For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉందా: ఎన్నో లాభాలు... తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లు వినియోగించే డెబిట్, క్రెడిట్ కార్డుల పైన బోనస్ పాయింట్స్ ఇస్తోంది. ఇందులో క్లాసిక్ డెబిట్ కార్డు ఒకటి. ఈ కార్డు మీకు ఉంటే, దీనిని ఉపయోగించడం ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. నగదు రహిత షాపింగ్ సౌలభ్యాన్ని ఆస్వాదించండంతో పాటు కొనుగోళ్లపై ఫ్రీడమ్ రివార్డ్ పాయింట్లు సంపాదించుకోవచ్చు.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

రివార్డ్ పాయింట్స్ ఆస్వాదించండి

రివార్డ్ పాయింట్స్ ఆస్వాదించండి

స్టేట్ బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డుతో నగదు రహిత షాపింగ్ సౌలభ్యాన్ని ఆస్వాదించండి మరియు మీ కొనుగోళ్లపై ఫ్రీడమ్ రివార్డ్ పాయింట్లను సంపాదించండి. మీ క్లాసిక్ డెబిట్ కార్డుతో మీకు కావలసినప్పుడు, ఎక్కడైనా మీ ఖాతాకు యాక్సెస్ లభిస్తుంది. వస్తువులు కొనుగోలు చేసేందుకు, ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసేందుకు, దేశంలో ఎక్కడైనా నగదును ఉపసంహరించుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.

క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉపయోగం

క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉపయోగం

క్లాసిక్ డెబిట్ కార్డ్ ద్వారపా దేశంలో 5 లక్షలకు పైగా మర్చంట్ ఔట్‌లెట్స్‌లో షాపింగ్ చేయవచ్చు.మూవీ టిక్కెట్ బుకింగ్ కోసం ఉపయోగించవచ్చు. బిల్ పేమెంట్స్ చేయవచ్చు. ఇతర ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు. ఏటీఎం సెంటర్ల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.

డెబిట్ కార్డు లాయాల్టీ ప్రోగ్రామ్

డెబిట్ కార్డు లాయాల్టీ ప్రోగ్రామ్

షాప్, డైన్-ఔట్, ఇంధనం, ట్రావెల్ బుకింగ్, ఆన్‌లైన్ స్పెండింగ్ పైన చెల్లించే ప్రతి రూ.200కు SBI క్లాసిక్ డెబిట్ కార్డు హోల్డర్‌కు ఒక రివార్డు పాయింట్ వస్తుంది. క్లాసిక్ డెబిట్ కార్డు ద్వారా మొదటి మూడు కొనుగోలు ట్రాన్సాక్షన్స్‌కు బోనస్ పాయింట్స్ వస్తాయి. ఈ కార్డు జారీ చేసిన తర్వాత నెల రోజుల్లో తొలి కొనుగోలుకు 50 బోనస్ పాయింట్స్, రెండో కొనుగోలుకు మరో 50 బోనస్ పాయింట్స్, మూడో కొనుగోలుకు 100 బోనస్ పాయింట్స్ వస్తాయి.

రివార్డ్ పాయింట్స్ డబుల్

రివార్డ్ పాయింట్స్ డబుల్

క్లాసిక్ డెబిట్ కార్డును ఓ త్రైమాసికంలో మూడుసార్లు పర్చేజ్ ట్రాన్సాక్షన్‌కు ఉపయోగించండి. దీంతో ఆ క్వార్టర్‌కు మీరు డబుల్ పాయింట్స్ పొందవచ్చు. ఈ ఫ్రీడమ్ రివార్డు పాయింట్స్ మీకు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ బహుమతులు కూడా పొందవచ్చు. క్లాసిక్ డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి రోజుకు కనీసం రూ.100, గరిష్టంగా రూ.20,000 విత్ డ్రా చేయవచ్చు. డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్ /ఈ-కామర్స్ లిమిటెడ్ ‌లో కనీస పరిమితి లేదు. గరిష్టంగా మాత్రం రూ.50,000. అలాగే, మీ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ పైన ఎస్సెమ్మెస్ అలర్ట్స్ పొందడం మంచింది.

English summary

SBI క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉందా: ఎన్నో లాభాలు... తెలుసుకోండి | Use of State Bank Classic Debit Card

Enjoy the convenience of cashless shopping with State Bank Classic Debit Card and earn FreedomRewardz points on your purchases. With your State Bank Classic Debit Card you get access to your account whenever and wherever you want.
Story first published: Monday, July 22, 2019, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X