For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏది బెటర్? రికరింగ్ డిపాజిట్-సిప్!

|

సంపాదిస్తున్న మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయకుంటే భవిష్యత్ అవసరాలకు చేతిలో పైసా లేకుండా అవుతుంది. చాలా మంది పొదుపు చేయడం కన్నా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారు డబ్బు అవసరం ఉన్నప్పుడు మరొకరి వద్ద చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కాస్త అలోచించి సంపాదిస్తున్న సొమ్ములో ఎంతో కొంత పొదుపు చేయడం వల్ల సంపదను పెంచుకోవచ్చు. పొదుపు చేయాలనుకునే మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే సంపద వృద్ధి చెందుతుంది. అయితే నెలవారీగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల అప్షన్లున్నాయి. అవి ఒకటి రికరింగ్ డిపాజిట్, రెండోది క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్). వీటిలో దేని ప్రత్యేకత దానిదే. అయితే వీటి లక్షణాలు తెలుసుకోవడం వల్ల దేన్నీ ఎంచుకోవాలన్న దాని పై ఒక అవగాహనా వస్తుంది.

ATM కార్డు తిరిగిచ్చే టైం! SBI కస్టమర్స్ తెలుసుకోవాలి

రీకరింగ్ డిపాజిట్లు

రీకరింగ్ డిపాజిట్లు

* బ్యాంకు,లు, పోస్టాఫిసులవద్ద వద్ద రికరింగ్ నచ్చిన రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈ డిపాజిట్ కాలపరిమితి, నెలవారీగా డిపాజిట్ చేయాలనుకునే మొత్తాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.

* పథకం ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు నెలవారీగా తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

* సాధారణంగా రికరింగ్ డిపాజిట్ కనీస కాలపరిమితి 6 నెలలు ఉంటుంది. గరిష్టంగా పదేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది.

డిపాజిట్ కాలపరిమితి, డిపాజిట్ మొత్తాన్ని బట్టి...

డిపాజిట్ కాలపరిమితి, డిపాజిట్ మొత్తాన్ని బట్టి...

* డిపాజిట్ కాలపరిమితి, డిపాజిట్ మొత్తాన్నీ బట్టి వడ్డీ ఉంటుంది.

* సీనియర్ సిటిజన్లకు వడ్డీరేటు కాస్త ఎక్కువ ఉంటుంది.

* మన పొదుపు లక్షానికి అనుగుణంగా నెలవారీ పొదుపు మొత్తాన్ని ఎంచుకోవడం మంచిది.

* రికరింగ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ నిర్దేశిత పరిమితి దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* ఆర్డీ లను ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అయితే కళాపరిమితికన్నా ముందుగా తీసుకుంటే లేదా స్కీం ను ముగించుకుంటే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సిప్..

సిప్..

* మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. సిప్ లో ఇన్వెస్టర్లు వారానికి ఒకసారి, నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి డిపాజిట్ చేయవచ్చు.

* సిప్ లో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టవచ్చు.

* సిప్ లో పెట్టుబడిని మన ఎంపిక ప్రకారం డెట్ లేదా ఈక్విటీ కి కేటాయిస్తారు. రిస్క్ తీసుకునే సామర్ధ్యాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

* ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లకన్నా సిప్ లు ఎక్కువ రిటర్న్ ను అందిస్తున్నాయి. అయితే వీటిపై రిటర్న్ మారుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ గమనాన్ని బట్టి కాపిటల్ రిస్క్, రిటర్న్ ఉంటుంది.

* సిప్ లను కూడా ఎప్పుడంటే అప్పుడు ముగించుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీ ఉండదు.

* ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈ ఎల్ ఎస్ ఎస్) లో పెట్టుబడి పెట్టె సిప్ పెట్టుబడులు, రిటర్న్ పై పన్ను మినహాయింపు ఉంటుంది.

* గత ఐదు పదేళ్ల కాలంలో సిప్ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు గరిష్టంగా 20 శాతం వరకు ఉన్నాయి.

English summary

ఏది బెటర్? రికరింగ్ డిపాజిట్-సిప్! | Recurring Deposit Vs SIP: Which one is better?

Recurring Deposit is liquid but premature withdrawal or closure will attract penalty charges. In terms of liquidity, a SIP is better when compared to RD.
Story first published: Wednesday, August 28, 2019, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X