భరణం రూ.15 లక్షలుగా తీసుకుంటే పై 1.36 మిలియన్ల విడాకుల సెటిల్మెంట్లలోకు రూ.2.04 లక్షల కోట్లు అవుతుంది. ఇవి కాకుండా చట్టబద్దమైన ఖర్చులు, పిల్లల సపోర్ట్‌కు మరిన్ని లక్షల రూపాయల ఖర్చు. గత ఐదు నుంచి ఏడేళ్లలో భారతదేశంలో భరణం చెల్లింపు 35 శాతం వరకు పెరిగిందని అంచనా.

పెళ్లి సమయంలోనే పాలసీ...
ఇలాంటి సమయంలో డైవర్స్ ప్రొసీడింగ్స్ కోసం కూడా బీమా పాలసీని తీసుకోవడం అనేది వివేకవంతమైన ఆలోచన! సాధారణంగా వివాహ సమయంలో తీసుకుంటే ఈ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ విడాకులకు సంబంధించిన అన్ని ఖర్చులను కూడా అందిస్తుంది. అంటే దాదాపు పెళ్లి సమయంలోనే ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రీమియం ఎంత అంటే...
డైవర్స్ ఇన్సురెన్స్‌కు చెల్లించాల్సిన ప్రీమియం వ్యక్తి సంపాదన సామర్థ్యం, దంపతుల ఆదాయ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంభ రెండు మూడేళ్ల వ్యవధి సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో క్లెయిమ్ చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు.

కనీస కవరేజ్ రూ.25 లక్షల నుంచి మొదలు...
కనీస కవరేజ్ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ప్రారంభమవుతుంది. వీటి ప్రీమియం ఏడాదికి రూ.15,000 కంటే తక్కువగా ఉంటుంది. కవరేజీతో పాటు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం కూడా పెరుగుతుంది. వ్యక్తి ఆర్జన సామర్థ్యం, ఆస్తిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. వైవాహిక బంధం ఎన్నాళ్లపాటు కొనసాగిందన్న అంశంపై బీమా కవరేజీ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. పదేళ్ల కాలానికి పైగా వైవాహిక జీవితం కొనసాగితే జీవితకాలం భరణం పొందేందుకు అర్హత ఉంటుంది. ఎవరైనా వ్యక్తి అదనపు బీమాకోరుకుంటే టాపప్ ప్లాన్స్ అందించవచ్చు.

నికర విలువలో మూడింట ఒక వంతు...
భారత్‌లో భార్య కోరిన మొత్తం ఇవ్వాలనే రూలేమీ లేదు. ఒకే మొత్తంలో పరిష్కారం విషయంలో ఈ మొత్తం భర్త నికర విలువలో మూడింట ఒక వంతు వరకు ఉండవచ్చు. ప్రపంచంలో తొలుత విడాకుల ఇన్సురెన్స్ పాలసీని 2010లో అందుబాటులోకి తెచ్చారు. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన సేఫ్ గార్డ్ గ్యారెంటీ కార్ప్ అనే ఇన్సురెన్స్ స్టార్టప్ దీనిని ప్రవేశపెట్టింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications