For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ మరణాలకు టర్మ్ ఇన్సూరెన్సు వర్తిస్తుందో తెలుసా?

|

ఎవరికైనా తమ కుటుంబమంటే ప్రేమ ఉంటుంది. తమ కుటుంబ సభ్యులను వీలైనంత వరకు సుఖ సంతోషాలతో ఉంచాలని భావిస్తారు. ముఖ్యంగా కుటుంబ పెద్ద ఈ భాద్యతను తీసుకుంటారు. మిగతా వారు చేదోడుగా ఉంటారు. అయితే ఊహించని విధంగా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చే , రక్షణను కల్పించే పెద్ద మృతి చెందితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేము. ఇలాంటి సమయంలో ఆర్థికంగా ఆదుకునేది టర్మ్ ఇన్సూరెన్సు.

టర్మ్ ఇన్సూరెన్సు కింద ఎప్పుడు కవరేజి లభిస్తుంది, ఎప్పుడు లభించదంటే..

టర్మ్ ఇన్సూరెన్సు కింద ఎప్పుడు కవరేజి లభిస్తుంది, ఎప్పుడు లభించదంటే..

* సహజ మరణాలు లేదా ఆరోగ్య పరమైన అంశాల కారణంగా మృతి చెందితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ లభిస్తుంది.

* పాలసీదారు తీవ్రమైన అనారోగ్యం లేదా మెడికల్ కండిషన్ లో మృతి చెందితే పాలసీ లబ్దిదారులకు సమ్ అష్యురెన్సు ను అందజేస్తారు.

* ప్రమాదం వల్ల మరణిస్తే కూడా పరిహారం లభిస్తుంది. అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడిపిన సందర్భంలో మరణం సంభవిస్తే లేదా ఏదైనా నేర పూరిత కార్యకలాపాల్లో భాగస్వామి అయితే బీమా క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం ఉండవచ్చు.

* స్కై డైవింగ్, పారాషూటింగ్, రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి సహస క్రీడల సందర్భంలో మృతి చెందితే కంపెనీలు పరిహారం చెల్లించకపోవచ్చు.

ఆత్మహత్య..

ఆత్మహత్య..

* పాలసీ తీసుకున్న వారు కొన్ని సందర్భాల్లో ఆత్మ హత్య చేసుకునే అవకాశాలు ఉండవచ్చు. పాలసీ ప్రారంభమైన తొలి పన్నెండు నెలల కాలంలో ఆత్మ హత్య చేసుకుంటే చెల్లించిన ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని లబ్దిదారుకు చెల్లిస్తారు. నాన్ లింక్డ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. ఒకవేళ లింక్డ్ ప్లాన్లు అయితే చెల్లించిన ప్రీమియంలో వంద శాతం చెల్లిస్తారు.

* ఆత్మ హత్య ద్వారా మృతి చెందితే కొన్ని కంపెనీలు కవరేజీ ఇవ్వవచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు.

* అందుకే బీమా తీసుకునే ముందు సంభందిత పాలసీలో ఉన్న నియమ నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

మరిన్ని...

మరిన్ని...

* హెచ్ ఐ వీ లేదా ఎయిడ్స్ ద్వారా మృతి చెందితే బీమా కంపెనీలు క్లైమును అనుమతించే అవకాశం ఉండదు.

* ఎక్కువగా ఆల్కహాల్ లేదా డ్రగ్స్ మోతాదుకు మించి సేవించి మృతి చెందితే కూడా బీమా కంపెనీలు లబ్ది దారులకు ప్రయోజనాన్ని అందించవు.

* బీమా కలిగి ఉన్న వ్యక్తిని ఒకవేళ హత్యకు గురైన సందర్భంలో నామినీ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో అనుమానం వ్యక్తమయితీ బీమా కంపెనీలు క్లెయిమ్ ను తిరస్కరిస్తాయి. అయితే తన పాత్ర లేదని తేలితే పరిహారాన్ని పొందవచ్చు.

* ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు మరణిస్తే కంపెనీలు కవరేజీని అందించక పోవచ్చు. అయితే టర్మ్ ఇన్సూరెన్సు తీసుకునే సందర్భంలో ఇందుకు సంభందించిన రైడర్ ను ఎంచుకుంటే మాత్రం పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.

చివరిగా...

చివరిగా...

* ఏ బీమాను తీసుకోవాలనుకున్న ముందుగా ఆ ప్లాన్ లోని అన్ని విషయాలను చదివి అర్ధం చేసుకోవాలి. ఎలాంటి సందర్భంలో పరిహారం లభిస్తుంది, ఎలాంటి సందర్భంలో లభించిందన్న విషయాలపై అవగాహనా పెంచుకోవాలి.

* రైడర్లను గురించి కూడా తెలుసుకోవాలి. క్లెయిమ్ ల విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా నిభందనలు పాటించవచ్చు. వీటి గురించి తెలుసుకుంటే పరిహారం పొందే విషయంలో ఇబ్బందులు ఉండవు. అందుకే మీరు పాలసీ తీసుకునే ముందు మీ ఏజెంట్ లేదా కంపెనీకి చెందిన ప్రతినిధుల ద్వారా పూర్తి సమాచారం పొందిన తర్వాతనే పాలసీని కొనుగోలు చేయండి.

English summary

ఏ మరణాలకు టర్మ్ ఇన్సూరెన్సు వర్తిస్తుందో తెలుసా? | Term Insurance plan for death

The natural death or caused by health related issues is covered by term life insurance plans.
Story first published: Friday, July 26, 2019, 7:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X