ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి బ్యాంకులు కాజేస్తున్నారు. తమ బ్యాంకు ఎక్కడ క్లోనింగ్ అవుతుందోనని కస్టమర్లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఈ సౌకర్యం ఎస్బీఐ యోనో కార్డు ద్వారా అందుబాటులో ఉంది.

యోనో యాప్ ద్వారా పరిమిత నగదు ఉపసంహరణ
ఏటీఎం కార్డు లేకుండానే విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఏటీఎం కార్డును సరెండర్ చేయాలా, కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తవచ్చు. ఎస్బీఐ క్యాష్ విత్ డ్రా కోసం సెక్యూర్డ్ సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ కార్డు సరెండర్ అంశంపై మీకు డౌట్స్ రావొచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా నగదు ఉపసంహరణ పరిమితం.

యోనో ఫంక్షన్ ఉన్న ఏటీఎంలలో..
మీరు యోనో యాప్ ప్లాట్ ఫాం ద్వారానే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా కావాలనుకుంటే సెలెక్టెట్ ఏటీఎంల వద్ద (యోనో క్యాష్ పాయింట్ -YCP) వద్ద మాత్రమే నగదును కలెక్ట్ చేసుకోగలరు. అందులోను కస్టమర్ వెళ్లిన ఎస్బీఐ ఏటీఎంలలో కూడా యోనో క్యాష్ ఫంక్షన్ తప్పనిసరి అని ఎస్బీఐ తెలిపింది.

ఏటీఎం కార్డు అప్పగింత మీ ఇష్టం
ఏటీఎం కార్డును తప్పనిసరిగా సరెండర్ చేయాలా అనే మరో ప్రశ్న కూడా తలెత్తవచ్చు. అయితే ఏటీఎం కార్డుల వినియోగం కస్టమర్ ఇష్టం. వినియోగదారుడు తన వ్యక్తిగత అభీష్టం మేరకే ఏటీఎం కార్డును అప్పగించవచ్చు. ఏటీఎం కార్డును కేవలం డబ్బులు విత్ డ్రా చేయడానికి మాత్రమే ఉపయోగించడం లేదు. ఆన్‌లైన్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు వినియోగిస్తున్నాం.

యోనో ప్లాట్ ఫాం ద్వారా క్యాష్ విత్ డ్రా ఎలా చేయాలి?
యోనో యాప్ ద్వారా కార్డు క్యాష్ విత్ డ్రా ఎలా చేయాలో చూద్దాం...
- యోనో యాప్/పోర్టల్‌లోకి లాగిన్ అవండి. యోనో క్యాష్ ఆఫ్షన్ ఎంచుకోవాలి. క్విక్ లింక్స్ YONO Payలో YONO Cash ఎంచుకోండి.
- యోనో క్యాష్ లాండింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు దగ్గరలోని మీ యోనో క్యాష్ పాయింట్స్‌ను తెలుసుకోవచ్చు. Nearest YONO cash Points క్లిక్ చేయడం ద్వారా దీనిని తెలుసుకోవచ్చు.
- క్యాష్ విత్ డ్రా కోసం Request YONO Cash ను సెలక్ట్ చేసుకోండి. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మొదట మీ బ్యాంకు అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఎంత విత్ డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి.
- ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.10,000, రోజుకు గరిష్టంగా రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

పిన్ మీకు మాత్రమే..
- ఏటీఎంను డెలివరీ చానల్‌గా సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత పేజీలో యోనో క్యాష్ పిన్ క్రియేట్ చేయండి.
- మీ డివైజ్ పైన మాత్రమే పిన్ నెంబర్ కనిపిస్తుంది. దీనిని ఎవరికీ షేర్ చేయవద్దు.
- మీ ట్రాన్సాక్షన్స్ వివరాలను సమీక్షించుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించిన తర్వాత Confirm బటన్ పైన క్లిక్ చేయండి.

పిన్ సాయంతో విత్ డ్రా
- నియరెస్ట్ యోనో క్యాష్ పాయింట్‌ను క్లిక్ చేయడం ద్వారా క్యాష్ విత్ డ్రా కోసం మీకు దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్‌ను సెర్చ్ చేయండి.
- దగ్గరలోని యోనో క్యాష్ పాయింటును సెలక్ట్ చేసుకోవాలి.
- యోనో క్యాష్ ఫంక్షన్ కలిగిన ఎస్బీఐ ఏటీఎం నుంచి పిన్ ద్వారా డబ్బులు ఉపసంహరించుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications